Geographical Indication
-
పట్టు చీరల వనం.. ధర్మవరం
సాక్షి, పుట్టపర్తి : మగువలు మెచ్చే పట్టు చీరలు.. వివాహం కోసం ప్రత్యేకంగా చీరలు, ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు తయారీలో ధర్మవరం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాల పైనే తమ నైపుణ్యాన్ని రంగరించి రకరకాల పట్టుచీరలు తయారు చేస్తున్నారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు, జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతంగా ధర్మవరం పట్టణం ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి పట్టు మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల వరకు పట్టుచీరల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ధర్మవరం పట్టణ విశిష్టతను గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇవ్వడం నేతన్నల ప్రతిభకు గర్వ కారణంగా చెప్పవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంతో పాటు కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లోనూ మగ్గాలు ఉన్నాయి. ధర్మవరంలో మగ్గాలతో పాటు 18 చేనేత అనుబంధ రంగాల ద్వారా సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ధర్మవరంలోని డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్తరకాల డిజైన్లు రూపొందిస్తున్నారు. ధర్మవరంలో పట్టుచీరల డిజైన్లు రూపొందించడంలో సుమారు వందమంది మంచి నైపుణ్యం సంపాదించారు. వివాహాలు, ఇతర శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీల వరకు వినూత్న డిజైన్లను తయారు చేస్తున్నారు. ఒక్కో పట్టు చీర రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటుంది. బంగారం తాపడంతో పట్టుచీరలు తయారు చేయడం ధర్మవరం నేతన్నల ప్రత్యేకం. విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో తయారైన పట్టుచీరలకు ధర్మవరం పట్టుమార్కెట్ ప్రధానం. ధర్మవరం పట్టణంలో సుమారు రెండు వేల పట్టుచీరల దుకాణాలు ఉన్నాయి. ఈ సిల్క్ షాపుల ద్వారా నేతన్నల వద్ద పట్టుచీరలను కొనుగోలు చేసి, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి చేస్తారు. వారానికి రూ.వంద కోట్ల వ్యాపారం సగటున ధర్మవరం నేసేపేటలోని మార్కెట్లో వారానికి రూ.100కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని నేతన్నలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదరణ కరువైందని.. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏటా నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24వేల లబ్ధి చేకూరేదని వివరించారు. ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం గత 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచి్చంది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతరప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.విమానాశ్రయం వస్తే బాగుంటుంది శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు తర్వాత ధర్మవరంలో చేనేత రంగం మరింత వృద్ధి చెందింది. అయితే పుట్టపర్తిలో విమానాశ్రయం ఆధునీకరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే.. వివిధ దేశాలకు పట్టుచీరల ఎగుమతులు సులభమవుతాయి. మన దేశ పట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఫలితంగా వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా డిజైన్లు ప్రస్తుత ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. పట్టుచీరల్లో నేను తయారు చేసిన డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరంగణాంకాలు ఇలా... చేతి మగ్గాలు : 28 వేలు పట్టుచీరల దుకాణాలు : 2వేలు మగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు : 30 వేలు మగ్గాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు : లక్ష మంది అనుబంధ రంగాల ద్వారా : మరో 20 వేల మందికి ఉపాధి రోజుకు పట్టుమార్కెట్ సగటు టర్నోవర్ : రూ.7 కోట్లు శుభకార్యాల సీజన్లో వారంలో పట్టుచీరల లావాదేవీలు : రూ.100 కోట్లు -
ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ..!
