breaking news
Hindu woman
-
BAN: కుమిల్లా ఘటన.. భగ్గుమన్న హిందూ సంఘాలు
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ వర్గం మరోసారి ఆందోళన బాట పట్టింది. కుమిల్లా(Comilla) జిల్లా దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. గత మూడు రోజులుగా ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. వివాహితపై స్థానిక నేత ఒకరు అత్యాచారానికి దిగడం, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ అనే వ్యక్తి.. హిందూ మతానికి చెందిన ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో.. ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. అయితే ప్రజలు మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. Urgent protest march by Hindu students at Dhaka University after the horrific rape of a Hindu girl in Muradnagar, Comilla last night. The Islamist rapist must face justice and the harshest punishment. Silence is not an option! #StopHinduGenocideInBangladesh #JusticeForHindus pic.twitter.com/yAaGGkm82f— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) June 29, 2025ఏం జరిగిందంటే..బాధితురాలు(21) వివాహిత. ఆమె భర్త దుబాయ్‌లో పని చేస్తుంటాడు. హరిసేవా పండుగ కోసం ఆమె తన పిల్లలను తీసుకుని కుమిల్లా జిల్లా మురాద్‌నగర్ ఉపజిల్లా రామ్‌చంద్రాపూర్ పాచ్కిట్ట గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ.. కత్తి చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను హింసిస్తూ ఆ ఘోరాన్ని తన ఫోన్లో బంధించాడు. జూన్ 26వ తేదీ.. ఈ ఘోరం జరిగింది. జూన్ 27వ తేదీ.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో నిందితుడు ఫజోర్ అలీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. జూన్ 28వ తేదీ.. సోషల్ మీడియాలో లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.జూన్ 29 వేకువఝామున.. ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయేదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురిని బాధితురాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మైనారిటీ సంఘాలు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళకు దిగారు. జూన్ 30.. బాధితురాలిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని అక్కడి మీడియా సంస్థల్లో వరుస కథనాలు.. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలుమరోవైపు.. కుమిల్లా వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యాచారం కాదని వివాహేతర సంబంధ వ్యవహారమని.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు అంటూ ఫేక్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో పలు ఫ్యాక్ట్‌చెక్ వెబ్సైట్ల అక్కడి అధికారులను సంప్రదించి అవి ఫేక్‌న్యూస్‌గా తేల్చేస్తున్నాయి. కిందటి ఏడాది మొదలై.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం గత ఏడాది కాలంగా జరుగుతోంది. 2024 డిసెంబరులో, ఢిల్లీ, లఖ్‌నవూ, జైపూర్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో హిందూ సంస్థలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నిరసనకారులు “బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధాన్ని ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టు నుండి అక్టోబరు మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన థాయ్‌లాండ్ బ్యాంకాక్ వేదికగా జరిగినబిమ్స్టెక్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే.. బంగ్లాదేశ్ తీరు మారాల్సిందేనని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. -
పాక్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ
పెషావర్: ముస్లింల ఆధిపత్యముండే పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరగబోయే దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిసారిగా ఒక హిందూ మహిళ పోటీకి నిలబడింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని పీకే–25 పార్లమెంట్ స్థానం నుంచి సవీరా పర్కాశ్ అనే మహిళ పోటీచేస్తున్నారు. హిందువు అయిన సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) తరఫున బునేర్ జిల్లాలో ఆమె నామినేషన్ దాఖలుచేశారు. -
పాక్ ఎన్నికల బరిలో.. ఎవరీ సవీరా ప్రకాష్?
సవీరా ప్రకాష్.. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన వేళ మారుమోగుతున్న పేరు. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేశారీమె. తద్వారా ఈ ఎన్నికల్లో ఆ ప్రావిన్స్ నుంచి నామినేషన్ ఫైల్ చేసిన తొలి మహిళగా.. అలాగే పోటీ చేయబోతున్న తొలి హిందూ మహిళగా వార్తల్లోకి ఎక్కారు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఈ మధ్యే కీలక సవరణ చేసింది. సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేయడం అందులో ఒకటి. సవీరా తండ్రి ఓం ప్రకాశ్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడు కూడా. ఆయన అక్కడ పేరుపొందిన వైద్యుడు. మానవతా దృక్ఫథంతో పేదలకు ఉచిత వైద్యం అందించే వ్యక్తిగా ఆయనకంటూ పేరుంది అక్కడ. ఈ మధ్యే వైద్య వృత్తికి దూరంగా జరిగారు. అంతేకాదు.. 35 ఏళ్లుగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అయితే తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. సవీర బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. సోమవారం బర్నర్‌లోని పీకే-25 స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించింది కూడా. సవీర, అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో చదువుకుంది. ఆ సమయంలో బనర్ పీపీపీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా పని చేశారు. తాను వైద్య విద్య అభ్యసించే సమయంలో.. కళాశాలలో వసతుల లేమి తనను ఆలోచింపజేసేదని.. అదే తన రాజకీయ అడుగులకు కారణమని ఇప్పుడు చెబుతున్నారామె. గెలిస్తే.. హిందూ కమ్యూనిటీ బాగుకోసం కృషి చేయడంతో పాటు మహిళా సాధికారత.. సంక్షేమ సాధన తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. మరోవైపు బనర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెబుతున్న ఇమ్రాన్ నోషాద్ ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. సవీరకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని అంటున్నాడు. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ ప్రస్తుతం అధికార కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే ఇదే బిలావల్ భుట్టో.. భారత్, కశ్మీర్‌పై గతంలో పలుమార్లు విషం చిమ్మడం తెలిసిందే. పాక్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరగనుంది. -
పాక్‌లో పైశాచిక ఘటన.. భారత్ స్పందన ఇది
ఢిల్లీ: పాకిస్థాన్‌లో జరిగిన పైశాచిక ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌లో మైనారిటీల(హిందూ, ఇతర ముస్లిమేతర మతాల) పరిరక్షణతో పాటు వాళ్ల భద్రత బాధ్యత కూడా అక్కడి ప్రభుత్వానిదేనని కుండబద్ధలు కొట్టింది. తాజాగా.. సింజోరో పట్టణంలో బుధవారం ఓ హిందూ మహిళను ఘోరంగా హత్య చేశారు. 40 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి మరీ హత్య చేశారు. ఆపై వర్ణించడానికి వీల్లేని రీతిలో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. ఈ విషయాన్ని అక్కడి హిందూ సెనేటర్ కృష్ణ కుమారి ట్వీట్ ద్వారా వెల్లడించారు. Daya Bhel 40 years widow brutally murdered and body was found in very bad condition. Her head was separated from the body and the savages had removed flesh of the whole head. Visited her village Police teams from Sinjhoro and Shahpurchakar also reached. pic.twitter.com/15bIb1NXhl — Krishna Kumari (@KeshooBai) December 29, 2022 ఈ ఘోర హత్యాచారోదంతంపై భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీకి మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. పాక్ గడ్డపై ఉన్న మైనారిటీల పరిరక్షణ అక్కడి ప్రభుత్వానిదే. వాళ్ల బాగోగులు కూడా చూసుకోవాలి. గతంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాం. ఇప్పుడు పునరుద్ఘాటిస్తున్నాం అని ఆయన తెలిపారు. అయితే.. ప్రత్యేకించి ఆ కేసు ఇంకా ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు. India calls on Pakistan to protect minorities after killing of Hindu women Daya Bheel in Sindh province https://t.co/c5nSo1ylWV pic.twitter.com/it5hun7Z4U — Sidhant Sibal (@sidhant) December 29, 2022 -
తొలిసారి: హిందూ యువతికి పాక్‌లో అత్యున్నత పదవి
