breaking news
Divya Teja
-
దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?
-
లాకప్‌లోనే నా కుమారుడ్ని చంపేశారు
ఒంగోలు టౌన్: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి బిడ్డను పోగొట్టుకున్న మరో తల్లి కన్నీరు పెట్టుకుంది. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బి.బిట్రగుంట మండలం అల్లిమడుగు సంగం గ్రామానికి చెందిన మల్లి దివ్యతేజ తల్లి సలోమీ తన కుమారుడిని పోలీసులే పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరయింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తమను ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతోనే పోలీసులు దివ్యతేజను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపారని అతని చెల్లెలు శ్రీనిధి వాపోయింది. దివ్యతేజను ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని, ఆ దెబ్బలకు లాకప్‌లోనే చనిపోయాడని, ఆ తరువాత పంట పొలాల్లో పడేశారని సలోమీ, శ్రీనిధి ఆరోపించారు. దివ్య తేజ మృతదేహం జె.పంగులూరు మండలం రేణింగవరం–కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో గురువారం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శుక్రవారం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడకు వచ్చి న హతుడి తల్లి సలోమీ, చెల్లెలు శ్రీనిధి మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. దివ్యతేజను పోలీసులే కొట్టి చంపారని ఆరోపించారు. దివ్యతేజ బాధితుల కథనం ప్రకారం.. మల్లి దివ్యతేజ (34) గత శనివారం రాత్రి దాబాకు వెళ్లి భోజనం చేసి వస్తానంటూ తల్లి సలోమీ వద్ద డబ్బులు తీసుకొని స్నేహితుడు సాతపాటి శశికాంత్‌తో కలిసి బయలుదేరాడు. రాత్రి 12 గంటలకు ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు వారిని పట్టుకెళ్లారు. శశికాంత్‌ను వదిలి పెట్టిన పోలీసులు దివ్యతేజ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి అతను కనిపించలేదు. అనుమానం వచ్చి న తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి నెల్లూరు జిల్లా కావలి పోలీసు స్టేషన్‌కు వెళ్లి సీఐకు ఫిర్యాదు చేశారు. జె.పంగులూరు తన పరిధిలో లేదు కనుక అక్కడకు వెళ్లి పోలీసులను కలవమని ఆయన సలహా ఇచ్చారు. దాంతో బాధితులు జె.పంగులూరు ఎస్సైని కలవగా.. శశికాంత్ ఒక్కడినే పట్టుకున్నామని, దివ్యతేజ సంగతి తెలియదని చెప్పారు. ఆ సమయంలో ఎస్సై కంగారుపడినట్లు వారు గమనించారు. ఈనెల 1వ తేదీ వరకు పోలీసుల నుంచి సమాచారం లేకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు. దివ్యతేజ ఆచూకీ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ సమాచారం తెలిసిన గంటకే పోలీసులు లాయర్‌కు ఫోన్ చేసి కండమూరు పొలాల్లో దివ్యతేజ మృతదేహం ఉన్నట్లు గుర్తించామని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడకు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో దివ్యతేజ మృతదేహం పొలాల్లో పడి ఉంది. దెబ్బలతో ఒళ్లంతా కమిలిపోయి ఉన్నట్లు గమనించారు. ఇవన్నీ పోలీసులు కొట్టిన దెబ్బలేనని, తన కుమారుడిని లాకప్‌లో కొట్టి చంపేశారంటూ సలోమీ విలపించారు.మమ్మల్ని చూడగానే ఎస్సై కంగారుపడ్డారు: శ్రీనిధితాము హైకోర్టులో పిల్ వేయకపోతే తన అన్న మృతదేహాన్నీ పోలీసులు మాయం చేసేవారని దివ్యతేజ చెల్లెలు శ్రీనిధి కన్నీరు పెట్టుకుంది. జె.పంగులూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తమను చూడగానే ఎస్సై కంగారు పడిపోయారని, భయంభయంగా మాట్లాడడంతో ఏదో జరిగిందన్న అనుమానం వచ్చి ందని తెలిపారు. తన సోదరుడు డిగ్రీ చదివాడని, ఐటీఐ చేశాడని చెప్పారు. ఆయనకు 4, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, భార్య చనిపోయిందని, ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాడని వివరించింది. పోలీసులు తన అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని విలపించింది. కోర్టుకు వెళ్లకపోతే శవం కూడా దొరికేది కాదు: నీలం నాగేందర్ బాధితులు హై కోర్టులో పిటిషన్ వేయకపోతే దివ్యతేజ మృతదేహం కూడా దొరికేది కాదని దళిత హక్కుల సంఘం నాయకుడు నీలం నాగేందర్ చెప్పారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత నాయకులు కాకుమాను రవి, కోలా జీవరత్నం, దేవరపల్లి గోపి, ఎర్రమల శ్రీనుతో కలిసి ఆయన జీజీహెచ్ వద్ద బాధిత కుటుంబంతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పోలీసులు దివ్యతేజను లాకప్‌లోనే కొట్టి చంపారని, శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాధితులు కోర్టులో పిటిషన్ వేసే దాకా మృతదేహం ఎక్కడ ఉందో కూడ చెప్పలేదన్నారు. దివ్యతేజ కంటి మీద, వీపు మీద, పొట్టమీద గాయాలున్నాయని, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయని తెలిపారు. దివ్యతేజ లాకప్‌డెత్ కేసులో వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని, కేసును గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.విచారణ జరుపుతున్నాం: దర్శి డీఎస్పీ గత నెల 29వ తేదీ రాత్రి జె.పంగులూరు లిమిట్స్‌లో నైట్ బీట్‌లో ఉన్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకొని వెళ్లి పోవడానికి ప్రయత్నించడంతో అనుమానం వచ్చి వెంటపడ్డారని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. మరుసటి రోజు శశికాంత్‌ను పోలీసులు పట్టుకున్నారని, రెండో వ్యక్తి పారిపోయాడని తెలిపారు. గురువారం మధ్యాహ్నం కండమూరు పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని, విచారణలో అది దివ్యతేజదిగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాధితుల ఆరోపణలో నిజం లేదన్నారు. -
ఇద్దరు జిల్లా యువకులను మింగేసిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన
పెంటపాడు/గణపవరం : నిరుపేద కుటుంబాలు వారివి. .నేలతల్లిని మన్ముకుని జీవించే వారి తల్లిదండ్రులకు చేతికంది వచ్చారు. తమ బిడ్డలు ప్రయోజకులవటంతో కష్టాలు, కన్నీళ్లు ఉండవని సంబరపడుతున్న తరుణంలో వారి జీవితాలతో విధి ఆడుకుంది. తూర్పుగోదావరి జిల్లా నగరంలో సమీపంలో జరిగిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన ఇద్దరి యువకుల్ని పొట్టనబెట్టుకుని. వారి తల్లిదండ్రులకు కడుపుకోతతోపాటు, వృద్ధాప్యంలో ఉన్న తమను చక్కగా చూసుకుంటారని భావించిన వారి ఆశలకు నిప్పు పెట్టింది. సరిగ్గా వారం క్రితం ఇదే రోజు చెల్లెలి నిశ్చితార్థం కావటంతో ఆ వేడుకలో సందడి చేశాడు గోపిరెడ్డి దివ్వతేజ(24). పనులన్నీ తన భుజాన వేసుకుని చక్కబెట్టాడు. వచ్చిన బంధువులందరినీ పేరుపేరునా పలకరించాడు. పెంటపాడు మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు సత్యనారాయణ కుమారుడు దివ్యతేజ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. జయసుందర్ ఇంజనీరింగ్ వర్క్స్‌లో మెకానికల్ వింగ్‌లో సూపర్వైజర్గా ఏడేళ్లుగా నగరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తమ ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు గ్యాస్ పైప్‌లైన్ రూపంలో మింగేసిందని తెలిసి అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. తేజ తల్లి లక్ష్మి, చెల్లెలు మౌనిక షాక్‌నుంచి తేరుకోలేదు. కష్టపడి పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించిన సత్యనారాయణ చెట్టంత కొడుకును పోగొట్టుకుని విలపిస్తున్నారు. గణపవరం గ్రామానికి చెందిన మద్దాల శాంతబాలాజీ (25) ఇదే ప్రమాదంలో మృతిచెందాడు. బాలాజీ రెండేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో గెయిల్ పైప్‌లైన్ మెయింటెనెన్స్ చేసే కాంట్రాక్టర్ వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీ తండ్రి ధనం వ్యవసాయ కూలీ. తల్లి సుబ్బలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులుకాగా బాలాజీ న్న అన్న కూడా వ్యవసాయ కూలీ. రామలక్ష్మణుల్లా ఉండే తమ ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొడుకుపై వారికి ఉన్న మమకారం తెలిసిన బందువులు ప్రమాదంలో బాలాజీ మృతి చెందిన వార్తను చాలా సమయం వరకు అతని తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. టీవీలో వార్తలు చూసి కలవరపాటుకు గురైన బాలాజీ తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమంగానే ఉన్నాడని భావించారు. అతనికి ఏమీ కాకూడదని దేవుడ్ని వేడుకున్నారు. కానీ వారికి కడుపుకోత మిగిలింది.


