breaking news
Engineering Projects
-
అంటార్కిటికాకు ఫైబర్ నెట్.. షాకిస్తున్న భారీ ప్లాన్!
శాంటియాగో: ప్రపంచంతో అంటార్కిటికా ఖండాన్ని అనుసంధానించేందుకు సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్ మార్గం సాంకేతికంగా సాధ్యమేనని చిలీ టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ సంస్థ (సబ్టెల్) నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం అంటార్కిటికాలో భారీ మంచుకొండలు ఉన్నందున ఇంటర్నెట్ కేబుల్స్ లేవు. అక్కడి పరిశోధనా కేంద్రాలు పూర్తిగా ఉపగ్రహాలు, ఓడలు లేదా విమానాల ద్వారా సూట్‌కేసుల్లో తరలించే హార్డ్ డ్రైవ్లపైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల బ్యాండ్‌విడ్త్ పరిమితమై, పరిశోధనా కార్యకలాపాలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోంది.డ్రేక్ పాసేజ్ మీదుగా సముద్రగర్భ కేబుల్ ఏర్పాటుకు ఈ అధ్యయనం రెండు మార్గాలను ప్రతిపాదించిందికనిష్ట నిర్మాణం: కింగ్ జార్జ్ ఐలాండ్, ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పం పరిసరాల్లోని 3 కేంద్రాలను కలుపుతూ సుమారు 1,600 కిలోమీటర్ల మేర కేబుల్ లింక్ ఏర్పాటు చేయడం.అనుకూల నిర్మాణం: సుమారు 4,100 కిలోమీటర్ల మేర విస్తరించి, 9 అంటార్కిటిక్ ల్యాండింగ్ పాయింట్లతో చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా, బ్రిటన్ దేశాల పరిశోధనా కేంద్రాలను అనుసంధానించడం.ఈ వ్యవస్థ ద్వారా ఒక్కో ల్యాండింగ్ పాయింట్‌కు 15 నుంచి 30 టిబిట్/సెకను (Tbit/s) సామర్థ్యంతో రియల్ టైమ్ డేటా ప్రసారం సాధ్యమవుతుంది. సాధారణ కమర్షియల్ కేబుల్స్లా కాకుండా, సముద్రపు అడుగుభాగంలో ‘స్మార్ట్’ సెన్సార్లను పొందుపరచనున్నారు.ఎదురయ్యే సవాళ్లుఈ ప్రాజెక్టు ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటిది డిసెంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో కేవలం మూడు వేసవి కాలాల్లో మాత్రమే పనులు చేపట్టేందుకు తక్కువ సమయం ఉండటం. రెండోది.. మంచుకొండల రాపిడి నుంచి కేబుళ్లను రక్షించడం. ఇందుకోసం హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్, డబుల్-ఆర్మర్డ్ కేబుళ్లను అధ్యయనం సిఫార్సు చేసింది. అయితే, అంతర్జాతీయ అనుమతులు, నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి కావడానికే దాదాపు ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నివేదికను అంతర్జాతీయ ఆమోదం కోసం చిలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అంటార్కిటిక్ పాలసీ కౌన్సిల్‌కు సమర్పించారు.ఇది కూడా చదవండి: ట్రంప్‌కు భారీ ఊరట.. మెయిల్ ఇన్ ఓటింగ్‌పై సంచలన తీర్పు! -
‘వరల్డ్ పీపుల్స్ చాయిస్’ రేస్‌లో మెట్రో
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఘనతను సాధించే విషయంలో హైదరాబాద్ మెట్రో ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులతో పోటీపడుతోంది. ఇదే క్రమంలో తాజాగా లండన్‌కు చెందిన ఐసీఈ సంస్థ ప్రదానం చేసే పీపుల్స్ చాయిస్ అవార్డు సాధించేందుకు కేవలం 2 వేల ఓట్ల దూరంలో గ్రేటర్ మెట్రో నిలిచినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అవార్డు రేసులో నగర మెట్రో ప్రాజెక్టుతో న్యూజిలాండ్‌లోని మరో భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు పోటీపడుతోందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఓటు వేసేందుకు https://www.ice. org.uk/what&is&civil&engineering/what&do&civil&engineers&do/hyderabad&metro&rail&project లింక్‌ను క్లిక్ చేసి ఓటు వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు. -
ఉద్యోగ సమాచారం
ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్.. వివిధ విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 64. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.epi.gov.in/ recruitment_form.asp చూడొచ్చు. ఎన్ఐఎస్సీఏఐఆర్లో టెక్నీషియన్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (ఎన్ఐఎస్సీఏఐఆర్).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 23. వివరాలకు www.niscair.res.in చూడొచ్చు. ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో అసిస్టెంట్స్ (ఫైనాన్స్) ఇండియన్ మారిటైం యూనివర్సిటీ.. అసిస్టెంట్స్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయసు 35 ఏళ్లు మించరాదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 18. వివరాలకు www.imu.edu.in చూడొచ్చు. నిమ్స్-హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్లు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)-హైదరాబాద్.. ఆరు నెలల వ్యవధికి మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 34 ఏళ్లకు మించరాదు. నవంబర్ 9న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు www.nims.edu.in చూడొచ్చు. ఎన్ఐటీ - హమీర్‌పూర్‌లో లెక్చరర్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) - హమీర్పూర్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. నవంబర్ 18న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు www.nith.ac.in చూడొచ్చు. ఐసీఏఆర్-అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసీఏఆర్- అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్ఆర్ఎఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సీనియర్ రీసెర్చ్ ఫెలో (3 పోస్టులు), డేటా ఎంట్రీ ఆపరేటర్ (2 పోస్టులు). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 16, 17. వివరాలకు www.zpdk.org.in చూడొచ్చు. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసోంలోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అటెండెంట్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం పోస్టులు 6. ఇంటర్వ్యూ తేది నవంబర్ 23. వివరాలకు http://icfre.gov.in చూడొచ్చు. సీఆర్పీఎఫ్లో 570 కానిస్టేబుల్ పోస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్).. స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (ఖాళీలు -82), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (ఖాళీలు -448) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 23 ఏళ్లకు మించరాదు. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు http://crpf.nic.in చూడొచ్చు.


