breaking news
Dalmia Cement
-
జేపీ అసోసియేట్స్ టేకోవర్...అదానీకి లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: జేపీ అసోసియేట్స్‌ను (జేఏఎల్) టేకోవర్ చేసేందుకు అదానీ గ్రూప్‌నకు మార్గం సుగమం అయింది. కంపెనీ కొనుగోలుకు వచ్చిన ప్రతిపాదనల్లో అదానీ గ్రూప్ సమర్పించిన రూ. 14,535 కోట్ల పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీలోని (సీవోసీ) మెజారిటీ రుణదాతలు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఓటింగ్‌లో అదానీ గ్రూప్‌కి అత్యధికంగా 89 శాతం ఓట్లు రాగా, దాల్మియా సిమెంట్ (భారత్), వేదాంత గ్రూప్ ఆ తర్వాత స్థానాల్లో నిల్చినట్లు వివరించాయి. అదానీ గ్రూప్ ముందుగా రూ. 6,005 కోట్లు, తర్వాత రెండేళ్ల వ్యవధిలో మరో రూ. 7,600 కోట్లు చెల్లించేలా ప్రతిపాదన చేసింది. మిగతా వాటితో పోలిస్తే అదానీ గ్రూప్ ముందుగా చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండటం, పైగా తక్కువ వ్యవధిలోనే పూర్తిగా చెల్లించేలా ఉండటంతో సీవోసీ దాని వైపు మొగ్గు చూపింది. వేదాంత గ్రూప్ మొత్తం రూ. 16,726 కోట్లు (ముందుగా రూ. 3,800 కోట్లు, అయిదేళ్ల వ్యవధిలో రూ. 12,400 కోట్లు) ఆఫర్ చేసింది. సీవోసీలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి (ఎన్ఏఆర్సీఎల్) అత్యధికంగా 86 శాతం ఓటింగ్ షేరు ఉంది. మూడు శాతంలోపే వాటా ఉన్న ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర రుణదాతలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. రియల్ ఎస్టేట్, సిమెంట్ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో కార్యకలాపాలున్న జేఏఎల్ రూ. 57,185 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలం కావడంతో కంపెనీపై గతేడాది దివాలా ప్రక్రియ కింద చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కంపెనీని వేలానికి ఉంచగా, ముందు 25 కంపెనీలు ఆసక్తి చూపాయి. తర్వాత అయిదు కంపెనీల నుంచి బిడ్లు, ధరావతు వచ్చినట్లు జేఏఎల్ ప్రకటించింది. విల్మర్‌కు అదానీ షేర్ల విక్రయం ఏడబ్ల్యూఎల్ అగ్రిలో 13 శాతం వాటా అమ్మకం న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్(గతంలో అదానీ విల్మర్)లో 13 శాతం వాటాను విల్మర్ ఇంటర్నేషనల్‌కు విక్రయించింది. ఆఫ్‌మార్కెట్ లావాదేవీల ద్వారా అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ(ఏసీఎల్) 13 శాతం వాటాకు సమానమైన 16.9 కోట్ల షేర్లను విల్మర్ అనుబంధ సంస్థ లెన్స్ పీటీఈకి అమ్మివేసింది. ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన వాటా విక్రయ ప్రణాళికలో భాగంగా విల్మర్‌కు 13 శాతం అదనపు వాటాను విక్రయించింది. షేరుకి రూ. 275 ధరలో ఏడబ్ల్యూఎల్‌లో 11–20 శాతం మధ్య వాటా కొనుగోలు చేసేందుకు విల్మర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాగా.. గత వారం ఈ అంశాన్ని లెన్స్ పీటీఈ సైతం ప్రకటించింది. వెరసి అనుబంధ సంస్థ ఏసీఎల్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ వాటా విక్రయానికి తెరతీసింది. వాటా కనీస విలువ రూ. 4,646 కోట్లుగా అంచనా. తాజా విక్రయం తదుపరి ఏడబ్ల్యూఎల్ అగ్రిలో ఏసీఎల్ వాటా 20 శాతం నుంచి 7 శాతానికి దిగివచ్చింది. మరోపక్క ఏడబ్ల్యూఎల్ అగ్రిలో లెన్స్ వాటా 56.94 శాతానికి బలపడింది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌లో 20 శాతం వాటా విక్రయించనున్నట్లు 2025 జూలైలో అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విల్మర్ ఇంటర్నేషనల్(సింగపూర్)కు రూ. 7,150 కోట్ల విలువతో అమ్మివేయనున్నట్లు తెలియజేసింది. బీఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 0.2% నీరసించి రూ. 2,431 వద్ద ముగిసింది. -
గుడ్‌న్యూస్: జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా కొలువులు
కరోనా మహమ్మరి కారణంగా వేగం తగ్గిన కొలువుల నియామకాల ప్రక్రియ తిరిగి పుంజుకొనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 21 రంగాలలో 700కు పైగా చిన్న, మధ్యస్థ, పెద్ద కంపెనీల నియామకాల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తుంది. ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన తాజా టీమ్ లీజ్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ నివేదిక ప్రకారం, కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్ భయాలు ఉన్నప్పటికీ 38% కంపెనీలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే 34% అధికంగా నియామకాల ప్రక్రియను చేపట్టాయి. టీమ్ లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితూపర్నా చక్రవర్తి మాట్లాడుతూ... కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో అన్ని రంగాలలో కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షలను సడలించడం, వినియోగదారుల డిమాండ్ పెరగడం, ఆర్థిక కార్యకలాపాల్లో పెరుగుదల వంటి అనేక కారణాల వల్ల బ్లూ-కాలర్, వైట్ కాలర్ నిపుణుల నియామకాన్ని సంస్థలు చేబడుతున్నాయని అన్నారు. జాబ్ మార్కెట్ గణనీయంగా కొలుకొనున్నట్లు దాల్మియా సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర సింఘి చెప్పారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కొన్ని పరిశ్రమలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో అనేక రంగాలలో కొత్త నియామకాల వేగం పెరగింది అన్నారు. వ్యాక్సినేషన్ స్థాయిలు పెరగడం కూడా ఈ ధోరణికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. హిరానందనీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ హిరానందనీ మాట్లాడుతూ.. అన్ని సూచికలు అధిక స్థాయి వృద్ధికి సిద్ధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను సూచిస్తున్నాయి అని అన్నారు. -
దాల్మియా పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే, తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని దాల్మియా సిమెంట్ లిమిటెడ్ ప్రతినిధి పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిదంబరం చేసిన వాదనలతో తాము ఏకీభవించడం లేదని కోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ తీర్పు వెలువరించారు. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ పునీత్ దాల్మియా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇటీవల విచారించి తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ పుర్కర్ సోమవారం తీర్పు వెలువరించారు.


