breaking news
India v New Zealand
-
IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం... 60 వేలకు పైగా సామర్థ్యంతో దేశంలోని మూడో అతి పెద్ద క్రికెట్ మైదానం... ఇప్పుడు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై ఆసక్తి పెరిగేందుకు ఇది మాత్రమే కారణం కాదు. బుధవారం హైదరాబాద్ మ్యాచ్ అందించిన వినోదం ఈ సిరీస్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. భారత్ ఏకపక్ష విజయం సాధించి ఉంటే... కివీస్ 131/6 నుంచి గెలుపు అంచుల దాకా వెళ్లకుండా ఉంటే ఈ మ్యాచ్‌కు ఇంత ఆకర్షణ వచ్చి ఉండేది కాదేమో! ఈ నేపథ్యంలో మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారుతుందా అనేది చూడాలి. రాయ్‌పూర్: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్‌ను గెలుచుకునే లక్ష్యంతో భారత జట్టు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ టీమిండియా ఖాతాలో చేరుతుంది. మరోవైపు పట్టుదలకు మారుపేరైన కివీస్ గత మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని అందుకొని సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్ల ఆట, బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయం. ఉమ్రాన్‌కు చాన్స్! ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఒకేసారి ముగ్గురు ‘డబుల్ సెంచూరియన్’లు భారత తుది జట్టులో ఆడబోతుండటం విశేషం. ఇది భారత బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... కోహ్లి ఎప్పుడైనా చెలరేగిపోగలడు కాబట్టి సమస్య లేదు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడటం జట్టుకు కీలకం. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌లో సిరాజ్ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పనికొస్తాడని తొలి వన్డేలో శార్దుల్‌ను తీసుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం చూపలేదు. దానికంటే రెగ్యులర్ బౌలర్‌కే అవకాశం ఇవ్వడం మంచిదని భావిస్తే మూడో పేసర్‌గా ఉమ్రాన్ జట్టులోకి తిరిగొస్తాడు. సోధి ఆడతాడా! న్యూజిలాండ్ పోరాటపటిమ ఏమిటో తొలి వన్డేలోనే కనిపించింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా... అనామకుడు అనుకున్న మైకేల్ బ్రేస్‌వెల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌ను చూపించాడు. స్పిన్నర్ సాన్‌ట్నర్ కూడా బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు. ఇదే ఆర్డర్‌ను చూసుకుంటే ఎనిమిదో స్థానం వరకు ఆ జట్టులో బ్యాటర్లకు కొదవ లేదు. గత మ్యాచ్‌లో విఫలమైనా... అలెన్, ఫిలిప్స్ మెరుపు షాట్లతో చెలరేగిపోగల సమర్థులు. కాన్వే, కెప్టెన్ టామ్ లాథమ్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్ గట్టి పోటీనివ్వగలదు. ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన ఫెర్గూసన్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇలాంటి స్థితిలో లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధి గాయం నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది. పిచ్, వాతావరణం స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్‌పై బౌన్స్ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలింగ్‌కూ అనుకూలం. వర్ష సూచన లేదు. భారత జట్టుకు జరిమానా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ జవగల్ శ్రీనాథ్ ప్రకటించారు. -
6 తీస్తే 500 మనదే
-
6 తీస్తే 500 మనదే
భారత్ స్పిన్ వేట మళ్లీ మొదలైంది... ఒక వైపు అశ్విన్, మరోవైపు జడేజా చెలరేగుతుంటే... ఇటు పరుగులూ తీయలేక, అటు వరుసగా వికెట్లు కోల్పోతూ న్యూజిలాండ్ దాదాపుగా ‘సమర్పయామి’ అనేసింది. చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేని అసాధ్యమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు నాలుగో రోజు ముగిసేసరికి తలవంచగా... చరిత్రాత్మక 500వ టెస్టులో విజయానికి భారత్ మరో 6 వికెట్ల దూరంలో నిలిచింది. వర్షసూచన కూడా లేకపోవడంతో చివరి రోజు కోహ్లి సేన గెలుపు లాంఛనమే. అద్భుతమైన స్పిన్‌తో సొంతగడ్డపై