breaking news
Indian Hostages
-
బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు
న్యూఢిల్లీ: సూడాన్ సైన్యం, సూడాన్ పారామిలటరీ విభాగాల మధ్య నెలల తరబడి జరుగుతున్న అంతర్యుద్దంతో రావణకాష్టంగా కాలిపోతున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన, బందీలుగా మారిన భారతీయులను విడిపించేందుకు ప్రయతి్నస్తామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లో సూడాన్ రాయబారి మొహమ్మెద్ అబ్దల్లా అలీ ఎల్తోమ్ సోమవారం ఢిల్లీలో మాట్లాడారు. ‘‘పారామిలటరీ అయినా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్) వద్ద బందీగా ఉన్న భారతీయుడిని విడిపించి సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత విదేశాంగశాఖతో నిరంతరం సంప్రతింపులు జరుపుతున్నాం. గతంలోనూ మా దేశంలోని ఇతర నగరాల్లో భారతీయులు చిక్కుకుపోతే వారిని కాపాడేందుకు భారత విదేశాంగశాఖతో కలిసి పనిచేశాం’’అని ఆయన చెప్పారు. అల్ ఫషీర్ పట్టణంలో ఉంటున్న 36 ఏళ్ల భారతీయుడు ఆదర్శ్ బెహెరాను ఆర్ఎస్ఎఫ్ బలగాలు కిడ్నాప్ చేసి తమకు పట్టున్న న్యాలా నగరానికి తరలించాయి. ఆదర్శ్ స్వస్థలం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా. ‘‘ప్రస్తుతం సూడాన్‌లో ఏం జరుగుతుందో ఊహించం అసాధ్యం. అతడిని బలగాలు బాగానే చూసుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలోనే ఆయనను విడుదలచేయగలమని భావిస్తున్నా. సంక్షోభకాలంలోనూ భారత్ మాకు మానవతాసాయం అందించింది. గతంలో వైద్య, ఆహార సామగ్రి అందించి మమ్మల్ని ఆదుకుంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. సూడాన్ త్వరలో పునరుద్దరణ దశకు చేరుకుంటుంది. అప్పుడు పునరుజ్జీవన క్రతువులో భారత్ కీలకపాత్ర పోషిస్తుంది’’అని ఆయన అన్నారు. ఎందుకీ అంతర్యుద్ధం? 2021 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటుతో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్‌ర్‌ఎస్‌ఎఫ్‌తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రతిపాదన రూపొందించారు. ఇందుకు ఆర్ఎస్ఎఫ్ ససేమిరా అంది. దంతో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో ఇరు వర్గాలు మెషీన్ గన్లు అమర్చిన ట్రక్కులు, సైనికులతో పరస్పర కాల్పులు, దాడులకు తెగబడ్డాయి. దంతో ఆనాటి నుంచి ఇప్పటిదాకా వేలాది మంది చనిపోయారు. కోటి మంది సూడాన్‌ను వెళ్లిపోయినట్లు ఓ అంచనా. -
ఆ 38 మృతదేహాలను భారత్‌కు..
అమృత్సర్: పొట్టకూటికోసం ఇరాక్ వెళ్లి, అంతర్యుద్ధం సమయంలో ఐసిస్ చేతిలో కిరాతకంగా హతమైన 38 మంది భారతీయు మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఆర్మీ విమానంలో బాగ్ధాద్ నుంచి అమృత్సర్(పంజాబ్)కు తరలించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచనమేరకు సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకుగానూ సింగ్ ఆదివారం ఆర్మీకి చెందిన విమానంలో బాగ్ధాద్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అత్యధికులు పంజాబీలే: ఇరాక్‌లో చనిపోయిన 39 మందిలో ఒక మృతదేహానికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సిన ఉండగా, మిగిలిన 38 మంది మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. వీరిలో అత్యధికులు పంజాబీలే కావడం గమనార్హం. సోమవారం తీసుకొచ్చిన 38 మృతదేహాల్లో 27 దేహాలను పంజాబ్‌లోనే దించేశారు. అక్కడి నుంచి ఆయా మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మిగిలిన మృతదేహాలను పట్నాకు తరలించారు. బాగ్ధాద్లోని భారత రాయయార కార్యాలయం మృతదేహాల తరలింపులో కీలక పాత్ర పోషించింది. కాగా, ఆ 39 మందిని చంపేశారు మంత్రి ఆగ్రహం: 38 మృతదేహాలతోపాటు అదే విమానంలో తిరిగొచ్చిన మంత్రి వీకే సింగ్‌ను అమృత్సర్ ఎయిర్‌పోర్టు నుంచి పంజాబ్ రాష్ట్ర మంత్రులు నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇంకొందరు తోడ్కొని వెళ్లారు. అనంతరం వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది ఫుట్‌బాల్ ఆడినట్లో లేదా బిస్కెట్లు తయారుచేసినంత సులువైన పనికాదు. ఇప్పటికిప్పుడు పరిహారంపై నన్నడిగితే ఏం చెప్పాలి? కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అప్పటిదాకా నేనేమీ చెప్పలేను’’ అని విసుక్కున్నారు. బాగ్ధాద్ విమానాశ్రంలో దృశ్యాలు.. -
38 మంది భారతీయుల మృతదేహాల తరలింపు