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో ఓ హిందూ యువతి సత్తా చాటింది. ఆ దేశంలోని అత్యున్నత పదవిని అధిష్టించనుంది. ఆ దేశ అత్యున్నత ఉద్యోగానికి ఎంపికై అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఆ దేశంలో ఓ హిందూ యువతి ఆ బాధ్యత చేపట్టడం ఇది తొలిసారి. ఆమెనే పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని షికార్పూర్ జిల్లాకు సనా రామ్‌చంద్. మన దేశంలో సివిల్స్ మాదిరి పాకిస్తాన్లో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్). సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్ఎస్)లో హిందూ యువతి సనా రామ్‌చంద్ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్)కు ఎంపికైంది. అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఈ సీఎస్ఎస్ పరీక్షను 18,553 మంది రాయగా వారిలో 221 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో సనా రామ్‌చంద్ ప్రతిభ కనబర్చడంతో ఆమె పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌కు ఎంపికైంది. అంటే మనదేశంలో ఐఏఎస్ మాదిరి. సనా వృత్తిరీత్యాఆ వైద్యురాలు కూడా. సింధ్ ప్రావిన్స్‌లోని చంద్కా వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీలో ఎఫ్‌సీపీఎస్ చదువుతున్నది. సర్జన్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. చదవండి: మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ -
పాక్‌లో హిందూ డిఎస్పీ
కొద్ది రోజుల క్రితం వరకు మనీషా రూపిత కరాచీలోని జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్లో వైద్యురాలు. ఇప్పుడు ఆమె సిం«ద్ ప్రావిన్సులోని జకోబాబాద్ జిల్లా డిఎస్పీ! ‘డీఎస్పీలు వస్తుంటారు పోతుంటారు’ అనుకోవచ్చు. ఇక్కడ అలా అనుకోడానికి లేదు. పాకిస్తాన్‌లోనే తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత! అయితే.. సర్వీస్ కమిషన్ విజేతగా సింద్ ప్రావిన్స్‌లోని హిందూ మహిళలకు తననొక ప్రతినిధిగా రూపిత భావించడం లేదు. సింద్ గ్రామీణ మహిళలందరికీ తన విజయం ఒక ప్రేరణ అవాలని మాత్రమే కోరుకుంటున్నారు! ‘సింద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ (ఎస్పీఎస్సీ) పరీక్షలో ర్యాంక్ సంపాదించి, ఈ ఘనతను సాధించారు రూపిత. మొదట ఆమె ‘సెంట్రల్ సుపీరియర్ సర్వీసు’ (మన దగ్గర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రాశారు. అదొక్కటే అత్యున్నతస్థాయి ఉద్యోగాలకు మార్గం అనుకున్నారు. ఆ తర్వాతే ఆమెకు.. సిం«ద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ర్యాంకు సాధించినా కూడా డైరెక్టు నియామకాలు ఉంటాయని తెలిసింది. పట్టుపట్టి బుక్స్ ముందు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు డీఎస్పీ సీట్లో కూర్చోబోతున్నారు. నియామక ఉత్తర్వులు అందాయి. బాధ్యతలు చేపట్టడమే తరువాయి! మనీషా రూపిత, పాక్ పోలీస్ దళం ఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడై, ర్యాంకు సాధించి, డీఎస్పీ అయ్యాక గానీ రూపిత పాకిస్తాన్‌లోనే మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ అన్న సంగతి ఎవరి దృష్టికీ రాలేదు. పాకిస్తాన్లో కపిల్ దేవ్ అనే ఒక హక్కుల కార్యకర్త ‘ప్రథమ’ అనే ప్రత్యేకత కలిగిన ఈ నియామకం గురించి తన ట్విట్టర్లో వెల్లడించడంతో రూపితకు అభినందనలు మొదలయ్యాయి. ‘‘పాకిస్తాన్‌లోని హిందువులందరికీ ఇది గర్వకారణం’’ అని ఆయన ట్వీట్ చేశారు. రూపిత జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్లో మెడికల్ థెరపీ డాక్టర్‌గా పని చేస్తున్న రూపిత కు కంబైండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (సి.సి.ఇ) అయిన ఎస్పీఎస్సీ రాసి గవర్నమెంట్లో డైరెక్ట్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా డాక్టర్‌గా సేవలు అందిస్తూనే సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకుతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ‘‘అయితే ఇదేమీ అంత తేలికైన ప్రయాణం కాదు. 2007 నాన్నగారు చనిపోయారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయాం. అయినా అమ్మ మా చదువును మాన్పించలేదు’’ అంటారు రూపిత. ఫీజులు, సర్వీస్ కమిషన్ పరీక్ష పుస్తకాలు కొనడం కోసం ఆమె ట్యూషన్ లు చెప్పారు. ‘‘గెలిచింది నేనే అయినా గెలిపించింది మా అమ్మే. ఆమె కలను నేను నెరవేర్చగలిగాను. అదే నా సంతోషం’’ అంటున్నారు రూపిత. తన విజయం సింద్‌లోని గ్రామీణ మహిళలందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. -
