breaking news
grannies
-
70 ప్లస్... తగ్గేదేల్యా!.. ఫొటో వైరల్
గోవాలో గ్రామీణ బామ్మలు సర్ఫ్బోర్డులతో సర్ఫింగ్‌కు వెళితే? అనే ఊహను ఏఐ సాంకేతికతతో నిజం చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆశిష్ జోస్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నానీస్ ఎట్ ది బీచ్’ అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫోటోపై యూజర్స్ నుంచి రకరకాల కామెంట్స్ వచ్చాయి. ‘ఫొటో కాదు. బామ్మలు నిజంగానే సర్ఫింగ్ చేస్తే ఎంత బాగుండేదో’ అని ఒకరు కామెంట్ రాస్తే, మరొకరు ‘వెండి వొరెల్ వీడియో చూడండి చాలు’ అని సలహా ఇచ్చారు. టెక్సాస్‌కు చెందిన వెండి వొరెల్ వయసు 70 సంవత్సరాల పైమాటే. ఈ వయసులోనూ సర్ఫింగ్ చేస్తూ ‘ఉమెన్ ఆఫ్ ది వేవ్’గా పేరు తెచ్చుకొని ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
పంజాబీ డాన్స్ తో హోరెత్తించిన బామ్మలు!
-
పంజాబీ డాన్స్ తో హోరెత్తించిన బామ్మలు!
పంజాబీ ఫేమస్ డాన్స్ 'బాంగ్రా', జపానీస్ ఇష్టపడే 'పీఎస్ వై' స్టైలు స్టెప్పులతో యూకేలోని బర్మింహామ్ లో ముగ్గురు బామ్మలు దంచేశారు. నిశ్శబ్దంగా ఎవరికి వారు తమ పనులను చూసుకుంటన్న వీధిని స్టేజ్ గా ఎంచుకున్న వీరు తమ నైపుణ్యాన్ని ప్రజలకు చూపారు. 43 నుంచి 56ల మధ్య వయసు కలిగిన వీరందరి డాన్స్ ను చిత్రించుకునేందుకు అక్కడి వారు ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న ఫిజాగ్ ప్రొడక్షన్స్ లో పనిచేసే సూ హాకిన్స్, జాకీ ఫెలోస్, డెబ్ నికోలస్ లు ఈ డాన్స్ లను చేశారు. కొంతమంది ఆ డాన్స్ లను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. మిలియన్ల కొద్దీ లైక్స్, షేర్ లతో ఒక్కసారిగా వీరు ఫేమస్ అయిపోయారు. వీరు ఎంతలా ఫేమస్ అయ్యారంటే.. కొన్ని సంస్థలు వీరిని షోలు నిర్వహించాలని కలుస్తున్నాయి. దేశవిదేశాల్లో వీరి డాన్స్ చూసిన వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారని ముగ్గరిలో ఒక బామ్మ హాకిన్స్ తెలిపారు. దాదాపు 14 సంవత్సరాలుగా ముగ్గురూ కలిసే ఉంటున్నట్లు వివరించారు.