breaking news
district head quarter
-
అదిగదిగో.. జిల్లాకేంద్రం!
♦ ఈసాకుతో భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు ♦ ఇష్టారాజ్యంగా పెంచుతున్న దళారులు ♦ శంషాబాద్‌లో అడ్డగోలు దందా ♦ వినియోగదారులూ.. పారాహుషార్ శంషాబాద్: శంషాబాద్‌లో దళారుల దందా మూడు ప్లాట్లు.. ఆరు బిట్లు.. అనే విధంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం ప్రకటనతో రెక్కలు విప్పుకున్న రియల్ ఎస్టేట్ దళారులు ఖాళీగా ఉన్న భూములపై వాలిపోతున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేస్తూ నిజమైన కొనుగోలుదారులను అవస్థల పాలుచేస్తున్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నాటి నుంచి రియల్ వ్యాపారం మరోసారి జోరందుకుంది. దీనిని అదనుగా చేసుకున్న మధ్యవర్తుల దందా కూడా పెరిగిపోయింది. శంషాబాద్లోనే శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకముందే అదిగో జిల్లా కేంద్రం.. ఇదిగో జిల్లా కేంద్రం.. అంటూ భూముల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. శంషాబాద్ పంచాయతీ పరిధిలోని హుడా కాలనీలో సర్వే నంబరు 726 నుంచి 730 వరకు ఉన్న హెచ్ఎండీఏ స్థలాల్లో ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఔటర్ రింగురోడ్డు, నలభైనాలుగో నంబరు జాతీయ రహదారికి ఇది అత్యంత చేరువులో ఉండడంతో ఇక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పట్టణవాసులు కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఈ భూములపై పరిశీలన కూడా చేపట్టలేదు. ప్రజా సంఘాలు, పార్టీల నుంచి జిల్లా కేంద్రానికి డిమాండ్‌గా ఉన్న ఈ భూములకు సమీపంలోనే ఉన్న హుడా కాలనీ, ఎయిర్‌పోర్టు కాలనీలో పదిహేనురోజుల కిందట ఉన్న ధరలను మధ్యవర్తులు అడ్డగోలుగా పెంచేశారు. నెలరోజుల కిందట రూ. 2-3 వేలకు గజం ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 6-8 వేల వరకు చేరాయి. నిన్నమొన్నటి వరకు ఏమాత్రం డిమాండ్ లేని ఈ భూముల్లో మధ్యవర్తులు పెద్దఎత్తున తచ్చాడుతున్నారు. వీరు కృత్రిమంగా పెంచుతున్న ధరలతో సొంతిల్లు కోసం స్థలం కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఇక్కట్లు తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. దళారులు అడ్డగోలుగా విక్రయిస్తున్నా.. భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే వినిచయోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. పట్టణంలోని హుడా కాలనీ సమీపంలో ఉన్న కొన్ని భూముల్లో ఓవ్యక్తి పెద్దఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయమై ఇప్పటికే దళారుల మధ్య తీవ్రంగా చర్చజరుగుతోంది. ఇవే కాకుండా ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఓ బడావ్యాపారి స్థానిక రియల్ వ్యాపారులకు ఒప్పదం చేసిన వెంచర్లో కూడా కొన్ని ప్లాట్లను ఇద్దరు, ముగ్గురికి విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒప్పందం చేసుకున్న వారితో పాత యజమానికి కూడా తిరిగి ప్లాట్లు విక్రయిస్తుండడడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్లాట్లు కొనుగోలు చేసే వారు ముందస్తుగా పూర్తి సమాచారంతో అప్రమత్తం కాకపోతే దళారుల చేతిలో భారీగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత రియల్ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటు స్థలంపై ఏమాత్రం స్పష్టత నివ్వకముందు దళారులు చేస్తున్న ప్రచారాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
26 నుంచి ఐసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు ఆప్షన్ల ఎంపిక 26 నుంచి 31 వరకు సెప్టెంబర్ 3న సీట్ల కేటాయింపు కమాన్‌చౌరస్తా : టీఎస్ ఐసెట్–2016 విద్యార్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది. జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్కు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఎస్సారార్ కళాశాలలో ఇందు కోసం రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీరోజు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో నిర్ణీత ర్యాంకుల విద్యార్థుల సర్టిపికెట్లు పరిశీలించనున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల సమన్వయ అధికారి బి.