మానవ పరిణామంలోని తొలి నాగరిక కళ చేనేత. నాగరికతల ప్రస్థానంలో ఇది పడుగు పేకల పోగుబంధం. ఇది తరతరాల చేనేత కళాకారుల రంగుల కళ. ఆచ్ఛాదనతో అందానికి మెరుగులు దిద్దే అరుదైన కళ. ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ. ఒంటికి హత్తుకుపోయే చేనేత వస్త్రాల సుతిమెత్తదనాన్ని ఆస్వాదించాలనుకోవడం ఒక రంగుల కల.నాగరికతకు తొలి గుర్తు వస్త్ర«ధారణ. వస్త్రాలను తయారు చేసే చేనేత తొలి నాగరిక కళ. చేనేత వెనుక సహస్రాబ్దాల చరిత్ర ఉంది. పత్తి నుంచి నూలు వడికి వస్త్రాలను నేయడం క్రీస్తుపూర్వం 3000 నాటికే విరివిగా ఉండేది. ఉన్ని కంటే పత్తితో వస్త్రాలు నేయడం సులువు కావడంతో వివిధ ప్రాచీన నాగరికతల ప్రజలు చేనేత వస్త్రాలవైపే మొగ్గు చూపేవారు. సింధులోయ నాగరికత వర్ధిల్లిన మొహెంజదారో శిథిలాల్లో ప్రాచీన చేనేతకు సంబంధించిన ఆనవాళ్లు, నాణ్యమైన నూలు దారపు పోగులు, అద్దకానికి ఉపయోగించే రంగుల అవశేషాలు ఉన్న కుండలు దొరికాయి.ఇవి మన దేశంలో చేనేత కళ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మరమగ్గాల వినియోగం పెరిగినప్పటి నుంచి చేనేత ప్రాభవం కొంత తగ్గుముఖం పట్టిందేగాని, అదృష్టవశాత్తు కొన్ని ఇతర ప్రాచీన కళల మాదిరిగా అంతరించిపోలేదు. చేనేతకు మన దేశంలో ఇప్పటికీ అద్భుతమైన ఆదరణ ఉంది. కొన్ని నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేతకు చిరునామాగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా చేనేతను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీ కోసం...మన దేశంలో వారణాసి, చందేరి, జైపూర్, సూరత్, పానిపట్, లక్నో, భదోహీ, అల్మోరా, బాగేశ్వర్, కోటా, మహేశ్వర్, చెన్నై, కంచి, కన్నూర్, కాసర్గోడ్, మైసూరు, మంగళూరు, భాగల్పూర్, బంకా, ముర్షిదాబాద్, బిష్ణుపూర్, ధనియాఖలి, సంబల్పూర్, బరంపురం వంటి ఎన్నో నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేత కళను, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. తమ ప్రత్యేకతను చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019–20లో విడుదల చేసిన లెక్కల ప్రకారం మన దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు పూర్తిగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. చేనేత రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 43 లక్షలకు పైగానే ఉంటుంది. చేనేత రంగంలో నేత, అద్దకం, నేతకు సంబంధించిన ఇతర పనులను చేసే ఈ కార్మికుల్లో దాదాపు 70 శాతం మహిళలే! దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయగలగడమే కాకుండా, తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నారు.ఫ్యాషన్లలోనూ చేనేత ముద్ర..యంత్రాల ద్వారా తయారయ్యే వస్త్రాల్లోని యాంత్రికతకు భిన్నంగా ఉండటమే చేనేత వస్త్రాల ప్రత్యేకత. అందుకే, ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా, చేనేత వస్త్రాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూనే వస్తున్నాయి. చేనేత కార్మికుల కళానైపుణ్యం, ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కే వారి సృజనాత్మకత కారణంగా కూడా ఆధునిక ఫ్యాషన్ల పోటీని చేనేత వస్త్రాలు సమర్థంగా తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. రంగులు, డిజైన్లు, అద్దకం పద్ధతుల్లో చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మన దేశంలో తయారయ్యే చేనేత చీరలు, పంచెలు, తువ్వాళ్లు, దుప్పట్లు, ఇతర వస్త్రాలకు విదేశాల్లో కూడా బాగా గిరాకీ ఉంది.మన దేశం నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లండ్స్, గ్రీస్, పోర్చుగల్, స్వీడన్, యూఏఈ, మలేసియా, ఇండోనేసియా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఇరవైకి పైగా దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లు (రూ. 93,931 కోట్లు) విలువ చేసే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల కంటే 6.71 శాతం ఎక్కువ. ఆధునిక ఫ్యాషన్ల హవాలోనూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా, పెరుగుతూ వస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.