breaking news
FY17 results
-
నష్టాలను తగ్గించుకున్న ఫ్లిప్‌కార్ట్..కానీ
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే గత సంవత్సరం పోలిస్తే నష్టాలనుంచి తేరుకున్నామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మార్చి 2017తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.1639.3 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.2305.7కోట్లుగా ఉంది. అలాగే కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ 15 శాతం పెరిగింది. ఎంప్లాయ్ బెనిఫిట్ కాస్ట్ 3 శాతం తగ్గింది. అలాగే కంపెనీ మొత్తం అమ్మకాలు కూడా క్షీణించాయి. రెగ్యులేటరీ సంస్థలకు ఫ్లిప్‌కార్ట్ ఈ సమాచారాన్ని తెలిపింది. లాజిస్టిక్స్, నిల్వ సేవ ఛార్జీలు, సేకరణ ఛార్జీలు, ఇతర ఖర్చుల తగ్గింపు కారణంగా 28.96 శాతం నష్టాలను తగ్గించుకున్నామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. కాగా గ్లోబల్ రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ -ఫ్లిప్ కార్ట్ మెగా డీల్ ఇప్పటికే ఖరారైంది. ఫ్లిప్‌కార్ట్ లో 16 బిలియన్ డాలర్ల 77 శాతం వాటా కొనుగోలు ఒప్పందం చేసుకుంది. దీనికితోడు భారత్‌లో తన వ్యాపార ప్రత్యర్థి అమెజాన్‌కు డీకొట్టేలా మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై కూడ వాల్‌మార్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్ పై వ్యాపార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ డీల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఐటీ శాఖ ప్రకటించింది. -
లాభాల్లో మారుతీ రయ్..రయ్..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విశ్లేషకులు అంచనాలను అధిగమించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 23 శాతం జంప్ అయి, రూ.1,486.2 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,208.1 కోట్లగా ఉన్నాయి. రెవెన్యూలు 11.6 శాతం ఎగిసి, రూ.14,655 కోట్లగా రికార్డు చేసింది. అయితే రూ.15,133 కోట్ల అమ్మకాలతో కేవలం రూ.1,197 కోట్లను మాత్రమే మారుతీ సుజుకీ నికర లాభాలు నమోదవుతాయని ఎన్డీటీవీ నిర్వహించిన మార్కెట్ విశ్లేషకుల పోల్ లో తేలింది. ఈ అంచనాలను అధిగమించి, మారుతీ సుజుకీ తన లాభాల్లో దూసుకెళ్లింది. కంపెనీ సంపాదించిన ఇతరత్రా ఆదాయాలు లాభాలు పెరగడానికి దోహదంచేశాయని కంపెనీ పేర్కొంది. టర్నోవర్ ఎక్కువగా ఉండటం, ముడి సరుకుల వ్యయాల తగ్గుదల, నాన్-ఆపరేటింగ్ ఆదాయాలు పెరగటం,తక్కువ తరుగుదల ఇవన్నీ జూన్ త్రైమాసికంలో లాభాలు పెరగడానికి దోహదం చేశాయని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది. జూన్ త్రైమాసికంలో ఇతరాత్ర ఆదాయలు 134 శాతం పెరిగి, రూ.483 కోట్లగా నమోదయ్యాయి. అయితే రెవెన్యూ ముందస్తు అంచనాలను మారుతీ మిస్ చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో రెవెన్యూ అంచనాలను కంపెనీ మిస్ అయినట్టు మారుతీ పేర్కొంది. మనేసర్‌లోని సుబ్రోస్ లిమిటెడ్ ప్లాంట్‌లో నెలకొన్న ప్రమాద కారణంగా ఆ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయడంతో, కంపెనీ 10 వేల యూనిట్ల ఉత్పత్తిని కోల్పోయిందని వెల్లడించింది. దీంతో వాల్యుమ్ గ్రోత్ పడిపోయిందని నివేదించింది. జూన్ క్వార్టర్లో కంపెనీ 3.84 లక్షల వాహనాలను విక్రయించినట్టు మారుతీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ అమ్మకాలు 3.41 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది బేసిక్‌గా ఎగుమతులు 27 శాతం పడిపోయినా.. దేశీయ అమ్మకాలు 5.4 శాతం పెరిగినట్టు తన ఫలితాల్లో మారుతీ నివేదించింది.