breaking news
Dimpy Ganguly
-
నవ్వు ఆపుకోలేకపోయిన మాజీ భార్య
ముంబై: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రాహుల్ మహాజన్ మూడోసారి పెళ్లి చేసుకున్నారు. కజక్‌స్తాన్ మోడల్ నటాల్య ఇలినాను నంవబర్ 20న ఆయన పెళ్లాడారు. వివాదాలతో సావాసం చేసిన మహాజన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో పైలట్ శ్వేతా సింగ్, టీవీ నటి డింపీ గంగూలీని ఆయన పెళ్లిచేసుకుని, విడిపోయారు. మహాజన్ మూడో పెళ్లిపై ఆయన మాజీ భార్య డింపీ స్పందించారు. ఈ వార్త విని తనకు మొదట నవ్వు వచ్చిందని వెల్లడించారు. రాహుల్, ఇలినా సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గృహహింస కారణంగానే మొదటి ఇద్దరు భార్యలు రాహుల్ నుంచి విడిపోయారు. ఆయనకు శ్వేతా సింగ్ చిన్ననాటి స్నేహితురాలు. 13 ఏళ్లుగా పరస్పర పరిచయం ఉన్నప్పటికీ వారి వైవాహిక జీవితం విచ్ఛిన్నమైంది. శారీరకంగా హింసిస్తున్నాడన్న కారణంతో 2007, డిసెంబర్లో అతడి నుంచి విడిపోయారు. 2008లో వీరికి విడాకులు మంజురయ్యాయి. అదే ఏడాది హిందీ బిగ్‌బాస్ 8లో ఆయన పోటీ పడ్డారు. గ్రాండ్ ఫైనల్ చేరువైన సమయంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆయనను షో నుంచి తప్పించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా పాయల్ రొహతగి, మోనికా బేడితో ప్రేమాయాణం నడిపినట్టు ప్రచారం జరిగింది. 2010లో నేషనల్ టీవీలో ప్రసారమైన ‘రాహుల్ దుల్హనియా లే జాయేగా’ రియాలిటీ షోలో డింపీ గంగూలీని రాహుల్ రెండో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2014, ఫిబ్రవరి 25న వీరు విడాకులు తీసుకున్నారు. తనను దారుణంగా కొట్టేవాడని డింపీ అప్పట్లో ఆరోపించారు. రాహుల్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకున్నారు. భర్త, కూతురుతో కలిసి ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. రాహుల్ మూడో వివాహంపై డింపీ స్పందిస్తూ.. ‘ఇలినా గృహ హింస బారిన పడకూదని కోరుకుంటున్నా. రాహుల్ చాలా మారిపోయి ఉంటాడని అనుకుంటున్నా. మీరిద్దరూ ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు’ పేర్కొన్నారు. -
రెండో పెళ్లి చేసుకుంటున్న రాహుల్ మాజీ భార్య
ముంబై: రాహుల్ మహాజన్ మాజీ భార్య, బిగ్ బాగ్ 8 పోటీదారు డింపీ గంగూలీ(30) పునర్వివాహం చేసుకోసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. దుబాయ్ వ్యాపారవేత్త రోహిత్ రాయ్ తో నిశ్చితార్థం జరిగిందని తెలిపింది. ఎంగేజ్ మెంట్ ఉంగరం ఫొటోను కూడా ట్విటర్ లో పోస్ట్ చేసింది. కోల్ కతాలో నవంబర్ 27న వీరి వివాహం జరగనుంది. ఇరువురి తరపు కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నారు. రాహుల్ మహాజన్ నుంచి విడాకులు తీసుకున్న డింపీ గంగూలీ రెండేళ్లుగా రోహిత్ రాయ్ తో ప్రేమాయణం సాగిస్తోంది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కుమారుడైన రాహుల్ మహాజన్ ను 2010లో ఆమె పెళ్లాడింది. 2012లో వీరు విడిపోయారు. 2009 నుంచి వీరిద్దరూ కలిసి పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. కాగా, రెండో వివాహం చేసుకోబోతున్న డింపీ గంగూలీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన మాజీ భార్యకు రాహుల్ మహాజన్ కూడా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.