తెలుగు రాష్ట్రాల్లో చేనేత చిరునామాలు..మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతకు చిరునామాలైన ఊళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొందూరు మొదలుకొని వెంకటగిరి వరకు, తెలంగాణలో పోచంపల్లి మొదలుకొని గద్వాల వరకు చేనేత కళలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఊళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణం ఖద్దరు చేనేతకు చిరకాలంగా ప్రసిద్ధి పొందింది. పొందూరు ఖద్దరు హోదాకు చిహ్నంగా గుర్తింపు పొందింది. పొందూరు ఖద్దరు పంచెలను అమితంగా ఇష్టపడేవారిలో మహాత్మాగాంధీ సహా ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి సినీ ప్రముఖులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. పొందూరు ఖద్దరు నాణ్యత చూసి ముచ్చటపడిన గాంధీజీ, ఆ నేత మెలకువలను నేర్చుకునేందుకు తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పొందూరు చేనేత కళాకారులు బల్ల భద్రయ్య, జల్లేపల్లి కాంతమ్మ గత ఏడాది ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడ చేనేత కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని ఉప్పాడ పరిసరాలకు చెందిన ఎనిమిది గ్రామాల్లోని చేనేత కార్మికులు సంప్రదాయ జాంధానీ చీరల నేతలో అత్యంత నిష్ణాతులు. ఈ గ్రామాల్లో తయారయ్యే చీరలు ఉప్పాడ జాంధానీ చీరలుగా ప్రసిద్ధి పొందాయి. బంగారు, వెండి జరీ అంచులతో రూపొందించే ఉప్పాడ జాంధానీ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించింది. కర్నూలు జిల్లా కోడుమూరు చేనేత కార్మికులు గద్వాల చీరల నేతకు ప్రసిద్ధి పొందారు. ఇదే జిల్లా ఆదోనిలో చేనేత కార్పెట్లు, యోగా మ్యాట్లు వంటివి తయారు చేస్తున్నారు.అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ప్రాచీన కాలంలోనే అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన ఘనత సాధించారు. ఇక్కడి చీరలకు కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) దక్కింది. బంగారు తాపడం చేసిన జరీతో రూపొందించిన ధర్మవరం చీరలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులకు దీటుగా ఇక్కడి చేనేత కళాకారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తూ, తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారు. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి ఇక్కత్ చీరలు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగేటే మెక్రాన్‌కు పోచంపల్లి ఇక్కత్ చీరను ప్రత్యేకంగా బహూకరించారు. పోచంపల్లిలో తయారయ్యే పట్టు, నూలు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, రజాయిలు, స్టోల్స్ స్కార్వ్స్, కర్టెన్లు వంటి వాటికి సూడాన్, ఈజిప్ట్, ఇండోనేసియా, యూఏఈ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రాపోలు రామలింగం 2015లో జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వచ్చినప్పుడు పోచంపల్లి చేనేత కళాకారులు భోగ బాలయ్య, సరస్వతి దంపతులు తాము స్వయంగా నేసిన భారత చిత్రపటం గల వస్త్రాన్ని బహూకరించారు.నల్లగొండ జిల్లా పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాల తయారీకి ప్రసిద్ధి పొందింది. నేతకు ముందుగా దారాన్ని నువ్వుల నూనెలో నానబెట్టి తయారు చేసే ఈ వస్త్రాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు కూడా లభించింది. పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు దుపియన్ చీరలకు కూడా అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. పుట్టపాక వస్త్రాలు ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మనసు దోచుకున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటివారు పుట్టపాక వస్త్రాలకు ఫిదా అయిన వారే! ఇక్కడి తేలియా రుమాల్ వస్త్రాలు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, లండన్ మ్యూజియంలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. పుట్టపాక చేనేత కళాకారులు గజం గోవర్ధన్, గజం అంజయ్య ‘పద్మశ్రీ’ అవార్డు పొందారు. ఇక్కడకు సమీపంలోని ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం ఆసు యంత్రం తయారీకి గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పొందారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ‘పద్మశ్రీ’ అవార్డు పొందడం దేశంలోనే అరుదైన విశేషం.