Hindustan Petroleum Corporation Limited
-
భవిష్యత్‌లో ఎలక్ట్రికల్ వాహనాలే అగ్రగామి
హైదరాబాద్: భారతదేశంలో వచ్చే 20–30 ఏళ్లలో ఎలక్ట్రికల్ వాహనాలే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాయని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీఎస్వి.ప్రసాద్ పేర్కొన్నారు. రాయదుర్గంలోని దినేష్ ఫిల్లింగ్ స్టేషన్లో దేశంలో రెండవ, తెలంగాణలో మొదటి హెచ్‌పీసీఎల్ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్‌ను నాగ్‌పూర్‌లో ప్రారంభించగా.. రెండవది హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో ప్రస్తుతం 175 ఎలక్ట్రికల్ వాహనాలు నడుస్తున్నాయని తెలిపారు. త్వరలో ఆర్సీ పురం, ఉప్పల్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మరో నెల రోజుల్లో దేశంలో మరో 4 నగరాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నామని ప్రకటించారు. మ్యాన్యువల్ రిక్షాల స్థానంలో ఈ–రిక్షాలు నీతి ఆయోగ్ సూచనపై 2030 నాటికి దేశంలో ప్రస్తు తం కొనసాగుతున్న 2.5 కోట్ల మ్యాన్యువల్ రిక్షాల స్థానంలో ఈ–రిక్షాలను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని హెచ్ïపీసీఎల్ బిజినెస్ డెవలప్మెంట్ సీజీఎం సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. త్వరలో హెచ్‌పీసీఎల్ ఆ«ధ్వర్యంలో బ్యాటరీ, బ్యాటరీ సెల్స్, ఈ–రిక్షాలు, టూ వీలర్ల ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేçస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ అధికారులు శ్రీనివాస్, రాజేశ్, జూమ్‌కార్ల ప్రతినిధి దీపక్, దినేష్ ఫిల్లింగ్ నిర్వాహకులు దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌పీసీఎల్ సీఎండీకి ‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’
సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవను‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది. ఇంగ్లం డ్కు చెందిన ఎనర్జీ, పెట్రో కెమికల్స్, మెటల్ వ్యాపార దిగ్గజం ‘ప్లాట్స్’ ప్రతి ఏటా అందించే ఈ అవార్డు ఏషియా ఫసిఫిక్ రీజియన్‌లో ఓ భారతీయ మహిళకు దక్కడం ఇదే తొలిసారి. ఇండియా, చైనా, హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు ఫైనల్‌కు చేరగా వారిలో నిషిని అవార్డుకు ఎంపిక చేసినట్లు 250 మంది స్వతంత్ర న్యాయ నిర్ణేతల బృందం ప్రకటించిందని సంస్థ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ ఎఎస్‌వి రమణన్ బుధవారం వెల్లడించారు. హెచ్పీసీఎల్లో నిషి 1974 నుంచి నుంచి సేవలు అందిస్తున్నారు. గతేడాది సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అత్యధిక అమ్మకాల ద్వారా సంస్థను లాభాల బాట పట్టించారు. -
ఉద్యోగాలు
హెచ్‌పీసీఎల్ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. టెక్నీషియన్ ఆపరేషన్స్: 47 టెక్నీషియన్ బాయిలర్: 26 టెక్నీషియన్- ఎలక్ట్రికల్: 6 టెక్నీషియన్- ఇన్స్ట్రుమెంటేషన్: 3 టెక్నీషియన్ -మెకానికల్: 9 క్రాఫ్ట్ఫ్ట్సమెన్- మెయింటెనెన్స్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్): 3 ల్యాబొరేటరీ అనలిస్ట్: 1 జూనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 1 బాయిలర్ అటెండెంట్: 4 అర్హతలు: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 21 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన రిజిస్ట్రేషన్‌కు చివరితేది: నవంబర్ 10 వెబ్సైట్:www.hindustanpetroleum.com యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: 60 శాతానికి మించిన మార్కు లతో ఎమ్మెస్సీ (కెమిస్ట్ట్రీ)తోపాటు పాలిమర్ కెమిస్ట్రీలో పీహెచ్డీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 15 వెబ్సైట్: www.uohyd.ac.in