పాక్‌లో జడ్జిగా హిందూ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మొదటిసారి సుమన్ కుమారి అనే హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఖంబర్–షాదద్కోట్ జిల్లాకు చెందిన సుమన్ హైదరాబాద్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం కరాచీలోని స్జాబిస్ట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సుమన్ తండ్రి పవన్ కుమార్ బోదన్ మాట్లాడుతూ.. ఖంబర్ షాదద్కోట్ జిల్లాలోని పేదలకు ఉచితంగా న్యాయపరమైన సాయం అందించేందుకు తన కూతురు పాటుపాడుతోందని చెప్పారు. ‘సుమన్ ఒక సవాల్‌గా వృత్తిని ఎంచుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా న్యాయం కోసం నిజాయతీతో పోరాడుతుంది..’అని అన్నారు. సుమన్ తండ్రి పవన్ కంటి వైద్య నిపుణుడు కాగా, పెద్ద చెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరో చెల్లి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. సుమన్ కంటే ముందు హిందూ మతం నుంచి జస్టిస్ రానా భగవాన్ దాస్ కొద్దికాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. పాక్ జనాభాలో 2 శాతం మంది హిందువులున్నారు. -
పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ..!!
ఇస్లామాబాద్ : సుమన్ కుమారి అనే మహిళ పాకిస్తాన్‌లోని ఓ కోర్టుకు సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా దాయాది దేశంలో జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఖంబర్-షాదాద్కోట్ జిల్లాకు చెందిన కుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులవడం విశేషం. అక్కడి హైదరాబాద్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన కుమారి కరాచీలోని సాజ్బిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పేదలకు ఉచిత న్యాయ సేవలందిచడమంటే కుమారికి ఎంతో ఇష్టమని ఆమె తండ్రి పవన్‌కుమార్ బొదాని వెల్లడించారు. తన కూతురు చాలెంజింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకుందని అన్నారు. పవన్‌కుమార్ డాక్టర్ కాగా, ఆయన మిగతా ఇద్దరు కూతుళ్లలో ఒకరు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పాకిస్తాన్లో జడ్జిగా పనిచేసిన తొలి హిందువుగా జస్టిస్ రానా భగవాన్‌దాస్ నిలిచారు. 2005 నుంచి 2007 వరకు సుప్రీం కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలందించారు. కాగా, సివిల్ జడ్జి/జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ నియమాలకు జరిగిన పరీక్షలో కుమారి 54 స్థానంలో నిలిచారు. Suman Pawan Bodani becomes Pakistan’s 1st female judge belonging to the Hindu community. Via Pakistan Hindu Youth Council. Daughter of Dr. Pawan Podani, Suman belongs to Shahdadkot. She stood 54th in merit list for the appointment of Civil Judge/Judicial Magistrate. pic.twitter.com/ofqgwSA6Kt — Danyal Gilani (@DanyalGilani) January 27, 2019 -
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ
కరాచీ: పాకిస్తాన్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సింధ్ ప్రావిన్సుకు చెందిన సునీతా పర్మార్ (31) రికార్డు సృష్టించారు. జూలై 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, థార్పార్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సునీత బరిలో నిలిచారు. పాక్‌లో అల్ప సంఖ్యాకవర్గమైన హిందువులు అత్యధికంగా ఉండేది థార్పార్కర్ జిల్లాలోనే. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయనీ, 21వ శతాబ్దంలోనూ అక్కడ అమ్మాయిలు చదువుకోవడానికి సరైన సౌకర్యాల్లేవనీ, కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని ఆమె పేర్కొన్నారు. -
పాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ
