breaking news
Handles
-
వణక్కం.. ఇక అంతా వీళ్ల చేతుల్లోనే!
న్యూఢిల్లీ, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి అత్యంత అరుదైన నిర్ణయం తీసుకున్నారాయన. తన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యతలను ఎంపిక చేసిన మహిళలకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే వణక్కం.. అంటూ ఆయన ఖాతా నుంచి ఓ పోస్ట్ అయ్యింది.ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు(Vaishali Rameshbabu)కి అప్పగించారు. ఇదే విషయాన్ని మోదీ ఎక్స్ ఖాతా నుంచి వైశాలి తెలియజేశారు. తాను చెస్ ప్లేయర్‌నని, దేశం తరఫు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పోస్ట్ చేశారామె. ప్రధాని ఖాతాను నిర్వహించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. ఈరోజంతా ఆమే ఆయన ఖాతా బాధ్యతలను చూసుకోనున్నారు. ఆరో ఏట నుంచి నేను చెస్ ఆడుతున్నాను. అది నాకొక ఉత్తేజకరమైన ప్రయాణం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ కలలు సాకారం చేసుకోవడానికి ముందుకుసాగండి. ఆడపిల్లలకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఈసందర్భంగా కోరుతున్నాను. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. వారు అద్భుతాలు చేయగలరు అని వైశాలి సందేశం ఉంచారు. మరోవైపు.. వైశాలితో పాటు న్యూక్లియర్, స్పేస్ సైంటిస్ట్‌లు అయిన ఎలినా మిశ్రా, శిల్పి సోనీ.. మోదీ ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారతదేశం సైన్స్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. మరింత ఎక్కుమంది మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు.నేను అనితా దేవిని.. నలందా జిల్లాకు చెందిన అనితాదేవి ప్రధాని ఖాతా నుంచి తన విజయాలు వెల్లడించారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కాళ్ల మీద నిలబడి, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. 2016లో ఆ దిశగా అడుగేశాను. అప్పుడే స్టార్టప్‌లపై క్రేజ్ పెరుగుతోంది. నేను కూడా మాదోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాను. నాతో కలిసి పనిచేసిన మహిళలు స్వయంసమృద్ధి సాధించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబాలు బాగుపడటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని నా నమ్మకం. మీరు అంకిత భావం, కృషితో ముందుకుసాగాలని బలంగా అనుకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు’’ అంటూ తన స్టోరీ వెల్లడించారు.ప్రధాని మోదీ గతంలోనూ ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించారు కూడా. ఇక.. మహిళా దినోత్సవం(Women's Day 2025) పురస్కరించుకొని ఇవాళ ప్రధాని భద్రతను కూడా పూర్తిగా మహిళా పోలీసులే పర్యవేక్షించనుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అంతకు ముందు తన మహిళా దినోత్సవ సందేశంలో.. ‘‘వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోంది’’ అని అన్నారాయన. -
ఎలాన్ మస్క్ కొత్త ఎత్తుగడ! ఆదాయం కోసం ఎంత పని చేస్తున్నాడో తెలుసా?