breaking news
Irshad
-
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పలువురికి గాయాలు కళాశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఘటన ఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్, డీఎస్పీ బెరైడ్డిపల్లె: రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ ప్రయివేటు కళాశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని జాలారిపల్లె వద్ద చోటుచేసుకుంది. పలమనేరులోని ఓ కళాశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను తీసుకెళ్లే క్రమంలో జాలారిపల్లె వద్ద రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో ఇతర పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రయాణికులతో కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ అదుపు తప్పి కళాశాల బస్సును ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తున్న మండలంలోని కామినాయనపల్లెకు చెందిన అబ్దుల్లా కుమారుడు ఇర్షాద్(18), బాబ్జాన్, మహమ్మద్, దావద్, రాజేష్, నీరజ, కళాశాల బస్సులో ప్రయాణిస్తున్న జయలక్ష్మి, రజిత గాయపడ్డారు. ఇర్షాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీకి తరలిం చారు. అక్క డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన వారిని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగి న సమయంలో సబ్ కలెక్టర్ కరుణన్ కుప్పం వెళుతున్నారు. వెంటనే వాహనా న్ని ఆపి పరిస్థితిని సమీక్షించారు. డీ ఎస్పీ హరినాథ్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బెరైడ్డిపల్లె ఎస్ఐ హరిహరప్రసాద్, సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇర్షాద్ మృతితో తల్లడిల్లిన కుటుంబం ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఇర్షాద్‌పై అబ్దుల్లా దంపతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చేతికంది వచ్చిన కుమారుడు అండగా ఉంటాడని అనుకుంటుండగా మృత్యువు కబళించడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పో యింది. ‘మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా నాయనా’ అంటూ తల్లి కు మారుడి మృతదేహంపై పడి ఏడవడం చూపరులను కంటతడి పెట్టించి ంది. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం మృతిచెందిన ఇర్షాద్ కుటుంబాన్ని ఆదుకునేలా ఉన్నతాధికారులకు నివేదిక పం పుతాం. గాయపడిన బాబ్జాన్, మహమ్మద్‌కు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాం. రాము, పలమనేరు డిపో డీఎం -
అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ భార్య మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి కానిస్టేబుల్ ఇర్షాద్ భార్య అనుమాన్సద స్థితిలో మరణించింది. కాగా బంధువులు మాత్రం ఇర్షాదే భార్యను కొట్టి చంపాడని ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.