ఎదురులేకుండా సాగుతున్న అశ్విన్ మరోసారి అదే జోరులో తొలి మూడు వికెట్లు తీసి కివీస్‌ను కుప్పకూల్చగా... తోడుగా నేనున్నానంటూ జడేజా కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ పూర్తిగా పరుగులు చేయకుండా నిరోధించాడు. తన తొలి 7 ఓవర్లలో ఒకే బౌండరీతో 8 పరుగులు ఇచ్చిన జడేజా... తర్వాతి 7 ఓవర్లను వరుసగా మెయిడిన్‌గా వేయడం విశేషం. అతను వేసిన 84 బంతుల్లో 81 బంతులకు కివీస్ పరుగు తీయలేకపోయిందంటే బౌలింగ్ ఎలా సాగిందో అర్థమవుతుంది. విజయం దిశగా భారత్ vs న్యూజిలాండ్ లక్ష్యం 434 ప్రస్తుతం 93/4 200 వికెట్ల క్లబ్లో అశ్విన్ కాన్పూర్: గ్రీన్‌పార్క్ గ్రౌండ్లో బంతి మరోసారి గింగిరాలు తిరిగింది. ఈసారీ దానిని అడ్డుకోవడం న్యూజిలాండ్ వల్ల కాలేదు. ఫలితంగా తొలి టెస్టులో భారత్ విజయానికి చేరువైంది. తమ 500వ టెస్టును చిరస్మరణీయం చేసుకునే దిశగా కోహ్లి సేన మరో ముందడుగు వేసింది. 434 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 93 పరుగులు చేసింది. ఇప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరిన నేపథ్యంలో ఆ జట్టు మరో 341 పరుగులు చేయడం ఊహించలేనిది! వర్షం ఆటంకం కలిగిస్తే తప్ప ‘డ్రా‘ కోసం ప్రయత్నించినా కివీస్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల ముందు నిలిచే అవకాశం దాదాపుగా లేదు. ప్రస్తుతం క్రీజులో రోంచీ (38 బ్యాటింగ్), సాన్‌ట్నర్ (8 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్‌సను 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్ శర్మ (68 నాటౌట్; 8 ఫోర్లు), రవీంద్ర జడేజా (50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరో వికెట్‌కు 18.3 ఓవర్లలోనే అభేద్యంగా 100 పరుగులు జోడించడం విశేషం. తొలి సెషన్: రాణించిన కివీస్ బౌలర్లు నాలుగోరోజు భారత్ ఆట ప్రారంభించిన సమయం నుంచే చాలా సందర్భాల్లో బంతి అనూహ్యంగా టర్న్ అరుుంది. దాంతో బ్యాట్స్‌మెన్ పదే పదే ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్నారు. 159/1 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన జట్టు తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. సాన్‌ట్నర్ బంతికి విజయ్ (76; 8 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల ముందు దొరికిపోవడంతో 133 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి (18) సోధి బౌలింగ్‌లో స్వీప్ చేయబోయి వెనుదిరగ్గా... కొద్ది సేపటికే పుజారా (78; 10 ఫోర్లు)ను కూడా సోధి అవుట్ చేశాడు. ఆ తర్వాత రహానే, రోహిత్ కలిసి భారత్ ఆధిక్యాన్ని 300 పరుగులు దాటించారు. ఓవర్లు: 34, పరుగులు: 93, వికెట్లు: 3 రెండో సెషన్: రోహిత్, జడేజా జోరు లంచ్ తర్వాత రహానే (40; 4 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే సాన్‌ట్నర్ బౌలింగ్‌లో టేలర్ అద్భుత క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స ముగిసింది. ఈ దశలో జత కలిసిన రోహిత్, జడేజా ధాటిగా ఆడారు. బౌండరీలతో చకచకా పరుగులు సాధించిన రోహిత్, 75 బంతుల్లో అర్ధ సెంచరీతో పాటు టెస్టుల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో వైపు జడేజా కూడా దూకుడును ప్రదర్శించాడు. సోధి బౌలింగ్‌లోనే అతను మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. 58 బంతుల్లో జడేజా హాఫ్ సెంచరీ పూర్తి కాగానే కోహ్లి ఇన్నింగ్‌సను డిక్లేర్ చేశాడు. ఓవర్లు: 26.2, పరుగులు: 125, వికెట్లు: 1 మూడో సెషన్: అశ్విన్ హవా దాదాపు అసాధ్యమైన విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ అశ్విన్ దెబ్బకు కుదేలైంది. ఈ ఆఫ్ స్పిన్నర్ తన రెండో ఓవర్లోనే రెండు వికెట్లు తీశాడు. స్వీప్ చేయబోరుు గప్టిల్ (0) సిల్లీ పాయింట్లో క్యాచ్ ఇవ్వగా, మరో నాలుగు బంతుల తర్వాత లాథమ్ (2) చిక్కాడు. విలియమ్సన్ (25) కూడా ఎల్బీగా వెనుదిరగడంతో అశ్విన్ కెరీర్లో 200వ వికెట్ చేరింది. రెండో ఎండ్ నుంచి జడేజా బ్యాట్స్‌మెన్‌కు అసలు పరుగులు తీసే అవకాశమే ఇవ్వలేదు. ఈ మధ్యలో కివీస్ బ్యాట్స్‌మెన్ కొన్ని ఎల్బీ అప్పీళ్లు, క్యాచ్లనుంచి కూడా అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. అరుుతే టీమ్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన రాస్ టేలర్ (17) చేసిన తప్పు జట్టును మరింత కష్టాల్లో పడేసింది. అశ్విన్ బౌలింగ్‌లో రోంచీ షాట్ కొట్టగా, రెండో పరుగు కోసం ప్రయత్నించిన టేలర్ రనౌటయ్యాడు. డీప్ మిడ్ వికెట్ నుంచి ఉమేశ్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకే సమయానికి టేలర్ క్రీజ్‌లోకి వచ్చినా... నిర్లక్ష్యంతో బ్యాట్‌ను కింద పెట్టలేదు! ఆ తర్వాత రోంచీ, సాన్‌ట్నర్ మరో 15.3 ఓవర్లు జాగ్రత్తగా ఆడారు. ఓవర్లు: 37, పరుగులు: 93, వికెట్లు: 4 స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్: 318, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స: 262, భారత్ రెండో ఇన్నింగ్స: రాహుల్ (సి) టేలర్ (బి) సోధి 38; విజయ్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 76; పుజారా (సి) టేలర్ (బి) సోధి 78; కోహ్లి (సి) సోధి (బి) క్రెరుుగ్ 18; రహానే (సి) టేలర్ (బి) సాన్‌ట్నర్ 40; రోహిత్ (నాటౌట్) 68; జడేజా (నాటౌట్) 50; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (107.2 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 377. వికెట్ల పతనం: 1-52; 2-185; 3-214; 4-228; 5-277. బౌలింగ్: బౌల్ట్ 9-0-34-0; సాన్‌ట్నర్ 32.2-11-79-2; క్రెరుుగ్ 23-3-80-1; వాగ్నర్ 16-5-52-0; సోధి 20-2-99-2; గప్టిల్ 4-0-17-0; విలియమ్సన్ 3-0-7-0 న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 2; గప్టిల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 0; విలియమ్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; టేలర్ (రనౌట్) 17; రోంచి (బ్యాటింగ్) 38; సాన్‌ట్నర్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (37 ఓవర్లలో 4 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1-2; 2-3; 3-43; 4-56.; బౌలింగ్: షమీ 4-2-6-0; అశ్విన్ 16-1-68-3; జడేజా 14-10-8-0; ఉమేశ్ 3-0-9-0. అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో (37 టెస్టులు) నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన క్లారీ గ్రిమ్మెట్ 36 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున ఈ మైలురారుు అందుకున్న 9వ ఆటగాడు అశ్విన్. ‘కెరీర్ ఆరంభంలోనే నాకు చాలా విషయాలు తెలిసొచ్చారుు. దాదాపు ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమయ్యాను. అదే సమయం నాకు పాఠాలు నేర్పింది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తీసిన గత వంద వికెట్లు ఎంతో సంతృప్తినిచ్చారుు. రికార్డుల గురించి పట్టించుకోకుండా నాతో నేను పోటీ పడటాన్నే ఇష్ట పడతాను. నా ఆట పట్ల గర్వంగా ఉన్నా. ఐదేళ్ల కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి కొన్ని బాధాకర క్షణాల గురించి ఆలోచించడం అనవసరం. నా ఘనతల గురించి అప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో పిచ్‌లపైనే ఎక్కువగా చర్చ జరిగి, మా విజయాలను తక్కువగా చూస్తారు.’ - అశ్విన్ -
ఫుల్ స్ట్రెంథ్‌తో బరిలోకి కోహ్లి సేన
న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ సోమవారం 15మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన 17 మంది ఆటగాళ్లలో 15మందిని జట్టులో కొనసాగించింది. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, బౌలర్ షార్దుల్ ఠాకూర్‌పై వేటు వేసింది. విరాట్ కోహ్లి నాయకత్వంలో పూర్తి బలగంతో స్వదేశంలో న్యూజిల్యాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెల 22న కాన్పూర్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో ఈ మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బీసీసీఐ ప్రకటించిన భారత క్రికెట్ జట్టు ఇదే విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజరా, అంజిక్యా రహానే, శిఖర్ ధావన్, ఎం విజయ్, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్.