breaking news
gatekeeper
-
ఆలయంలో ద్వార పాలకులెందుకు?
ఆలయద్వారం అనంతశక్తికేంద్రం అయితే ఆ శక్తిని కాపాడేవారు ఈ ద్వారపాలకులు. వీరినే ప్రతీహారులు అని కూడా అంటారు. ద్వారపాలకులు లోపలి దైవానికి ప్రతినిధులు. ఆలయంలోకి ప్రవేశించేవారెవరైనా వీరి అనుమతి కోరి వెళ్లవలసిందే. ద్వారపాలకులు ఆలయద్వారానికి కుడి ఎడమలలో ఇరువైపులా నాలుగు చేతులతో, ఆయుధాలను ధరించి నిలబడి ఉంటారు. భక్తులకు వీరిని చూస్తే సాధారణంగానే కాస్త భయం కలుగుతుంది. ఎందుకంటే ద్వారపాలకులు కోరపళ్లతో, తీక్షణమైన చూపులతో ఉంటారు. దీనికి కారణం ఏంటంటే భగవంతుని దర్శించడానికి వెళ్లే మనం చాలా జాగ్రత్తగా, మనస్సు ఇతరమైన ఆలోచనలు చేయకుండా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులతో స్వామిసన్నిధికి చేరుకోవాలి. దానికి ద్వారపాలకులు మనకు మార్గదర్శనం చేస్తారు. ద్వారపాలకులు సాధారణంగా గదను లేదా దండాన్ని నిలబెట్టి రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి, పరహస్తాలలో అంటే వెనుక చేతులతో శివాలయంలో త్రిశూలం, డమరుకాన్నీ, విష్ణ్వాలయంలో శంఖం, చక్రం ధరించి నిజహస్తాలతో సూచీముద్ర, తర్జనీముద్ర, విస్మయహస్తం ఇలా ఏదోకటి చూపుతూ ఉంటారు. చూపుడువేలుతో స్వామిని చూపుతూ ’ఆయనను శరణు వేడండి. కష్టాలనుంచి గట్టెక్కే మార్గం ఆయనే చూపుతాడు’ అనేలా కనిపించే ముద్రను సూచీముద్ర లేక సూచీహస్తం అంటారు.‘నీవు అడుగుపెట్టిన చోటు భగవత్ సన్నిధానం. ఈ స్వామి మహిమను, క్షేత్ర మహిమను గుర్తెరిగి మసలు కోండి. తప్పులు చేసి ఆయన ఆగ్రహాన్ని పొందవద్ద’ని చూపుడువేలు నిటారుగా ఉంచి భయపెట్టినట్లుండేది తర్జనీహస్తం. చేసే ప్రతి పనిలోనూ భగవంతుని దర్శించే పని ఒక్కటి చేస్తే చాలు ఇక అంతా ఆయనే చూసుకుంటాడు. మరేం భయమక్కర్లేదు’ అనే తత్త్వం కూడా ఈ తర్జనీముద్ర అంతరం.చదవండి: Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్‘ఈ స్వామి మహిమను వర్ణించడం ఎవరితరం? అనంతమైన స్వామి కరుణను పొందినవారెందరో! దానికీ అంతులేదు. గట్టిగా కొలిస్తే మీరూ పరమపదం పొందగలరు. ప్రయత్నించి చూడండి! ’లోపలి దేవుని నమ్మి చెడిపోయిన వారెవరూ లేరు. మీరూ ప్రయత్నించండి’ అన్నట్లు హస్తాన్ని తన లోపలివైపుకు తిప్పుకుని ఉండేది విస్మయహస్తం. భయాన్ని గొలిపే వారి క్రూరమైన చూపులే భగవంతుని అభయాన్ని మనకందించేలా చేస్తాయి. వారు చేతితో చూపే ముద్రలే మనల్ని దైవసన్నిధికి చేర్చుతాయి. కనుక ప్రతి భక్తుడూ వారి దర్శనం చేసుకుని వారి అనుమతి పొంది భగవద్దర్శనం చేసుకుంటే ఎన్నో రెట్లు శుభఫలితాలు పొందవచ్చు.ఇదీ చదవండి: వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడు– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
ఈ గేట్ కీపర్.. నిన్నటి ఆఫీసర్!
► రవాణా శాఖలో లీలలు ► నష్టపోయిన ఆర్టీవో సలీమ్ ► దున్ను లేకపోవడమే కారణమా! కాలం కలిసిరాకపోతే ఒక ఊరి రాజు మరో ఊరి బంటు కావచ్చు.. ఒక చోట పూలమ్మిన వ్యక్తి మరోచోట కట్టెలమ్మి బతకొచ్చు. ఓడలు బళ్లయి మూలకు చేరొచ్చు.. కానీ అవేవీ ఈ ఉన్నతాధికారి దయనీయ పరిస్థితికి సాటి రాకపోవచ్చు.. ఎందుకంటారా? అది తెలియాలంటే మీరిది చదవాల్సిందే. ఎంత అధికారయినా అయిన వారి అనుగ్రహం లేకుంటే ఎలా మూలన పడి దీనావస్థలో కొట్టుమిట్టాడాల్సి ఉంటుందో తెలుసుకోవాల్సిందే. పైవారి ఘటనల ఫలితంగా కొందరి పరిస్థితి ఎలా తారుమారవుతుందో తెలియాలంటే రవాణా శాఖలో జరిగిన ఈ లీలను అవగతం చేసుకోవాల్సిందే. విశాఖపట్నం : మాధవధారలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారనుకోండి.. అక్కడ వాహనాల రిజిస్ట్రేషన్ కేంద్రం గేటు దగ్గర ఓ కాపలాదారు కనిపిస్తారు. వాహనాల యజమానులు ఇష్టానుసారం లోనికి వెళ్లకుండా చూడడానికి, సందేహాలొస్తే తీర్చడానికి ఓ మామూలు కుర్చీలో కూర్చుని ఆయన పని చేస్తూ ఉంటారు. కూర్చున్న స్థలం బట్టి ఆయన ఓ మామూలు గేట్ కీపర్ అనుకున్నారనుకోండి.. మీరు బోల్తా కొట్టారన్నమాటే.. ఆయన విశాఖపట్నం ట్రాన్స్పోర్ట్ విభాగం రోడ్డు రవాణా అధికారి! నమ్మలేకపోయినా ఇది నిజం. ఔనన్నా కాదన్నా ఇది అక్షర సత్యం. నాన్ ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ కేంద్రంలో గేటు కాపలాదారుగా ఉన్న ఆయన రెండేళ్ల కిందట రెండు పర్యాయాలుగా ఆర్నెల్లు విశాఖ జిల్లాకు ఇన్చార్జి ఉప రవాణా కమిషనర్(డీటీసీ)గా పని చేశారు! మూడేళ్లు అనకాపల్లి ఆర్టీవోగా పనిచేశారు! రోడ్డు రవాణా కార్యాలయంలో జరిగిన విచిత్ర సంఘటనలతో ఇప్పుడిలా గేటు దగ్గరకు చేరారు. వింత మలుపు చాలా మంది ఉద్యోగుల్లా సుమారు పాతికేళ్ల కిందట మహ్మద్ సలీమ్ సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా కెరీర్ ప్రారంభించారు. పదోన్నతితో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయ్యారు. తర్వాత ఆర్టీవో స్థాయికి ఎదిగారు. పదోన్నతి ప్రకటిస్తే డీటీసీ అయ్యేవారే. కానీ ఇక్కడే కథ అనుకోని మలుపు తిరిగింది. గతేడాది అనకాపల్లి కార్యాలయంలో ఆర్టీవోగా పనిచేస్తున్న సమయంలో ఓ అక్రమం జరిగినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. అక్కడ నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో డ్రైవింగ్ లెసైన్స్‌లు మంజూరయినట్టు ఓ వ్యక్తి రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన విజిలెన్స్ విచారణ జరిపించారు. ఆరోపణలు రుజువయ్యాయి. దాంతో పరిపాలన అధికారి (ఏవో)ను, సీనియర్ అసిస్టెంట్‌ను, జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. కార్యాలయ అధికారిగా బాధ్యత ఉందంటూ ఆర్టీవో సలీమ్‌ను కూడా సస్పెండ్ చేశారు. నెల తిరక్కుండానే పరిపాలన అధికారి, క్లర్క్‌లు మళ్లీ ఉద్యోగాలు పొందారు. కానీ ‘ఎంచేతో’ ఆర్టీవో సలీమ్‌కు పోస్టింగ్ ఇవ్వడానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలాగైతేనేం పోస్టింగ్ దక్కింది. అనకాపల్లి ఆర్టీవోగా కాకుండా డీటీసీ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ ఆర్టీవోగా నియమించారు. కానీ హోదా అట్టేపెట్టి ఆయన్ను గేటు వద్ద విధులు నిర్వర్తించాలని నిర్దేశించారు. పేరుకు ఆర్టీవో అయినా ప్రాధాన్యం లేని పోస్టింగ్ కల్పించారు. దాంతో ఒకప్పుడు ఇన్చార్జి డీటీసీగా పనిచేసిన అధికారి విలువ లేకుండా మిగిలారు. ఈ వ్యవహారంలో కొందరు కుట్ర చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పలుకుబడి లేకపోవడం, మైనార్టీ వర్గానికి చెందిన అధికారి కావడంతో ఇలా జరిగి ఉంటుందని ఉద్యోగులు సానుభూతి వ్యక్తం చేస్తున్నా.. సలీమ్ స్థితి మార్చగలిగేవారెవ్వరు?


