breaking news
gas price hiked
-
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
-
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
నాన్ సబ్సిడీ గ్యాస్ ధరలను ఒక్కో సిలిండర్‌కు రూ. 37.5 చొప్పున, సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 2 చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఏడాదికి 12 సిలిండర్లు దాటి వాడేవారికి మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తారు. ఈ తరహా సిలిండర్ల ధరలే ఇప్పుడు ఒక్కోటీ రూ. 37.5 చొప్పున పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ. 529.50, కోల్‌కతాలో రూ. 551, ముంబైలో రూ. 531, చెన్నైలో రూ. 538.50 చొప్పున అవుతాయని ఐఓసీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సబ్సిడీతో కూడిన గ్యాస్ ధరలు కూడా సిలిండర్‌కు రూ. 2 చొప్పున పెరిగాయి. వాటి ధరలు ఢిల్లీలో రూ. 430.64, కోల్‌కతాలో రూ. 432.64, ముంబైలో రూ. 460.27, చెన్నైలో రూ. 418.14 వంతున అవుతాయి.