breaking news
jayanthi sabha
-
దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని రక్షించు
పత్తికొండ టౌన్ : దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని వైఎసాస్ర్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి కోరారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ పిలుపు మేరకు పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద, దీక్షా శిబిరం వద్ద ఆమె మాట్లాడారు. దుర్మార్గ ప్రభుత్వాలను శిక్షించి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బీజేపీతో కలసి ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం పాటుపడకుండా నిద్రపోయారన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నందున ప్రజల్లోకి వెళితే తరిమికొడతారనే భయంతో ఇపుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు. అధికారంలో ఉండి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ప్రత్యేక హోదా సాధించడం చేతకాక ధర్నాలు, ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీ, టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెపుతారన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు భీమలింగప్ప దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. సాయంత్రం కంగాటి శ్రీదేవి, సీపీఎం నాయకులు రంగారెడ్డి, వెంకటేశ్వర్లు రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, పత్తికొండ మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, చక్రాళ్ల సర్పంచ్ శ్రీరాములు, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు కారం నాగరాజు, రవికుమార్ నాయుడు, అంజి, రాంమోహన్‌రెడ్డి, నరసింహయ్య, ఆస్పరి రవిచంద్ర, హుసేన్, నజీర్, లాలు, షరీఫ్, బురుజుల భరత్‌రెడ్డి, కారుమంచి, దేవన్న, పెద్దహుల్తి నాగరాజు, పోతుగల్లు వెంకటేశ్, మల్లికార్జునరెడ్డి, రంగానాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షలలో పాల్గొన్నవారు పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన వై ఎస్సార్సీపీ నాయకులు బనగాని శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, జనార్దన్‌నాయుడు, వీరాంజనేయులు, సురేశ్‌బాబు, శాంతిరెడ్డి, వర్ధరాజులు, కృష్ణమూర్తి, కేశప్ప, నాగప్ప, నెట్టికంటయ్య, సిద్దు, విజయ్ దీక్షల్లో కూర్చున్నారు. -
రావిశాస్త్రి జయంతి సభ
ఈవెంట్ రావిశాస్త్రి 93వ జయంతి సభ జూలై 30న సాయంత్రం 6 గంటలకు విశాఖ పౌరగ్రంథాలయంలో జరగనుంది. సూత్రధారి: రావిశాస్త్రి తమ్ముడు రాచకొండ నరసింహశర్మ. అధ్యక్షత: ఎల్.ఆర్.స్వామి. ‘రావిశాస్త్రి సాహిత్యం-సామాజిక న్యాయం’ అంశంపై దుప్పల రవికుమార్, గరిమెళ్ళ నాగేశ్వరరావు, పేరి రవికుమార్, కె.జి.వేణు ప్రసంగిస్తారు. అద్దేపల్లి రామమోహనరావు, వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, మంగు శివరామప్రసాద్, ఎస్.గోవిందరాజులు ప్రభృతులు పాల్గొంటారు. వివరాలకు రామతీర్థ ఫోన్: 9849200385 కవిత్వ కార్యశాల సాహితీస్రవంతి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో ఆగస్టు 2న(ఆదివారం) పూర్తిరోజు కవిత్వ కార్యశాల జరగనుంది. ఈ కవిత్వ శిక్షణా శిబిరాన్ని తెలకపల్లి రవి ప్రారంభిస్తారు. సీతారం, మేడిపల్లి రవికుమార్ నిర్వహిస్తారు. గంటేడ గౌరునాయుడు, అరుణ పప్పు, చందు సుబ్బారావు, వొరప్రసాద్, సత్యాజీ తదితరులు పాల్గొంటారు. పేర్లు నమోదు చేసుకునేవారు సాహితీ స్రవంతి అధ్యక్షులు ఎ.వి.రమణారావును 9848710507 నంబర్లో సంప్రదించవచ్చు. ‘గడియారం’ స్మారక పురస్కారం 35 ఏళ్లుగా రచన సాహిత్య వేదిక వారు అందిస్తున్న మహాకవి గడియారం వేంకట శేషశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం- 2015 కొరకు పద్యకావ్యాలను ఆహ్వానిస్తున్నాం. విజేతకు 5,000 రూపాయల నగదు, సత్కారం ఉంటాయి. పోటీకి పంపే పద్యకావ్య ముద్రణ జనవరి 1, 2011- డిసెంబర్ 31, 2014 మధ్యకాలంలో జరిగివుండాలి. 4 ప్రతుల్ని ఆగస్టు 31లోగా ఈ చిరునామాకు పంపండి: ఎన్.సి.రామసుబ్బారెడ్డి, 7/201-3ఇ, జయనగర్ కాలనీ, కడప-516002; ఫోన్: 7893089007 - విహారి, అధ్యక్షుడు ఫోన్: 9848025600.