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో Twitter) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కొత్త ఎత్తుగడ వేశాడు. ‘ఎక్స్’లో ప్రస్తుతం వాడుకలో లేని యూజర్ అకౌంట్లను (Handles) అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక ‘ఫోర్బ్స్’కు లభించిన ఈమెయిల్ల ప్రకారం.. ‘ఎక్స్’ ఉపయోగంలో లేని యూజర్ హ్యాండిల్స్‌ను విక్రయించడానికి ఒక ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. వాటిలో కొన్నింటిని 50 వేల డాలర్లకు (సుమారు రూ.41.5 లక్షలు) విక్రయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆ హ్యాండిల్స్‌ను రిజిస్టర్ చేసుకున్న యూజర్లతో మాట్లాడి వారి ఇనాక్టివ్ అకౌంట్ పేర్లను కొనుగోలు చేసేందుకు గానూ ‘హ్యాండిల్ టీమ్’ పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలు, రుసుములు వంటి వివరాలను ‘ఎక్స్’ తమకు ఈమెయిల్ చేసినట్లు వాటిని అందుకున్నవారు ధ్రువీకరించారు. ముందే హింట్ ఇచ్చిన మస్క్ మస్క్ ఇలాంటిదేదో చేస్తాడని యూజర్లు ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూజర్లు గణనీయమైన సంఖ్యలో హ్యాండిల్స్ తీసుకోవడం గురించి గతంలోనే స్పందించిన ఎలాన్ మస్క్ "హ్యాండిల్ మార్కెట్‌ప్లేస్" అవకాశం గురించి అప్పట్లో ప్రస్తావించాడు. ఇక్కడ వినియోగదారులు తమ ఖాతాలను ఒకరికొకరు విక్రయించవచ్చు. దీనికోసం ప్లాట్‌ఫామ్ రుసుము తీసుకుంటుందని తన ఆలోచనను పంచుకున్నారు. అయితే ఈ మార్కెట్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో అన్నది అస్పష్టంగానే ఉంది. ఈ ట్విటర్ హ్యాండిల్స్ విక్రయం గురించి గతంలోనే ఆ సంస్థ ఉద్యోగుల్లో చర్చ జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ గత జనవరిలో ప్రచురించింది. ఇదీ చదవండి: Starlink: సాధించాం.. పట్టరాని ఆనందంలో ఎలాన్ మస్క్! -
బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందా?
నా వయసు 29 ఏళ్లు. బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు నడుం నొప్పి ఎక్కువవుతోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సురేశ్, హైదరాబాద్ ఈ వయసులో నడుం నొప్పి అంత సాధారణం కాదు. బైక్ నడపడంలో మీరు అనుసరిస్తున్న అవాంఛనీయ అంశాల వల్లనే ఈ నొప్పి వస్తుండవచ్చు. మీ సమస్య దూరం కావడానికి ఈ సూచనలు పాటించండి. బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయిపోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు. బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోండి. మీ నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించండి. నా వయసు 50 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. నా రక్తపరీక్షలో క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్, యూరియా 28 ఎంజీ/డీఎల్, ప్రోటీన్ మూడు ప్లస్ ఉన్నాయని చెప్పారు. నాకు షుగర్ వల్ల సమస్య వస్తోందా? నాకు తగిన సలహా ఇవ్వండి. - రవికుమార్, నిడదవోలు మీ రిపోర్డులను బట్టి మీకు మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతోంది. ఇది షుగర్ వ్యాధి వల్ల వచ్చిన కిడ్నీ సమస్యా (డయాబెటిక్ నెఫ్రోపతి) లేక మరోదైనా సమస్యా అని తెలుసుకోవాలి. మీరు కంటి డాక్టర్ దగ్గకు వెళ్లి రెటీనా పరీక్ష కూడా చేయించుకోవాలి. మూత్రంలో యూరియా ఎక్కువగా పోవడం కూడా షుగర్ వల్లనే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 100 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా నియంత్రించుకోవాలి. బీపీ 125/75 ఎమ్ఎమ్హెచ్జీ ఉండేలా చూసుకోవాలి. మూత్రంలో ప్రోటీన్ పోవడం తగ్గించడం కోసం ఏసీఈ, ఏఆర్‌బీ అనే మందులు వాడాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు 150 ఎంజీ/డీఎల్ లోపలే ఉండేలా జాగ్రత్తపడాలి. ఇవే కాకుండా ఉప్పు బాగా తగ్గించాలి. రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువే తీసుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించకుండా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. మా అబ్బాయి వయసు ఐదేళ్లు. పొద్దున్నే లేచాక వాడి కళ్లు; కాళ్లు వాచినట్లుగా కనిపిస్తున్నాయి. మావాడి సమస్య ఏమిటి? - సుకుమార్, కందుకూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదట ఈ వ్యాధి నిర్ధారణ జరగాలి. ఒకసారి ‘24గంటల్లో పోతున్న ప్రోటీన్ల పరీక్ష’, సీరమ్ ఆల్బుమిన్, కొలెస్టరాల్ పరీక్షలు చేయించాలి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఏమీ లేనప్పుడే ఆ మందులు వాడాలి. మీ బాబుకు ఆహారంలో ఉప్పు, కొవ్వుపదార్థాలు బాగా తగ్గించాలి. పూర్తికాలం మందులు వాడితే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. నా వయసు 18. బైక్ మీద కాలేజీకి వెళ్తాను. మొత్తం ప్రయాణించేది ఐదున్నర కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇలా ఆరుబయటకు వెళ్లినప్పుడల్లా నా ముఖం, మెడ, భుజాల మీద నల్లమచ్చలు వస్తున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - హారిక, హైదరాబాద్ మీకు కనిపిస్తున్న నల్లమచ్చలను పిగ్మెంటేషన్‌గా పేర్కొనవచ్చు. ప్రతిరోజూ మీరు బైక్‌పై ప్రయాణం చేయడం వల్ల ఆరుబయటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి తక్కువే అయినా దాని ప్రభావం మీకు కొంచెం ప్రమాదకరంగానే పరిణమిస్తోంది. ట్రాఫిక్‌లోని కాలుష్యం, ఎండవేడిమి వంటి అంశాలు మీ చర్మానికి చేటు తెస్తున్నాయి. మీరు ఈ సూచనలు పాటించండి. ఎండలో వెళ్లినప్పుడు మూడుగంటలకొకసారి ఎస్పీఎఫ్ 40 కంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను దుస్తులు కప్పని శరీర భాగాలపై రాసుకోండి మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరచుకోండి మచ్చలున్న చోట రాత్రి స్కిన్ లెటైనింగ్ క్రీమ్‌ను రాసుకోండి. కంటి చుట్టూ నల్లమచ్చలుంటే 15 శాతం విటమిన్ సి ఉండే సీరమ్‌ను రాయండి మిగతా చర్మానికి కోజిక్ యాసిడ్, విటమిన్ సి, లికోరిస్, టెట్రాహైడ్రోకర్క్యుమిన్ కాంబినేషన్‌తో ఉండే క్రీమ్‌ను రాత్రివేళల్లో రాసుకోండి క్యారట్, బీట్రూట్, తాజాపండ్లు, మొలకెత్తిన గింజలు, ముదురు రంగులో ఉండే కాయగూరలు, ఆకుకూరల వంటి మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోండి 20 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. అప్పటికీ తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 21. మొదట్లో నా వెంట్రుకలు మృదువు (సాఫ్ట్)గానే ఉండేవి. కానీ గత ఆర్నెల్లుగా అవి బిరుసెక్కిపోయినట్లుగా ఉంటూ తేలిగ్గా చిక్కుబడిపోతున్నాయి. చాలా రకాల నూనెలు వాడినా ప్రయోజనం లేదు. నాకు తగిన సలహా చెప్పండి. - సిరి, ఒంగోలు బహుశా మీరు ఉప్పు నీటిని (హార్డ్వాటర్ని) తలస్నానానికి వాడుతున్నట్లున్నారు. తలస్నానానికి మంచినీళ్లు వాడండి. జుట్టులో ఉండే ప్రోటీన్ పేరు కెరాటిన్. ప్రోటీన్లు పుష్టికరంగా ఉండే ఆహారం తీసుకుంటే, ఈ ప్రోటీన్ కూడా అంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టు చిక్కుబడకుండా ఉండేందుకు ఈ సూచనలు పాటించండి. మీ ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి పాళ్లను పరీక్షించుకోండి. వాటి లోపం ఉంటే వెంటనే నివారించుకోవాలి. తలకు మరీ ఎక్కువ నూనె రాయవద్దు. దీనివల్ల చుండ్రు రావచ్చు. తలస్నానం చేశాక. కాస్త తడిగా ఉండగానే జుట్టుకు లివాన్ కండిషనర్ రాసి అలా వదిలేయండి. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా మార్పు కనిపించకపోతే, ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలవండి.