breaking news
governor appointment
-
తెలంగాణకు కొత్త గవర్నర్.. నేటి సాయంత్రానికి ప్రకటన?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. ఈరోజు సాయంత్రంలోగా కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, గవర్నర్ తమిళిసై రాజీనామాతో రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోగా రాష్ట్రానికి కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక, తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. తమిళనాడులోని ఏదో ఒక పార్లమెంట్ నియోజవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. -
గద్దర్‌కు దొరకని గవర్నర్ అపాయింట్మెంట్
హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్‌కు గవర్నర్ నరసింహన్ అపాయింట్మెంట్ లభించలేదు. తనపై జరిగిన హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేసేందుకు ఆయన బుధవారం రాజ్‌భవన్‌కు వచ్చారు. అయితే గవర్నర్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో గద్దర్‌కు అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. కాగా గద్దర్‌పై పది సంవత్సరాల క్రితం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు.