breaking news
gross non-performing assets
-
నెలాఖరులోగా మొండి పద్దుల విక్రయం పూర్తి
ముంబై: దాదాపు రూ. 48,000 కోట్ల మొండి పద్దులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు విక్రయించే ప్రక్రియ నవంబర్ నెలాఖరుకి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు యస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనితో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతం లోపునకు దిగి రానుంది. మొత్తం పద్దులకు గాను రూ. 11,183 కోట్లు యస్ బ్యాంక్‌కు జేసీ ఫ్లవర్స్ చెల్లించనుంది. ఇది సుమారు 23 శాతం రికవరీకి సమానం. మరోవైపు, డీల్ ప్రకారం ఏఆర్‌సీలో యస్ బ్యాంక్ 9.9 శాతం వాటాలు తీసుకోనున్నట్లు, ఆర్బీఐ అనుమతితో దీన్ని తదుపరి 20 శాతానికి పెంచుకోనున్నట్లు ఎఫ్‌ఐబీఏసీ 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ వివరించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. -
ఆంధ్రాబ్యాంక్పై ఎన్పీఏల భారం
► 7 శాతానికి స్థూల మొండి బకాయిలు ► 83 శాతం తగ్గిన నికర లాభం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ మొండి బకాయిలు ఆందోళనకర స్థాయికి చేరాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7 శాతానికి చేరింది. ఈ మూడు నెలల కాలంలో కొత్తగా రూ.2,051 కోట్ల నిరర్థక ఆస్తులు చేరడంతో మొత్తం స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ. 9,521 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు 3.89 శాతానికి చేరి రూ. 5,103 కోట్లుగా ఉన్నాయి. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభంలో 83 శాతం క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 202 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 34 కోట్లకు పరిమితమయ్యింది. సమీక్షా కాలంలో ప్రొవజనింగ్ కేటాయింపులు రూ. 541 కోట్ల నుంచి రూ. 906 కోట్లకు పెరగడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇదే సమయంలో బ్యాంకు మొత్తం వ్యాపారం 17 శాతం వృద్ధితో రూ. 3.05,770 కోట్లకు చేరింది. ఈ సమయంలో రుణాలు 14.5 శాతం వృద్ధితో రూ. 1.18 లక్షల కోట్లకు చేరితే, డిపాజిట్లు 19 శాతం వృద్ధితో రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. డిపాజిట్లలో కాసా వాటా 25.9 శాతం నుంచి 27.2 శాతానికి చేరింది. ఈ త్రైమాసికంలో టైర్2 బాండ్స్ కింద రూ. 500 కోట్లు సమీకరించినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక ఫలితాలు వెలువడిన తర్వాత ఆంధ్రాబ్యాంక్ షేరు 3 శాతం నష్టపోయి రూ. 43.45 వద్ద ముగిసింది.