కరాచీ : ముస్లింలు మెజారిటీ వర్గంగా ఉన్న పాకిస్తాన్లో ఓ హిందూ మహిళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచి చరిత్ర సృష్టించారు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 31 ఏళ్ల సునీత పర్మార్ జూలై 25న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తార్పర్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. మైనార్టీ వర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ సునీతనే కావడం విశేషం. ఏ పార్టీ మద్దతు లేకున్న ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోరాండేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చిలో కూడా హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హీని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆ దేశ సెనెట్‌కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై సునీత మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయినందు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 21 శతాబ్ధంలో కూడా ఈ ప్రాంతంలో మహిళలకు కనీస విద్య, వైద్య వసతులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. మహిళలు బలహీనులు, భయస్థులు అనే రోజులు పోయాయన్నారు. గెలుపుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. తాను గెలిస్తే నియోజవర్గంలోని మహిళలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్త్రీలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా వారు శక్తివంతంగా తయారవుతారని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా 2017 లెక్కల ప్రకారం తార్పర్కర్ జిల్లాలోని 16 లక్షల జనాభాలో దాదాపు సగం మంది హిందువులే. -
పాక్ సెనెట్‌కు హిందూ మహిళ
కరాచి: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణకుమారి కోల్హీ చరిత్ర సృష్టించారు. ఆ దేశ సెనెట్‌కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డుకెక్కారు. సింధు ప్రావిన్స్‌లోని థార్ జిల్లాలో ఉన్న మారుమూల ధనగామ్ గ్రామానికి చెందిన కోల్హీ (39).. ఆ ప్రావిన్స్‌లోని రిజర్వ్ స్థానానికి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున పోటీ చేసి సెనెటర్‌గా గెలుపొందారు. పాక్‌లో మైనార్టీలకు హక్కులున్నాయని తెలిపేందుకు కోల్హీ గెలుపే నిదర్శనమని భుట్టో పేర్కొన్నారు. కోల్హీ మాట్లాడుతూ.. ‘నేనో మానవ హక్కుల కార్యకర్తను. మైనార్టీలు.. ముఖ్యంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తు న్నా. ఈ స్థానంలో మరో మహిళను కూడా పీపీపీ నామినేట్ చేసి ఉండొచ్చు. కానీ మైనార్టీలకు అండగా ఉన్నామని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అన్నారు. మూడేళ్లు జైల్లో.. 1979లో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన కోల్హీ.. మూడేళ్లపాటు తన కుటుంబం, బంధువులతో కలసి ఓ ప్రైవేట్ జైలులో బానిసగా జీవించారు. ‘నేను, నా కుటుంబం, బంధువులు ఉమర్‌కోట్‌లోని ఓ భూస్వామికి చెందిన ప్రైవేటు జైల్లో బానిసలుగా ఉన్నాం. ఆ ప్రాంతంపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడి నుంచి బయటపడ్డాం’ అని కోల్హీ చెప్పారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను చిన్న పిల్లనని.. మైనార్టీ మహిళలు, చిన్నారుల కోసం పోరాటం సాగించాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారు. 16 ఏళ్ల వయసులో 9వ గ్రేడ్ చదువుతున్నపుడు లాల్ చంద్‌ను కోల్హీ వివాహమాడారు. 2013లో సింధ్ వర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. -
అలీగఢ్ లో అలజడి
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోని వలసలు, మథురలో చెలరేగిన ఘర్షణలు మరువకముందే అలీగఢ్ మత ఘర్షనలు చోటు చేసుకున్నాయి. అలీగఢ్ లోని బాబ్రి మండిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉండలేమంటూ మెజారిటీ వర్గానికి చెందిన ప్రజలు వలస బాట పట్టారు. కొన్ని రోజుల క్రితం 19 ఏళ్ల హిందూ యువతిని కొందరు దుండగలు అవమానించారు. ఇది రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణకు దారి తీసింది. శాంతియుత పరిస్ధితులు నెలకొనేందుకు భద్రతా దళాలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదని అందుకే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నామని సుధా వర్షిణి (38) ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు పాఠశాలకు వెలుతుంటే కూడా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా మేజిస్టేట్ అవదేశ్ తివారీ వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు.