India-Pak talks
-
అన్ని విధాలా భారత్‌దే పైచేయి.. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు చావుదెబ్బ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే.లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేలి్చచెప్పింది. -
సింధు జలాలపై సందిగ్ధతే
వాషింగ్టన్: సింధు నదీజలాల ఒప్పందంపై భారత్–పాక్ మధ్య జరిగిన తాజా చర్చలు సత్ఫలితాలనివ్వలేదు. వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు కార్యాలయంలో భారత్, పాకిస్తాన్ మధ్య రాత్లే, కిషన్‌గంగ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రెండ్రోజులపాటు జరిగిన రెండో విడత చర్చలూ ఫలితం తేలకుండానే ముగిశాయి. చర్చల్లో సయోధ్య కుదిరేంతవరకు తమ ప్రయత్నం కొనసాగుతోందని ప్రపంచబ్యాంకు తెలిపింది. సింధు నదీ జలాల ఒప్పందానికి లోబడి కిషన్‌గంగ, రాత్లే జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అంశాలపై ఇరుదేశాల మధ్య కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. భారత్–పాక్ దేశాల మధ్య 9 ఏళ్లపాటు సుదీర్ఘమైన చర్చలు జరిగిన అనంతరం ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇరుదేశాల మధ్య వివాదాలు, భేదాభిప్రాయాలు తలెత్తినపుడు పరిష్కరించే విషయంలో ప్రపంచబ్యాంకు పాత్ర పరిమితంగానే ఉంటుంది. భారత్, పాక్‌లలో ఎవరైనా ఒకరు కోరితే తప్ప ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉండదు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ నేతృత్వంలో భారత బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఇందులో సింధు నదీ జలాల కమిషనర్, విదేశాంగ శాఖ, కేంద్ర జల సంఘం ప్రతినిధులున్నారు. ఆగస్టు ఒకటిన జరిగిన తొలి విడత చర్చలూ ఎటూతేలకుండానే ముగిశాయి. -
చర్చల రద్దు; అమెరికా నిరుత్సాహం
వాషింగ్టన్: భారత్ - పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) చర్చలు రద్దు కావడం నిరుత్సాహం కలిగించిందని అమెరికా పేర్కొంది. చర్చలు జరగకపోవడంతో తాము నిరుత్సాహానికి గురయ్యామని అమెరికా ప్రకటించింది. చర్చల పునరుద్ధరణకు భారత్, పాకిస్థాన్ ముందడుగు వేయాలని సూచించింది. రెండు దేశాల మధ్య చర్చలు తర్వలోనే జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రష్యాలోని యుఫాలో భేటీ కానున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చర్చల పునరుద్ధరణకు చొరవ చూపాలని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కోరారు. భారత్ తో సోమవారం జరగాల్సిన ఈ చర్చలను పాక్ రద్దు చేసుకుంది. పాక్ ఎన్ఎస్ఏ ఢిల్లీలో కశ్మీర్ వేర్పాటువాదులను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరే అంశాన్నీ లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేసిన అనంతరం.. ఆ దేశం తన నిర్ణయాన్ని ప్రకటించింది.