మన దేశంలో 5000 ఏళ్ల చరిత్ర!మన దేశంలో చేనేతకు ఐదువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. సింధులోయ నాగరికత కాలం నుంచి ఇక్కడి జనాలు వస్త్రాలను నేసేవారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ చేనేతకారుల కుటుంబం కనీసం ఒక్కటైనా ఉండేది. పదహారో శతాబ్ది నాటికి చేనేత ఉత్కృష్టమైన కళ స్థాయికి ఎదిగింది. మంచి నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులకు రాజాదరణ ఉండేది. ఎందరో రాజులు తమ విజయగాథల చిత్రాలను చేనేత వస్త్రాలపై ప్రత్యేకంగా నేయించుకునేవారు. మొగల్ పరిపాలన కొనసాగినంత కాలం మన దేశంలో చేనేతకు అద్భుతమైన ఆదరణ ఉండేది.బ్రిటిష్ హయాంలో మరమగ్గాలు ప్రవేశించడంతో చేనేతకు గడ్డురోజులు మొదలయ్యాయి. బ్రిటిష్‌వారు ఇక్కడి నుంచి నూలును ఇంగ్లండ్‌కు తరలించి, అక్కడి మిల్లుల్లో తయారయ్యే వస్త్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మేవారు. ఈ పరిస్థితి కారణంగానే ఖద్దరు ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మారాయి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమం’ 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైంది. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7ను కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా అప్పట్లో మహాత్మాగాంధీ స్వయంగా రాట్నం నుంచి నూలు వడికేవారు.అప్పట్లో ఊరూరా ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు గాంధీజీ పంథాలోనే రాట్నంపై నూలు వడికి, ఆ నూలుతో నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైంది. సంప్రదాయ కుటీర పరిశ్రమగా చేనేత పరిశ్రమ ఈనాటికీ కొనసాగుతోంది. వస్త్రధారణలో వస్తున్న మార్పులను, జనాల అభిరుచుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, తనను తాను నవీకరించుకుంటూ చేనేత పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.దేశవ్యాప్తంగా ఉన్న 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), 28 చేనేతకారుల సేవా కేంద్రాలు ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాయి. పలుచోట్ల చేనేత వస్త్రాల ప్రదర్శనలను నిర్వహిస్తాయి.చేనేతలో మన ఘనత..– చేనేత చీరలు కేవలం చీరలు మాత్రమే కాదు, ఏ చీరకు ఆ చీరను ఒక కళాఖండంగా పరిగణిస్తారు ఫ్యాషన్ నిపుణులు. అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు తమ సేకరణలో భారత్ చేనేత చీరలను తప్పకుండా చేర్చుకోవడమే మన చేనేత ఘనతకు నిదర్శనం.– ప్రపంచవ్యాప్తంగా వినిగించే చేనేత వస్త్రాల్లో మన దేశంలో తయారైనవి 95 శాతం వరకు ఉంటాయి. చేనేతలో ఇప్పటికీ మనది తిరుగులేని స్థానం.– చేనేత వస్త్రాల తయారీలో బెనారస్ మొదలుకొని కంచి వరకు ఏ ప్రాంతానికి చెందిన వైవిధ్యం ఆ ప్రాంతానికే సొంతం. చేనేత కళలోని ఈ వైవిధ్యం కారణంగానే వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును సాధించగలిగాయి.– చేనేత పరిశ్రమ మన దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. వస్త్రాల రూపకల్పన శైలిలో సంప్రదాయ పరంపర, ప్రాంతీయ వైవిధ్యం, సృజనాత్మకత, అసాధారణ నైపుణ్యం ఫలితంగా మన చేనేత కళాకారులు అంతర్జాతీయంగా కూడా మన్ననలు పొందగలుగుతున్నారు.– భారత గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నది చేనేత రంగమే!– మన దేశం నలుమూలలకు చెందిన 65 చేనేత ఉత్పత్తులకు, ఆరు ఉత్పత్తి చిహ్నాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఉంది. ఇన్ని ఉత్పత్తులకు జీఐ లభించడం చేనేత పరిశ్రమ వైవిధ్యానికి నిదర్శనం. -
బెస్టాఫ్ ‘లక్క’!
