breaking news
holydays
-
హిజాబ్ వివాదంతో స్కూల్‌కు సెలవు
కొచ్చి: కొచ్చిలోని పళ్లూరుత్తిలో ఒక క్రైస్తవ యాజమాన్యం నడుపుతున్న ప్రైవేట్ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని హిజాబ్ ధరించడంపై.. విద్యాసంస్థ యాజమాన్యానికి.. విద్యార్థిని తల్లిదండ్రులతో వివాదం తీవ్రమవడంతో రెండు రోజుల సెలవు ప్రకటించవలసి వచ్చింది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులకు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఇస్లామిస్ట్ (ఎస్డీపీఐ) అనుకూల రాజకీయ సంస్థ మద్దతు ఉందని, ఆ పార్టీ సభ్యులు ఎక్కువగా క్రైస్తవ సన్యాసినులైన విద్యాసంస్థ అధికారులతో దురుసుగా ప్రవర్తించారని పాఠశాల పీటీఏ అధికారి ఒకరు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎస్డీపీఐ ఇంకా స్పందించలేదు. సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ హెలెనా ఆర్సీ విడుదల చేసిన ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ వివాదం బహిర్గతమైంది. ఈ లేఖలో సోమ, మంగళవారాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. నిర్ణీత యూనిఫాం లేకుండా వచ్చిన విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు.. పాఠశాలకు సంబంధం లేని వ్యక్తుల ఒత్తిడితో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న కొంతమంది విద్యార్థులు, సిబ్బంది సెలవు కావాలని కోరారని ప్రిన్సిపాల్ లేఖలో పేర్కొన్నారు. దీంతో పేరెంట్ టీచర్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులతో సంప్రదించాక.. అక్టోబర్ 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆ లేఖలో తెలిపారు. ‘దేశం హామీ ఇచ్చిన స్వేచ్ఛకు, పాఠశాల యాజమాన్యాల హక్కులకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ నిరంతర సహకారాన్ని ఆశిస్తున్నాం’.. అని అందులో పేర్కొన్నారు. భయాందోళనలు సృష్టించారు. పీటీఏ సభ్యుడు జోషి కైతవలప్పిల్ పీటీఐతో మాట్లాడుతూ, పాఠశాల 30 సంవత్సరాలుగా ఒకే విధమైన డ్రెస్ కోడ్‌ను అనుసరిస్తోందని, అన్ని వర్గాల విద్యార్థులు దీనిని పాటించారని స్పష్టం చేశారు. ‘అయితే, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె తలపై దుపట్టా కప్పుకుని పంపుతామని పట్టుబట్టారు. ఇటీవల, వారు ఒక గుంపుతో పాఠశాలకు వచ్చి రచ్చ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులలో భయాందోళనలు సృష్టించారు. అందుకే రెండు రోజుల సెలవు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం’.. అని వివరించారు. సిస్టర్స్‌తో అనుచిత ప్రవర్తన పాఠశాల యాజమాన్యం పోలీసు రక్షణ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించి, అనుకూల ఉత్తర్వులు పొందిందని కైతవలప్పిల్ తెలిపారు. ‘పాఠశాలకు వచ్చిన వ్యక్తులు తాము ఎస్డీపీఐకి చెందినవారిమని చెప్పుకున్నారు, సిస్టర్స్‌తో సరిగ్గా ప్రవర్తించలేదు’.. అని ఆయన ఆరోపించారు. కాగా, విద్యార్థిని తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలో చేరిందని చెప్పారు. ‘ఆమె తలపై దుపట్టా ధరించడం వల్ల సమానత్వం దెబ్బ తింటుందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఇంతకుముందు, ఆమెను తరగతి గదిలో దుపట్టా తీసివేయమని అడిగేవారు. కానీ ఇప్పుడు వారు పాఠశాల గేటు వద్ద కూడా అభ్యంతరం చెప్పడం ప్రారంభించారు’.. అన్నారు. దీనిపై జిల్లా విద్యాధికారికి, సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ‘తలపై దుపట్టా కప్పుకోవడానికి అనుమతించకపోతే మా కుమార్తెను మరో పాఠశాలలో చేర్చుతాం.’అని స్పష్టం చేశారు. -
కేజీఎఫ్–2కి సెలవు కావాలి
యశవంతపుర: కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. భారీ అంచనాల మధ్య కేజీఎఫ్ 2 జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే తమ అభిమాన హీరో రాకీ భాయ్ థియేటర్లలో సందడి చేయనున్నాడని అభిమానులు తెగ సంబరపడుతున్నారు. బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. అయితే తాజాగా యశ్ అభిమానులు కొందరు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా విడుదల రోజును సెలవుగా ప్రకటించాలని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dear @PMOIndia @narendramodi sir Consider Fans Emotion🥰😁 And Declare National Holiday On 16/7/2021💥#KGFChapter2 #YashBOSS #KGFChapter2onJuly16 pic.twitter.com/1Idm64pgwV — Rocking Styles (@styles_rocking) January 30, 2021 -
హున్సలో పిడిగుద్దులాట
బోధన్‌రూరల్: హోలీ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్స గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠగా సాగింది. ముందుగా గ్రామ శివారులో కుస్తీ పోటీలను నిర్వహించారు. హనుమాన్ మందిరం ఎదురుగా ఖాళీ ప్రదేశంలో పిడిగుద్దులాటకు వేదికను సిద్ధం చేశారు. 5 ఫీట్ల ఎత్తుతో ఉన్న బలమైన కర్రలను నిలిపి పొడువైన తాడును కట్టారు. కుస్తీ పోటీల అనంతరం పిడిగుద్దులాట ప్రక్రియను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలతో గౌరవ సూచికంగా గ్రామ పెద్దలను వేదిక వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే తాడుకు ఇరువైపులా గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయి మోహరించి ఉన్నారు. పిడిగుద్దులాట కోసం ఏర్పాటు చేసిన తాడును ఎడమ చేయితో పట్టుకుని కుడి చేయి పిడికిలి బిగించి ఇరువర్గాలు కొట్టుకున్నాయి. ఆట ముగిసినట్టు గ్రామ పెద్దలు ప్రకటించిన వెంటనే గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
సెలవు కావాలి
‘‘యాక్టర్‌గా రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడుతుంటాం. ఈ హడావిడిలో మళ్లీ హుషారుగా పరిగెత్తాలంటే సెలవు తీసుకోవాలని సెలవిస్తున్నారు బాలీవుడు భామ కరీనా కపూర్. సెలవు తీసుకోవడం గురించి కరీనా మాట్లాడుతూ – ‘‘పని చేస్తున్నప్పుడు మన బెస్ట్ ఇస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడూ పని చేస్తుండటానికి మనమేం మిషన్లు కాదు. కొన్ని సార్లు బ్రేక్ తీసుకొని జీవితాన్ని ఆస్వాదించాలి. ఇలా సెలవు తీసుకోవడం నాకు చాలా ఇష్టం. మనలో కొత్త ఉత్సాహం నింపుకోవడానికి హాలీడేస్ బాగా ఉపయోగపడతాయి. ఆ హాలీడేను నా ఫ్యామిలీ, నా దగ్గరి వాళ్లతో గడపటానికి ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారామె. బాబుకు జన్మనిచ్చాక కరీనా నటించిన ‘వీరే ది వెడ్డిం గ్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు శుక్రవారం ముగియడంతో ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈనెల 28 నుంచి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని యాజమాన్య కాలే జీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యార్ తెలిపారు. జూన్ 1వ తేదీన తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఈ షెడ్యూలును అన్ని కాలేజీలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వేసవి సెలవుల సమయంలో ముఖ్యంగా ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహించడం, ప్రవేశాలు చేపట్టడం వంటివి చేస్తే యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.