breaking news
Janmabhoomi-maa vooru program
-
జన్మభూమిలో 12.50 లక్షల రేషన్‌కార్డులు
నూతన సంవత్సర సందేశంలో ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: జనవరి రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకూ జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో 12.50 లక్షల మందికి రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఐదు వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. శుక్రవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జన్మభూమి-మా ఊరులో స్మార్ట్ వార్డ్, విలేజ్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవటంతో పాటు వాటిని దత్తత తీసుకున్న ప్రముఖులను గ్రామ సభల్లో పరిచయం చేస్తామన్నారు. కేంద్రం సహాకారంతో రాష్ర్ట విభజన నాటి హామీలను ఒక్కొక్కటి అమలు జరిగేలా చూస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
అర్జీలే..అర్జీలు
ముగిసిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలు * ప్రజల నుంచి సుమారు 2.50 లక్షల దరఖాస్తులు * 27 వేల మందికి పింఛన్ల నిలిపివేత * కొత్తగా పింఛన్లు కోరుతూ 25 వేల దరఖాస్తులు * 100 వాటర్ ప్లాంట్లతో సరి ఏలూరు : జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. చివరి రోజున పెంటపాడు మండలం పడమర విప్పర్రు, పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామాల్లో సభలు నిర్వహించారు. అక్టోబర్ 2న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, హుద్‌హుద్ తుపాను కారణంగా గత నెల 11 నుంచి వారుుదా వేశారు. తిరిగి నవంబర్ 1నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాగా, ఆ రోజున ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో జరిగిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. పింఛను మొత్తాలను పెంచిన ప్రభుత్వం జిల్లాలో సుమారు 27 వేల మంది పింఛనుదారులను అనర్హులుగా పేర్కొంటూ.. వారికి ఆ మొత్తాలను ఇవ్వడం నిలిపివేయడం విమర్శలకు తావిచ్చింది. ఘుల్లుమన్న లబ్ధిదారులు న్యాయం చేయండంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా పింఛన్లు మంజూ రు చేయూలంటూ 25 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. జన్మభూమిలో భాగంగా చేపట్టిన నీరు-చెట్టు, స్వచ్ఛ భారత్‌పై అవగాహన కార్యక్రమాలు మొక్కుబడిగానే సాగాయి. అర్జీలు ఫుల్.. పరిష్కారం నిల్ సామాజిక సమస్యలు, మౌలిక వసతుల కల్పన, ఇతర అంశాలపై ప్రజల నుంచి రమారమి 2.50 లక్షల అర్జీలు అందారుు. మండలాల వారీగా వచ్చిన అర్జీలను కేటగిరీల వారీగా విభజించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి అర్జీని ఆన్లైన్లో పొందుపర్చడానికి చాలా సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో పంచాయతీలకు అభివృద్ధి పనుల నిమిత్తం రూ.5 నుంచి రూ.20 లక్షల వరకు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మొత్తాలను జన్మభూమి సభల సందర్భంగా వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు చేపడితే ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం టీడీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 100 వాటర్ ప్లాంట్ల ప్రారంభం రక్షిత నీరు లభ్యం కాని నివాసిత ప్రాంతాల్లోని ప్రజలకు రూ.2కే 20 లీటర్ల మంచినీటిని అందించేందుకు వీలుగా వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. జిల్లాలో కనీసం 340 వాటర్ ప్లాం ట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటిం చగా, సుమారు 100 ప్లాంట్లను మాత్రమే ప్రారంభించారు. కొన్నిచోట్ల ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్లాంట్లకు కొత్త రంగులు వేసి వాటిని కొత్తగా ఏర్పాటు చేసినట్టు ప్రకటిం చడం విమర్శల పాలైంది. కాగా, జన్మభూమి గ్రామ సభల సందర్భంగా 1,400 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు యంత్రాంగం చెబుతోంది.