సాక్షి, హైదరాబాద్: భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విశిష్టతలున్న తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తోంది. రామప్పగుడితో యునెస్కో గుర్తింపు పొందిన రాష్ట్రం.. తాజాగా హైదరాబాద్ లక్కగాజులతో భౌగోళిక సూచీ(జీఐ)లో స్థానంకోసం పోటీ పడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ హలీం, పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందగా.. ఈసారి లక్కగాజులు రేసులో నిలిచాయి. దీని కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా... రాష్ట్రానికి చెందిన తాండూరు కందులు కూడా జీఐ పరిశీలనలో ఉన్నాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రత్యేకత ఒక ప్రాంతంలోని (భౌగోళికంగా) నాణ్యత, నిర్దిష్ట లక్షణాలతో ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులు, వస్తువులు, చరిత్రాత్మక వారసత్వంగా కొనసాగుతున్న కళలు తదితర విభాగాల్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను అందిస్తారు. ప్రత్యేకమైన సహజ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, పారిశ్రామిక ఉత్పత్తులను ఎంపిక చేస్తారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ‘ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్’ (రిజిస్ట్రేషన్, రక్షణ) యాక్ట్ 1999 ఆధారంగా ఈ గుర్తింపు ఇస్తారు. ఈ చట్టం 2003 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 2004–2005లో ‘డార్జిలింగ్ టీ’ దేశంలో మొట్టÐð ¬దట జీఐ ట్యాగ్ పొందింది. ఇప్పటివరకు దాదాపు నాలుగు వందల ఇతర ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు పొందిన ఉత్పత్తులు, వస్తువులు, పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు 10 సంవత్సరాలు వర్తిస్తుంది. తరువాత మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. లక్షణమైన లక్క గాజులు... హైదరాబాద్ పాతబస్తీలోని ‘లాడ్ బజార్’ లక్క గాజులకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ అందమైన గాజులను కొన్ని కుటుంబాలు వందల ఏళ్లుగా తయారు చేస్తున్నాయి. లక్కను కరిగించి దానిని గాజుల ఆకారంలో మలిచి, వాటిపై అందమైన రంగు రాళ్లు, రత్నాలు, మెరిసే గాజు ప్రతిమల వంటివి అతికిస్తారు. దేశ నలుమూలల నుంచే కాదు, నగర పర్యటనకు వచ్చిన విదేశీయులు సైతం ఈ గాజులను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. నగరంలోని క్రిసెంట్ హ్యాండ్‌క్రాఫ్ట్ సొసైటీ ఈ లక్క గాజులకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసింది. లాడ్ బజార్లో మాత్రమే దొరికే ఈ లక్క గాజులకు జీఐ గుర్తింపు వస్తే... వీటి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రత్యేక విశిష్టతను సొంతం చేసుకున్న తాండూరు కందులు కూడా జీఐ ట్యాగ్ కోసం పరిశీలనలో ఉందని సమాచారం. గతంలోనే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు రాష్ట్రంలోని పలు వస్తువులు, ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. హైదరాబాదీ ప్రత్యేక వంటకం ‘హలీమ్’ నగరం నుంచి మొదటగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది. రెండు తెలుగురాష్ట్రాల్లో దొరికే బంగినపల్లి మామిడిపండ్లు, పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ కార్వింగ్స్, ఆదిలాబాద్ దోక్రా, నిర్మల్ బొమ్మలు–పెయింటింగ్స్– టాయ్స్–ఫర్నిచర్, గద్వాల్ చీరలు, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, వరంగల్ దర్రీస్, సిద్దిపేట గొల్లభామ చీర, చేర్యాల పెయింటింగ్స్, పుట్టపాక తేలియా రుమాలు, నారాయణపేట నేత చీరలు జీఐ ట్యాగ్ సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ బిర్యానీకి కూడా జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నించినప్పటికీ.. దాని భౌగోళిక అంశాలు, పుట్టు పూర్వోత్తరాలు తదితర కారణాల వల్ల తిరస్కరణకు గురైంది. జీఐ గుర్తింపుతో డార్జిలింగ్ టీ, పాష్మినా షాల్, కన్నౌజ్ పెర్ఫ్యూమ్, పోచంపల్లి ఇక్కత్ వంటి వాటికి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ లభించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఏపీలోనే ప్రథమ స్థానం.. పట్టు.. ‘కొత్త’గా మెరిసేట్టు..
