breaking news
GHMC call center
-
ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకొంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నంబర్ 040- 21111111కి ఫోన్ చేయాలని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ నెంబర్ అందరికీ తెలిసేలా చేయాలని హ్యాష్ ట్యాగ్‌తో(#040-21111111) ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే దృఢసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కవిత పోస్ట్‌కు మంచి కార్యక్రమం అంటూ నటి మంచు లక్ష్మితో పాటూ పలువురు రాజకీయ నాయకులు రీట్వీట్ చేస్తున్నారు. Let us all popularise this number #040-21111111 Anyone who needs food in GHMC area can call this number !! This is an initiative of @TelanganaCMO to make sure no one stays hungry. #TelanganaFightsCorona — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2020 మరోవైపు, జీహెచ్ఎంసీతోపాటు తొమ్మిది కార్పొరేషన్లలో 300 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2 లక్షల మందికి రెండు పూటలా భోజనం అందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పారు. రాష్ట్రంలో మరో 50 అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు భోజనం అందించేలా వేళలు కూడా మార్చామన్నారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని, జీహెచ్ఎంసీ యాప్ ద్వారా అహారాన్ని కోరవచ్చని చెప్పారు. -
పార్కింగ్‌కు ‘మార్కింగ్’
సాక్షి, హైదరాబాద్: రోడ్డు పక్కన బండి పెడితే చాలు చేతిలో చీటి పెట్టి పార్కింగ్ చార్జి వసూలు చేసే అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలమేదో, కానిదేదో తెలియకపోవడంతో ఎవరు పడితే వారు చార్జి వసూలు చేస్తున్నారు. రహదారులనే పార్కింగ్ లాట్లుగా మార్చిన జీహెచ్ఎంసీ వైఖరిని ఆసరా చేసుకుని, ప్రైవేట్ వ్యక్తులు కూడా నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కూడళ్లలో ఈ దందాకు పాల్పడుతున్నారు. ఇకపై ఈ పరిస్థితి లేకుండా.. జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన స్థలాల్లో పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకో సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు పార్కింగ్ ప్రదేశంలో అవసరమైన మార్కింగ్‌లు.. పార్కింగ్ ఫీజుల వివరాలతో పాటు సదరు పార్కింగ్ ఏరియాను టెండర్ల ద్వారా జీహెచ్ఎంసీ ఎవరికి కేటాయించారు, తదితర వివరాలు ప్రముఖం గా కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు విరుద్ధం గా వ్యవహరించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్కింగ్ కేటాయించిన స్థలం కంటే అదనపు స్థలాన్ని ఆక్రమించి వసూలు చేస్తున్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తొలిదశలో ఎంపిక చేసిన 47 పార్కింగ్ ఏర్పాట్లలో వీటిని అమల్లోకి తేనున్నట్లు వివరించారు. రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎవరైనా అక్రమ వసూలుకు పాల్పడితే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు సైతం (040-21 11 11 11) ఫిర్యాదు చేయవచ్చు. పార్కింగ్ లాట్ల వద్ద ఉండాల్సిన ఏర్పాట్లు.. పార్కింగ్ ఫీజు వివరాలు ప్రముఖంగా కనిపించేలా ఏర్పాట్లు పార్కింగ్ సదుపాయం వేళల వివరాలు {పస్తుత రేట్ల మేరకు, పార్కింగ్ ఫీజులు.. నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 10, తర్వాత ప్రతి గంటకు రూ. 5 ద్విచక్ర వాహనాలు మొదటి రెండు గంటలకు రూ. 5. ఆపై గంటకు రూ. 3.మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఈ ధరల్లోనూ మార్పులు చేసే అవకాశముంది. కొస మెరుపు: రెండేళ్ల క్రితం అప్పటి కమిషనర్ కృష్ణబాబు ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ అమలుకు నోచుకోలేదు.