రాజ్‌గోపాల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు , మధ్యాహ్నం 1:30 గంటలకు విద్యార్థులు ర్యాంకులవారీగా హాజరవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలు –టీఎస్ ఐసెట్–2016 ర్యాంకు కార్డు –టీఎస్ ఐసెట్–2016 హాల్‌టికెట్ –ఆధార్‌కార్డు –డిగ్రీ మార్కుల పత్రం –ఇంటర్ లేదా తత్సమాన అర్హత మార్కుల పత్రం –ఎస్ఎస్సీ లేదా తత్సమాన అర్హత మార్కుల పత్రం –స్టడీ సర్టిపికెట్ 9 వతరగతి నుంచి డిగ్రీ వరకు –ట్రాన్స్ఫర్ సర్టిపికెట్ –ఆదాయ ధ్రువీకరణ పత్రం(01.01.2016 తర్వాత జారీచేసిన) –కుల ధ్రువీకరణ పత్రం –నివాస ధ్రువీకరణపత్రం –పైన తెలిపినవన్నీ రెండు సెట్ల జిరాక్స్ ఎస్టీలు పాలిటెక్నిక్‌లోనే.... జిల్లాలోని అన్ని ర్యాంకులకు చెందిన ఎస్టీ విద్యార్థులు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోనే విధిగా హాజరుకావాలి. ఇతర సహాయ కేంద్రంలో అనుమతించరు. వికలాంగులు, ఆర్మీ విద్యార్థులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా విద్యార్థులు హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ వద్ద సాంకేతిక విద్యాభవన్‌లో హాజరుకావాలి. ఫీజు వివరాలు.... సర్టిపికెట్ల పరిశీలన సమయంలో ఓసీ, బీసీలకు చెందిన విద్యార్థులు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ వారు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీలో ఓసీ, బీసీ విద్యార్థులు 50 శాతం మార్కులు, ఎస్సీఎస్టీ విద్యార్థులు 45 శాతం కలిగి ఉండాలి. ఎంట్రన్స్ సమయంలో బయోమెట్రిక్ హాజరువిధానం అములు చేసినందున పరీక్ష రాసిన విద్యార్థి తప్పనిసరిగా సర్టిపికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. ఇక్కడ కూడా వేలిముద్రలు సేకరించి సరిపోలుస్తారు. గోరింటాకు పెట్టకుని వస్తే వేలిముద్రల సమయంలో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ర్యాంకువారీగా తేదీలు.. తేదీ సమయం మహిళా పాలిటెక్నిక్ ఎస్సారార్ కళాశాల (హాజరవ్వాల్సిన ర్యాంకు) (హాజరవ్వాల్సిన ర్యాంకు) 26 ఉదయం 1–3000 3001–6000 మధ్యాహ్నం 6001–9000 9001–12000 27 ఉదయం 12001–15000 15001–18000 మధ్యాహ్నం 18001–21000 21001–24000 28 ఉదయం 24001–27000 27001–30000 మధ్యాహ్నం 30001–33000 33001–36000 29 ఉదయం 36001–39500 39501–43000 మధ్యాహ్నం 43001–46500 46501–50000 30 ఉదయం 50001–53500 53501–57000 మధ్యాహ్నం 57001–60500 60501–చివరిర్యాంకు వెబ్ ఆప్షన్ల తేదీలు ర్యాంకు వారీగా తేదీ ర్యాంకులు 26, 27 1–12000 27, 28 12001–24000 28, 29 24001–36000 29, 30 36001–50000 30, 31 50001–చివరిర్యాకు సెప్టెంబర్ 3న సీట్ల కేటాయింపు టీఎస్ ఐసెట్–2016 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై ఆప్షన్లను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం 8 గంటల తర్వాత సీట్ల కేటాయింపు జరుగుతుంది. అన్ని ర్యాంకుల వారికి సెప్టెంబర్ 1 తేదీన అప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది. మొబైల్ నంబర్ సరిచూసుకోవాలి –బి.రాజ్‌గోపాల్, మహిళా పాలిటెక్నిక్ కళాశాల క్యాంప్ ఆఫీసర్ (21కెఎన్‌టీ126) ఐసెట్–2016 సర్టిపికెట్ల పరిశీలన సమయంలో విద్యార్థులు వారి మొబైల్ నంబరు నమోదు చేసే ప్రక్రియలో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఐసెట్‌కు సంబంధించిన పాస్వర్డ్, సీట్ల కేటాయింపు వివరాలన్నీ మొబైల్ నంబర్‌కే వస్తాయి. మొబైల్ నంబర్ కీలకంగా ఉంటుంది. దానిని స్విచ్ఆఫ్ చేయడం, సిమ్‌కార్డు తీసివేయడం వంటివి చేసి ఇబ్బందులకు గురికావద్దు. నంబర్ మార్చుకోవాలంటే హైదరాబాద్‌కు సమాచారం ఇవ్వాలి. -
వికారాబాద్, సిద్దిపేటలను జిల్లాలుగా మారుస్తాం: హరీష్
రంగారెడ్డి: వికారాబాద్, సిద్దిపేటలను కచ్చితంగా జిల్లాలుగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఆయన పర్యటించారు. వికారాబాద్ ను ప్రత్యేక జల్లా చేయలంటూ డిమాండ్ చేస్తూ వ్యాపారులు ర్యాలీ చేపట్టారు. దీంతో వికారాబాద్ ను జిల్లాగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.