breaking news
Harish R ao
-
ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్! : హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: 'ఓటరన్న రిస్క్ తీసుకోవద్దని అంటున్నారు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీలు సాధించిన ఆయన మరోసారి సిద్దిపేట నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలకరించింది. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం అంటే మూడు గంటల కరెంట్‌కు ఒప్పుకోవడమే అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి వెంట వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తామంంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అండ, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్సే గెలుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. తద్వారా ఈ జిల్లా పార్టీ కంచుకోటగా మరోసారి నిరూపితమవుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు. నాడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితిని. నేడు బీఆర్ఎస్ పాలనలో పరిస్థితిని గుండె మీద చేయి వేసుకుని పరిశీలించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాడు కరువు, కాటకాలతో వలసల జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం నేడు రెండు పంటలు పండే పచ్చని మాగాణిగా మారింది. నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో వలసలు వాపస్ వచ్చా యి. కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం వల్ల ప్రజలకు స్పష్టత వచ్చింది. మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఆ రాష్ట్రంతో బాగా సంబంధాలుంటాయి. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు గ్యా రంటీలు అమలు కాలేదు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనం పై నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. 8 గంటల కరెంట్ కాస్తా 3 గంటలకే పరిమితమైంది. అక్కడి రైతుబంధులు ఆపేశారు. అలాగే స్కాలర్ షిప్‌లలో కోత, తాగు నీటికి, తిండి గింజలకు ఇబ్బందే ఉంది. అక్కడి బాధలు చూసి, ప్రత్యక్షంగా తెలుసుకుని బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. ► మార్పు అంటే 3 గంటల కరెంటా? కాంగ్రెస్ వాళ్లు మార్పు అంటున్నారు. 24 గంటల కరెంట్ నుంచి 3 గంటలకు తగ్గించడమే మార్పా? ప్రజల జీవన విధానం, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావాలి. కాంగ్రెస్ దేశంలో ఎక్కడా రూ. 1000 మించి పెన్షన్ ఇవ్వడం లేదు. నాడు అధికారంలో ఉన్న ప్పుడూ ఇవ్వలేదు. నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదు. తెలంగాణలో ఇస్తామనడం ఇక్కడి ప్రజలను మభ్యపెట్టడమే. ► నాన్ లోకల్స్.. కాంగ్రెస్ అధికారంలో వస్తే పైరవీకారులు, బ్రోకర్ల రాజ్యం వస్తుంది. రాహుల్, ప్రియాంక ఎన్నికల ముందే కనబడతారు. ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఉంటారు. నేడు కర్ణాటకలో రాహుల్ జాడలేడు. ప్రియాంక పత్తాలేకుండా పోయింది. ప్రజలకు ఇచ్చి హామీలు అమలు చేయడం లేదు. ► కేసీఆర్ అంటే నమ్మకం! కేసీఆర్ అంటే నమ్మకం. కాంగ్రెస్ అంటే మోసం. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూ.400కే సిలిండర్, సౌ భాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు నెలకు రూ.3వేలు, ఆసరా రూ.5వేలు, పేదలకు సన్న బియ్యం అందిస్తాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచుతాం. అసైన్డ్ భూములు పట్టా భూములుగా మార్చడం, గురుకులాలను డిగ్రీ కళాశాలకు అప్‌గ్రేడ్ చేస్తాం. కానీ అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా హామీ ఇస్తున్నా. ఒక్క గుంట భూమిని తీసుకోం. వాటికి పట్టాలిస్తాం. -
మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్
తిరుమల: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన ముహూర్తానికి ముందే ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం మరికొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారనగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. నేను, నా కుమారుడు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీష్‌రావు ఎవరు? ఇందులో ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నేను మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాము. ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. ఇంతకాలం మెదక్ అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావేనని అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా ఏంటో చూప్పించి హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ‘నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరోన సమయంలో ప్రణాలకు తగించి చాలా మందికి వైద్య సేవలు అందించారు. తండ్రి గా నా కుమారుడికి నా సపోర్ట్ ఉంటుంది. నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. హరీష్‌రావు మెదక్ లో పెత్తనం చలాయిస్తున్నాడు. ఓ డిక్టేటర్లా హారీష్‌రావు ప్రవర్తిస్తా ఉన్నారు. హారీష్‌రావు గతం గుర్తు పెట్టుకో. ఓ టంకు డబ్బాతో, రబ్బరు చొప్పులతో వచ్చిన రోజు చూసాను. నేను హిరోగా ఉన్నా, హరీష్ రావు చాలా చిన్న వాడు....సిద్దిపేట్ అభివృద్ధి అయింది, మెదక్ ఎందుకు అభివృద్ధి కాలేదు అని అడిగినా. హరీష్‌రావు బట్టలు ఇప్పే వరకు నేను వదలను.. ఈసారి నా కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకొని హరీష్‌రావు అడ్రస్ లేకుండా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటి చేస్తా బిడ్డా. హరీష్‌రావుని నిద్రపోనివ్వను. లక్ష కోట్లు హరీష్‌రావు సంపాదించాడు. టంకు డబ్బా,రబ్బరు చెప్పులతో వచ్చిన హారీష్రావ్కి లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. మెదక్ లో హారీష్రావ్ పెత్తనం ఏంటి. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తా, మెదక్ లో నా కొడుకు పోటీ చేస్తాడు. అవసరమైతే రాజకీయాలు పక్కనపెట్టి నా కొడుకుని గెలిపించుకొంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ, వారు నన్ను వద్దు అనుకొంటే నేను ఏం చేసేను. నాకు ఎమ్ఎల్ఏ టికెట్ ఇచ్చారు. ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వమని అడిగా. లేకుంటే ఎవ్వరికి వద్దు అని తేల్చి చెప్పాను’అని మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి. ఇది కూడా చదవండి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్ క్లాస్ -
రణరంగం
⇔ పోటాపోటీ నినాదాలతో రాళ్లు రువ్వుకున్న శ్రేణులు ⇔ పగిలిన తలలు, చిరిగిన చొక్కాలు.. కార్లు, బైక్‌లు ధ్వంసం ⇔ యుద్ధభూమిని తలపించిన ఎస్సెల్బీసీ ప్రాంగణం ⇔ కోమటిరెడ్డిని బలవంతంగా బయటకు పంపించిన పోలీసులు ⇔ వైఎస్ విగ్రహం వద్ద వెంకట్‌రెడ్డి ధర్నా.. ‘మిర్యాల’కు తరలింపు ⇔ బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు ⇔ హరీశ్ రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ సుఖేందర్‌రెడ్డి సాక్షి, నల్లగొండ : సాయంత్రం 4 గంటలు.. నల్లగొండ నుంచి సాగర్ వెళ్లే రహదారిలో గంధంవారి గూడెం గ్రామ సమీపంలోని ఎస్సెల్బీసీ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు వస్తుండడంతో టెంట్లు,మైకులతో ఆ ప్రాంతమంతా హడావుడిగా ఉంది. తెలంగాణ పాటలు, ఉపన్యాసాలతో అక్కడ ఉత్సాహకర వాతావరణం కనిపిస్తుండగానే ఉన్నట్టుండి గాల్లోకి రాళ్లు లేచాయి. ఏంటీ... రాళ్ల వాన ఏమైనా కురుస్తుందా అని ఆలోచించేలోపే ఆ వాన యుద్ధంగా మారింది. పెద్ద పెద్ద రాళ్లు, గుండ్లు గాలిలో రయ్యిమని వచ్చి తలలు పగులగొట్టాయి. అవే రాళ్లు కార్ల అద్దాలు, బైక్‌లను ధ్వంసం చేశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసినంత తేలికగా రాళ్లు విసురుకోవడంతో ఆ ప్రదేశం అరగంటకు పైగా యుద్ధభూమిగా మారింది. కర్రలు ఓ చేత్తో, రాళ్లు మరో చేత్తో పట్టుకుని ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నల్లగొండలో మంగళవారం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ రణరంగమే జరిగింది. అసలేం జరిగిందంటే.. జిల్లా రైతుల చిరకాల కోరిక అయిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రానుండడంతో టీఆర్ఎస్ నేతలు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. తొలుత మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మర్రిగూడ బైపాస్ నుంచి కోమటిరెడ్డి బైక్‌ర్యాలీతో క్లాక్‌టవర్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన కోమటిరెడ్డి ర్యాలీగా బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసే ప్రదేశం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డిని చూసి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను కూడా కార్యక్రమంలో పాల్గొంటానని కోమటిరెడ్డి తన అనుచరులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసిన టెంటు కింద కూర్చున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రులు వచ్చే సమయం సమీపిస్తుండడం, టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్‌ర్యాలీతో పట్టణం నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి వస్తుండడంతో పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన పోలీసులు కోమటిరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. వెంకట్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా వెళ్లిపోతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేశారు. గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దాడి చేసేందుకు పరుగులు తీశారు. దీంతో రాళ్లు గాల్లోకి లేచాయి. అటునుంచి రాళ్లు రావడంతో సభాప్రాంగణంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న రాళ్లను కి విసిరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణుల వైపు నుంచి కూడా రాళ్లు వచ్చాయి. దీంతో పదుల సంఖ్యలో తలలు పగిలాయి. ఇరు పార్టీల కార్యకర్తలు తమకు దొరికిన కార్లు, బైక్‌లను ధ్వంసం చేశారు. ఇలా అరగంటకు పైగా సాగర్ రోడ్డు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మాటల యుద్ధం రాళ్ల యుద్ధం ముగిసి కోమటిరెడ్డి అరెస్ట్.. ఆ తర్వాత బత్తాయి మార్కెట్ శంకుస్థాపన.. అనంతరం కూడా ఇరుపార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకున్నారు. తన అరెస్ట్ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిలాల్లో టీఆర్ఎస్ నేతలందరూ నయీం అనుచరులేనని, రౌడీల్లా మారి జిల్లాలో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, బత్తాయి మార్కెట్ బహిరంగసభలో మాట్లాడిన ఎంపీ సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, జగదీశ్ కూడా కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డిని ఎంపీ సుఖేందర్‌రెడ్డి కల్లుతాగిన కోతితో పోల్చారు. ప్రతిపక్షాలు పాటించాల్సిన సంప్రదాయాలు ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తెలియవని, చీప్ పాపులారిటీ కోసం ఆయన పాకులాడుతున్నాడని విమర్శించారు. హీరో అనిపించుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరించిన కోమటిరెడ్డికి టీఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఆగమాగం ఎందుకు చేసిండు.. : మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే, మంచి పేరు తమకు వస్తుందనే దుగ్ధతోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇలా వ్యవహరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘మీ ఎమ్మెల్యేకు ఎందుకంత తొందరో అర్థమైతలేదు. మేమేమీ ఏసీలో కూర్చోలేదు కదా.. 15 ఏళ్ల నుంచి బత్తాయి మార్కెట్ అడుగుతున్నా కాంగ్రెసోళ్లు చేయలేదు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి మంత్రులుగా ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మేం చేస్తుంటే కుండీలు ఎత్తేసుడు.. ఫ్లెక్సీలు చించుడు.. ఎందుకింత ఆగమాగం చేసిండో అర్థం కావడం లేదు. రసాభాస చేస్తే పేరు రాకుండా పోతుందనే ఉద్దేశంతోనే.’ అని ఆయన వ్యాఖ్యానించారు. మేం కరవలేదు.. బుస మాత్రమే కొట్టాం : మంత్రి జగదీశ్ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన గొడవపై మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డిని కోతి అనడానికి కూ డా లేదని, అంతకన్నా దరిద్రం గా ఆయన తయారయ్యాడని అ న్నారు. మీడియాలో కనిపిం చాల నే ఆలోచనతో చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు. అరాచకా లు, చిల్లర వ్యవహారాలను జిల్లాలో సాగనీయబోమని, అలా చే యాలని చూస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించా రు. ‘ఇవి ఇంక మీ జాగీర్లు కావు. తెలంగాణ ప్రజల అడ్డాలు. మేం పూర్తిగా కరవలేదు. కేవలం బుస మాత్రమే కొట్టాం.’ అని వ్యాఖ్యానించారు. మళ్లీ ధర్నా తనను శంకుస్థాపన ప్రదేశం నుంచి బలవంతంగా పోలీసులు పంపించివేయడాన్ని, తమ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి దేవరకొండ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవరిస్తున్నారని, వారి అరాచకాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని ఆయన హెచ్చరించారు. ఇంతలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అక్కడకు చేరుకుని కోమటిరెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసులు ఆయనను మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే, కోమటిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించాయి. కోమటిరెడ్డిని అరెస్టు చేస్తున్న సందర్భంగా నల్లగొండలో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కోమటిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి మార్కెట్ వద్దకు చేరుకుని శంకుస్థాపన చేశారు.