father-daughter died
-
గోడ కూలి తండ్రీకూతురు మృతి
ములుగు: మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి తండ్రీకూతురుపై పడింది. ఈ సంఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. గత వారం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల సమీపంలో కూడా ఇదే రీతిన గోడ కూలి ఒకే ఇంట్లోని నలుగురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
రోడ్డుప్రమాదంలో తండ్రీకూతురు మృతి
జిల్లాలోని తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద గురువారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో తండ్రీకూతురు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. హార్వెస్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.