ధర్మవరం...పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పట్టుచీర. రక్షా బంధన్ చీర, కట్టుకుంటే సంగీతం వినిపించే మ్యూజికల్ చీర, పూల వాసన గుబాళించే సంపంగి చీర, వాతావరణాన్ని బట్టి రంగు మారే చీర, భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చీరలు.. ఇక్కడి నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మవరం చీరకు ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ఇచ్చింది. నూతన జిల్లా శ్రీసత్యసాయి మకుటంలో ధర్మవరం పట్టుచీర మణిలా మెరుస్తోంది. రానున్న రోజుల్లో మరింత ప్రకాశించనుంది. చదవండి👉: మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి.. ధర్మవరం టౌన్(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాకు ధర్మవరం పట్టుచీర కీర్తికిరీటంలా నిలుస్తోంది. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి నేతన్నలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, విదేశాలకు సైతం పట్టుచీరలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల దాకా పట్టుచీరల బిజినెస్ జరుగుతోంది. ధర్మవరం నేతన్నల పనితనాన్ని గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇచ్చింది. ఉపాధికి ఊతం శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో 28 వేల దాకా చేనేత మగ్గాలున్నాయి. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 20 వేల మగ్గాలున్నాయి. చేనేత మగ్గాలతో పాటు పట్టుచీరల తయారీలో 18 దాకా అనుబంధ రంగాలు ఉంటాయి. రంగుల అద్దకం, డోలు చుట్టడం, పాలిషింగ్, పురిమిషన్, బోట్లు చుట్టడం, రేషం చుట్టడం, అచ్చులు అతకడం తదితర వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది దాకా ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ఇక్కడి డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. వందమంది దాకా పట్టుచీరల డిజైనర్లు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వివాహ శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీలు ధరించే చీరల కోసం ఇక్కడి డిజైనర్లు వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. ధర్మవరం పట్టుచీర జరీ, మోడల్, డిజైన్బట్టి రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచ్చింది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతర ప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశ, విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ధర్మవరంలో 1,800 దాకా సిల్్కషాపులుండగా.. వీటి ద్వారా పట్టుచీరలను కొనుగోలు చేయడం, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి అవుతాయి. ధర్మవరం నేసేపేటలోని పట్టుచీరల మార్కెట్లో వారానికి సగటున రూ.100 కోట్ల దాకా టర్నోవర్ జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి శ్రీసత్యసాయి జిల్లాకు వన్నె తేవాలని నేతన్నలు కోరుతున్నారు. చేనేతకు మంచిరోజులు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో ధర్మవరం చేనేతలకు మంచిరోజులు వచ్చాయి. పుట్టపర్తి ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాక పోకలకు అనుమతినిస్తే వ్యాపారులు ఎక్కువ మంది ధర్మవరం వచ్చే అవకాశం ఉంటుంది. సరుకు ఎగుమతులకూ వీలు కలుగుతుంది. తద్వారా వ్యాపారం మరింత జోరందుకుంటుంది. –రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం జాతీయ అవార్డు అందుకున్నా ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. నేను తయారు చేసిన పట్టుచీర డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు లభించింది. –నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరం. అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తాం ధర్మవరం నేతన్నల నైపుణ్యంతో తయారైన పట్టుచీరలను కొందరు వ్యాపారులు కంచిపట్టు చీరలుగా చెలామణి చేస్తున్నారు. అందువల్లే ధర్మవరం నేతన్నకు అనుకున్నంత పేరు రాలేదు. భౌగోళి గుర్తింపు దృష్ట్యా ధర్మవరం పట్టుచీరకు ఉన్న ప్రత్యేకత తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం. –కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ధర్మవరం. -
