breaking news
hardest
-
దగ్గడంతో తొడ ఎముక విరిగిపోవడమా?..షాక్‌లో వైద్యులు!
కొంతమందికి పొడి దగ్గులా వచ్చి నాన్‌స్టాప్‌గా వస్తుంటుంది. దీంతో కొందరికి పక్కటెముకల్లో నొప్పి రావడం లేదా ఒక్కోసారి చిన్నగా విరగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవి కాస్త సున్నితమైన ఎముకలు కావడంతో చిన్న ప్రమాదానికి గురైన మొదటగా ఈ పక్కటెముకలకే చిన్నగా క్రాక్ రావడం లేదా విరగడం జరుగుతుంది. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం ఏకంగా దగ్గినందుకే శరీరంలో అత్యంత బలంగా ఉండే తొడ ఎముక విరిగిపోయింది. వైద్యులు సైతం ఈ కేసును చూసి షాక్‌కి గురయ్యారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే..చైనాకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి దగ్గుతో బాధపుడుతున్న సమయంలో తొడ ఎముక ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. ఈ తొడ ఎముక అనేది మానవ శరీరంలో అత్యంత గట్టి ఎముక. అలాంటి జస్ట్ దగ్గడం వల్లే ఇరిగిపోడం ఏంటని వైద్యులు ఆశ్చర్యపోయారు. 35 ఏళ్ల వ్యక్తి దగ్గిన తర్వాత నుంచి తోడ భాగం ఒక విధమైన తిమ్మిరితో కూడిన నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి చేరినట్లు వైద్యులు తెలిపార. బాధితుడు తొలుత ఈ విషయం గురించి చెప్పినప్పుడూ షాక్‌కి గురయ్యాం. అని అన్నారు. వెంటనే ఆ రోగిని తాము ఆర్థోపెడిక్స్ విభాగానికి పంపించి చెకప్ చేయగా..అతడి తొడ ఎముక ఫ్యాక్చరయ్యిందని చెప్పారు. అయితే ఇది పడటం వల్లన, ప్రమాదం వల్ల జరిగిన గాయం కాదని కూడా తేల్చారు. దీంతో దీన్ని అత్యంత అరుదైన కేసుగా భావించి..అసలు ఇలా జరగడానికి గల కారణాలపై అధ్యయనం చేయడం ప్రారంభించామని వైద్యులు తెలిపారు. అయితే అతడి నొప్పి తీవ్రతరం కావడంతో ఎక్స్‌రే వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతని ఆరోగ్యపు అలవాట్లు గురించి కూడా ఆరా తీశారు వైద్యులు. ఎందుకంటే అతడు వయసు పరంగా చిన్న వ్యక్తి కానీ ఎక్స్‌రే తీసినప్పుడూ ఎముకలు ఏకంగా 80 ఏళ్ల వ్యక్తి మాదిరిగా ఎముకలు ఉండటంతో అతని జీవనశైలిపై దృష్టిసారించారు వైద్యులు. అదీగాక ఇంతవరకు ఎలాంటి ఎముకల వ్యాధులతో కూడా బాధపడని వైద్య చరిత్ర కూడా ఆ వ్యక్తికి లేదు. ఐతే అతని జీవనశైలి సంక్రమంగా లేదని వైద్యులు తేల్చి చెప్పారు. మంచినీళ్లు తాగే అలవాటు లేదని, ఎక్కువగా సోడాలు, డ్రింక్‌లతో లైఫ్‌స్టయిల్ ఉందని వైద్యలు చెప్పారు. కార్బోనేటేడ్ పానీయాలు ఎముకలను ప్రభావితం చేస్తాయా..?కార్బోనేటేడ్ పానీయాలు తాగడం వల్ల శరీరం కాల్షియంను గ్రహించకుండా చేస్తాయి. తద్వారా ఎముక సాంద్రతపై ఎఫెక్ట్ ఏర్పడతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం..కార్బన్డయాక్సైడ్ వాయువుతో నింపిన డ్రింక్స్, సెల్ట్జర్వాటర్, ఫిజీ వాటర్ల వల్ల యాసిడ్‌కి గురువ్వుతాం. దీంతో పళ్లపై ఉండే ఎనామెల్ దెబ్బతినడం జరుగుతుంది. కోలా తాగేవారికి అయితే ఎముకలు దారుణంగా క్షీణతకు గురవ్వుతాయి. ఇది కాస్త బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. నేషనల్ బోలు ఎముకల వ్యాధి ఫౌండేషన్ ప్రకారం..సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలకి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కోలా, పెప్సీల్లో ఉండే పాస్పోరిక్ యాసిడ్ కాల్షియాన్ని తటస్థం చేసేలా ప్రయత్నిస్తుంది. ఫలితంగా శరీరం ఆహరంలోని తగినంత కాల్షియం గ్రహించలేని స్థితికి చేరుకుని ఎముకలపై ప్రభావం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎముకలు పట్టుతప్పడం లేదా ఎముకలకు సంబధించిన వ్యాధుల బారిన పడతారని చెబుతున్నారు. (చదవండి: ఎవరీ మమతా దలాల్?..ఏకంగా షారూఖ్, సచిన్ కుమార్తెలకు..) -
ఫేస్బుక్లో ఓ బామ్మ సంచలనం!
ఆమె వయసు 92.. జీవితాన్ని ఎంతో చదివింది. ఎన్నో అనుభవాలు ఆ కళ్లతో చూసింది.. వాటిలో కొన్నింటిని మాటలుగా మార్చి.. కవితరూపంలో తీసుకొచ్చింది. ఆ కవిత.. కర్కశ హృదయులనూ కన్నీరు పెట్టిస్తోంది. గిఫ్ట్ ప్యాక్‌లో బంగారు ఆభరణాలు ఉంటాయని మీరు చూస్తున్నారా? అంటూ వృద్ధాప్యంపై వాండా బి. గోయిన్స్ అనే మహిళ కవిత వల్లిస్తున్న వీడియో ఫేస్బుక్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ వీడియోను 40 లక్షల మంది చూశారు. ప్రపంచజ్ఞానాన్నిపదుగురికీ పంచే ప్రయత్నంలో భాగంగా... 'యు ఆర్ లుకింగ్ ఎట్ ది గిఫ్ట్ ర్యాప్... అండ్ నాట్ ద జ్యుయెల్ ఇన్ సైడ్' అంటూ ఆమె జీవితానుభవాలను వల్లె వేస్తుండగా.. ఆమె సంరక్షకురాలు కేథరిన్ క్లాస్ నిట్జర్ విల్సన్ తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సంపూర్ణాయుష్షుతో జీవించిన విండా.. తన జీవితకాలంలో ప్రపంచయుద్ధం, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులతో పాటు ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. ప్రస్తుతం పోర్ట్ ల్యాండ్ ఆరిజన్‌లో నివసిస్తున్న ఆమె... తన జీవనసారాన్ని, అనుభవాల దొంతరను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తన కవితను కేర్ టేకర్ విల్సన్‌కు వినిపించింది. కవిత వింటూనే కరగిపోయిన ఆమె... వెంటనే దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇటువంటి గొప్ప మహిళకు తాను కేర్‌టేకర్‌గా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ఫేస్ బుక్ లో ఈ వీడియోను 40 లక్షల మంది పైగా వీక్షించారు. లక్షా 84 వేల సార్లు షేర్ చేశారు.