breaking news
The first step
-
కేఎంసీలో పీజీ సీట్ల పెంపునకు తొలి అడుగు
ఎంజీఎం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల సూపర్‌స్పెషాలిటీ విభాగంలో పీజీ సీట్ల పెంపు కోసం అధి కారులు తొలి అడుగు వేశారు. కేఎంసీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సీట్ల పెంపు కోసం అధికారులు ప్రయత్నించ లేదని తెలుస్తోంది. మొట్ట మొదటిసారిగా 14 పీజీ సీట్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఆరోగ్య వర్సిటీ అఫిలి యేషన్ పొంది కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వివరాల్లోకి వెళితే.. కేఎంసీకి అనుబంధంగా ఉన్న ఎంజీ ఎంలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పిడియాట్రీక్ సర్జరీ, యూరాలజీ, డీఎం నియోనాటాలజీ విభాగాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉండడంతోపాటు వైద్యసేవలు మెరుగుపడడంతో కేఎంసీ అధికారులు పీజీ సీట్ల పెంపునకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు గ్యాస్ట్రో ఎంట్రాలజీకి నాలుగు, యూరాలజీకి నాలుగు, పిడియాట్రికీ సర్జరీకి నాలుగు సీట్లతోపాటు డీఎం నియోనాటాలజీ విభాగానికి మరో రెండు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో పాటు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అఫిలియేషన్ పొందడంతో సీట్ల పెంపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరిట రూ. 8 లక్షల డీడీని సైతం ప్రతిపాదనలతో పంపించారు. కాగా, ఈనెల 31వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి సీట్ల పెంపు కోసం ఎంసీఐకి సిఫారసు చేయనుంది. దీంతో ఎంసీఐ బృందం సీట్ల పెంపునకు కావాల్సిన పరికరాలు, వైద్య సిబ్బంది ఆస్పత్రిలో ఉన్నారా.. లేదా అని కేఎంసీలో తనిఖీ చేసిన ఆనంతరం సీట్లు మంజూరు చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. డీఎంఈతో ప్రత్యేక సమావేశం : ప్రిన్సిపాల్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పాటు డీఎంఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి పీజీ సీట్ల పెంపుపై ప్రతిపాదనలు పంపించినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో డీఎంఈతో జరిగిన సమావేశంలో ఎంసీఐ తనిఖీ చేసే సమయానికి ఆస్పత్రిలో అన్ని రకాల పరికరాలతో వైద్య సిబ్బందిని నియమించాలని కోరామన్నారు. దీనికి అన్ని విధాల సహకరిస్తామని డీఎంఈ రమణి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రోగులకు మెరుగైన సేవలు : డాక్టర్ బలరాం పిడియాట్రిక్ విభాగంలో డీఎం నియోనాటాలజీ వంటి సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్ల పెంపుతో నవజాత శిశు సంరక్షణ మరింత మెరుగుపడుతుందని పిడియాట్రిక్ విభాగాధిపతి, డాక్టర్ బలరాం అన్నా రు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకంతో అత్యున్నత వైద్య విద్య కోర్సులు కేఎంసీకి వస్తాయని పేర్కొన్నారు. -
‘రుణమాఫీ' విడుదల
రుణమాఫీ విడుదలతొలివిడతగా రూ.414.25 కోట్లు కరీంనగర్ : రుణమాఫీపై ప్రభుత్వం తొలి అడుగువేసి అన్నదాతల ఆశలకు ఊపిరిపోసింది. మాఫీ కోసం కొద్ది రోజులుగా నిరీక్షిస్తున్న రైతులకు ప్రభుత్వం తొలివిడతగా 25 శాతం నిధులను శనివారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,73,876 మంది రైతులకు 31 బ్యాంకుల్లో కలిపి రూ.1,656 కోట్లు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించింది. మొదటి దఫాగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,250 కోట్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న సంతకం చేశారు. ఇందులోంచి మన జిల్లాకు రూ.414.25 కోట్లు రాగా, వాటిని 116 జీవో ప్రకారం శనివారం విడుదల చేశారు. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మిగతా మొత్తం రుణం ఎప్పుడు మాఫీ అవుతుందోననే ఉత్కంఠ రైతుల్లో నెలకొంది. -
అందంగా... మొదటి అడుగు...
మెట్టినింట పెట్టే మొదటి అడుగు అందంగా ఆ తర్వాతి అడుగు ఆనందంగా సాగాలని నవవధువు కోరుకుంటుంది. అమ్మాయిల ఊహలకు తగ్గట్టు డిజైనర్లు పెళ్లికూతురి పాదాలను ఆభరణాల అలంకరణలతో ముచ్చటగొలుపుతున్నారు. వివాహ సమయాలలో పెళ్లికూతురికి నగల అలంకరణ ఎంత బాగుంటే అంత కళగా ఉంటుంది. అందుకే పెద్దలు కూడా వధువు ఆభరణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మెడకు, చేతులకు, నడుముకు నగలను ఆలంకరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఇప్పుడు పాదాలను ఈ జాబితాలో చేర్చుతున్నారు ఆభరణాల నిపుణులు. కాళ్లపట్టీల గురించి తెలిసిందే! కానీ పాదాలను కప్పినట్టుగా ఉంచే ఈ డిజైన్లు అతివలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పాదాల ఆభరణాలలో కుందన్స్, పూసలు, ముత్యాల మెరుపులు కొత్తగా కాంతులీనుతున్నాయి. బంగారు, వెండి ఆభరణాలలోనే కాకుండా వన్ గ్రామ్ గోల్డ్‌లో ఇవి కనువిందు చేస్తున్నాయి.