సరికొత్త చరిత్ర ... ‘సీమ’కు సముద్రం
సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచడంతో సరికొత్త చరిత్ర నమోదవుతోంది. నూతన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ.. కరువు సీమకు కడలి ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. తాజాగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది. రెండు గిరిజన జిల్లాలు ఇప్పటిదాకా రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. జిల్లాల పునర్ విభజన తర్వాత గిరిజనుల కోసం రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్లో మన్యం జిల్లాగా ప్రకటించగా స్థానికుల వినతిమేరకు పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలుండగా వీటికోసం సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు (ఐటీడీఏ) ఏర్పాటయ్యాయి. ఆంధ్ర కేసరితో ఆరంభం.. ప్రస్తుతం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాలు ప్రముఖుల పేర్లతో ఉండగా జిల్లాల విభజనతో ఇది ఏడుకు పెరిగింది. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో తొలిసారిగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు. బ్రిటీషు వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటైంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది. ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఐదు అత్యధిక వర్షపాత జిల్లాలు.. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా 1,400 మి.మీ సగటు వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తిరుపతి జిల్లా 1,300 మి.మీ, కోనసీమ జిల్లా 1,200 మి.మీ, పార్వతీపురం మన్యం 1150 మి.మీ, విశాఖపట్నం 1,100 మి.మీ వరకు ఉన్నట్లు అంచనా. (చదవండి: కోవిడ్ తర్వాత ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపారం... రాష్ట్ర ప్రభుత్వం రికార్డు) -
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి చేరువ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) 400 బిలియన్ డాలర్ల తన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించనుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ నాటికి భారత్ ఎగుమతుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ఆటో విడిభాగాల పరిశ్రమ మొట్టమొదటిసారి 600 మిలియన్ డాలర్ల మిగులు రికార్డును సాధించినట్లు వెల్లడించారు. ఆటో తయారీదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, దిగుమతుల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ రంగానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో కోరారు. అలాగే పరిశోధనా అభివృద్దిపై (ఆర్అండ్డీ) దృష్టి సారించాలని ఈ రంగానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి ఇందుకు సంబంధించి ఈ–మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి... కాగా, స్థానికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దిశలో ప్రభుత్వం కొన్ని కొత్త ఉత్పత్తులను, వాటిని ఎగుమతి చేయాల్సిన దేశాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ ఉన్న పలు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ‘ఉత్సుకత’ ఉన్న కొనుగోలుదారులను చేరలేకపోతున్నాయని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. జీఐ ఉత్పత్తులంటే... జీఐ ట్యాగ్ ఉత్పత్తుల్లో తిరుపతి లడ్డూసహా కాలా నమక్ బియ్యం, నాగా మిర్చా, బెంగళూరు రోజ్ ఆనియన్, షాహి లిచ్చి, భలియా గోధుమలు, దహ ను ఘోల్వాడ్ సపోటా, జల్గావ్ అరటి, వజ కులం పైనాపిల్, మరయూర్ బెల్లం, డార్జిలింగ్ టీ, బాస్మ తీ రైస్. మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ, బ్లూ పాటరీ ఆఫ్ జైపూర్, బనారసి చీర వంటివి ఉన్నాయి. ఇప్ప టివరకు 417 నమోదిత జీఐ ఉత్పత్తులు ఉన్నాయి. అందులో దాదాపు 150 వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు. 2021లో జీఐ ఉత్పత్తులు భారీగా ఎగుమతులు జరిగిన విభాగాలను పరిశీలిస్తే.. నాగాలాండ్ నుండి బ్రిటన్‌కు నాగా మిర్చా (కింగ్ చిల్లీ) ఒకటి. మణిపూర్, అస్సాం నుండి బ్రిటన్‌కు బ్లాక్‌రైస్ ఎగుమతులు జరిగాయి. అస్సాం నుంచి బ్రిటన్, ఇటలీలకు నిమ్మకాయల ఎగుమతులు జరిగాయి. జీఐ అనేది నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై వినియోగించే ఒక బ్రాండ్ సంకేతం. ఆ మూలం కారణంగా ఉన్న నిర్దిష్ట లక్షణాలను లేదా ఖ్యాతిని సంబంధిత ఉత్పత్తి కలిగి ఉంటుంది. అటువంటి పేరు ప్రఖ్యాతలు ఉత్పత్తి నాణ్యత, విశిష్టతలకు సంబంధించిన హామీని వినియోగదారులకు అందిస్తుంది. -
బ్లాక్ రైస్‌కు అరుదైన గుర్తింపు
ఇంఫాల్ : 'చాఖావో'గా ప్రసిద్ధి గాంచిన మణిపూర్ బ్లాక్ రైస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మణిపూర్ బ్లాక్‌రైస్ భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్ పొందినట్లు శుక్రవారం అధికారిక వర్గాలు ప్రకటించాయి. భౌగోళిక సూచిక తమ అధికారిక వెబ్సైట్లో మణిపూర్ బ్లాక్ రైస్ పేరిట నమోదు చేసిన నివేదికను అధికారులు ధృవీకరించారు. మణిపూర్ బ్లాక్ రైస్‌కు జిఐ ట్యాగ్ ఇవ్వాలంటూ మణిపూర్ లోని చాఖావో (బ్లాక్ రైస్) కన్సార్టియం ప్రొడ్యూసర్స్ ఏడాది కిందట దరఖాస్తు చేసింది. దీనికి వ్యవసాయ శాఖ, మణిపూర్ ప్రభుత్వంతో పాటు నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ బృంద సభ్యుల డాక్యుమెంటేషన్‌తో సహా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏడాదికి పైగా సమయం పట్టిందని అధికారులు వివరించారు. ఒక నిర్ధిష్ట ప్రాంతం నాణ్యత కలిగిన ఉత్పత్తి చేస్తున్న వస్తువును గుర్తించి భౌగోళిక సూచిక(జిఐ ట్యాగ్) ఇవ్వడం జరుగుతుంది. అంతేగాక వాణిజ్యంలో ప్రధానపాత్ర పోషించడానికి జిఐ ట్యాగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు సంప్రదాయంగా ఆచరిస్తున్న నైపుణ్యాలను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే విషయమై ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్, మణిపూర్ అగ్రి బిజినెస్ కన్సార్టియమ్ అధికారి ఎమ్ఎస్ ఖైదెం మాట్లాడుతూ.. మణిపూర్ బ్లాక్‌రైస్ జిఐ ట్యాగ్‌ను పొందడం అరుదైన విషయమన్నారు. ఇప్పుడు బ్లాక్‌రైస్ విత్తనాలను ప్రపంచంలో ఎక్కడైనా అమ్మే శక్తి తమకు ఉందన్నారు. వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తాము అధిక ప్రోటీన్ కంటెంట్ స్థానిక బఠానీ రకం 'హవాయి-తారక్ మఖ్యాత్ముబి' కి జిఐ ట్యాగ్ లభించే విధంగా ప్రక్రియను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖైదెం పేర్కొన్నారు. శతాబ్దాలుగా మణిపూర్‌లో సాగులో ఉన్న చాఖవో అనే సువాసన గల గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే విందులో వండుతారు. దీనిని 'చాఖావో ఖీర్' గా కూడా పిలుస్తుంటారు. అక్కడి వైద్య నిపుణులు చాఖావోను సంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతుంటారు. మణిపూర్ బ్లాక్‌రైస్ కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్ స్థానిక మార్కెట్లో లభిస్తుంది. -
కోడి పెట్టిన చిచ్చు