breaking news
credila loans
-
ఐపీవో స్ట్రీట్ ...లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.. రూ. 5,000 కోట్లకు రెడీ గత డిసెంబర్లో గోప్యతా విధాన పబ్లిక్ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్ సర్వీసెస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్‌లో బిజినెస్ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ 2009లో ఇన్వెస్ట్ చేసింది. 2010 నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్ గ్రూప్‌లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రూ. 1,500 కోట్లకు సై పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్ సోలార్ స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీపై వెచి్చంచనుంది. తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్ సోలార్ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, మైక్రోటెక్ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్, వీగార్డ్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది (కేలండర్ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ హోమ్ అండ్ ఫరీ్నíÙంగ్స్ కంపెనీ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్తోపాటు, లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. సుదీప్ ఫార్మా ఐపీవో బాట ఔషధ రంగ కంపెనీ సుదీప్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్‌లోని నందెసారి యూనిట్లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 1989లో ఏర్పాటైన వడోదర సంస్థ సుదీప్ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్ అంట్ న్యూట్రిషన్లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్‌టాస్ ఫార్మా, మ్యాన్‌కైండ్ ఫార్మా, మెర్క్ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్‌తోపాటు ఫ్రెంచ్ దిగ్గజం గ్రూప్ దానోన్ చేరింది. గత క్యాలండర్ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 2,500 కోట్లపై చూపు దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్‌కార్ట్, మిరాయ్ అసెట్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్ కంపెనీ షాడోఫ్యాక్స్ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్‌వర్క్‌పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది. -
ఎడ్యుకేషన్ లోన్ విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలా విక్రయం
న్యూఢిల్లీ: విద్యా రుణాల విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలాను క్రిస్‌క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాల కన్సార్షియంకు విక్రయించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. కంపెనీలో 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు విక్రయించినట్లు వెల్లడించింది. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనం నేపథ్యంలో విద్యా రుణాల సంస్థను హెచ్డీఎఫ్సీ విక్రయించింది. బీపీఈఏ ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్ ఇన్వెస్టర్ల కన్సార్షియంకు హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్డీఎఫ్సీ ద్వయం తాజాగా తెలియజేశాయి. దేశ, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్ధులకు రుణాలందించే హెచ్డీఎఫ్సీ క్రెడిలాలో 9.99% వాటాను కొనసాగించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. -
సంప్రదాయ కోర్సులకూ రుణాలు!
విదేశీ వర్సిటీల్లో చదువులకూ మంజూరు - అవాన్స్, క్రెడీలా పేర్లతో విద్యారుణాలు - కొత్త రూట్లో డీహెచ్ఎఫ్ఎల్, హెచ్డీఎఫ్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు రుణాలు అంత తేలికేమీ కాదు. అందులోనూ విద్యా రుణాలైతే మరీను. పేరున్న వర్సిటీల్లో పాపులర్ కోర్సులైన ఇంజనీరింగో, మెడిసిన్‌నో లేక మేనేజ్మెంట్ కోర్సో చదివే విద్యార్థులకు మాత్రమే రుణాలు లభిస్తుంటాయి. ఎందుకంటే బ్యాంకులు కూడా ఆ కోర్సు పూర్తి చేశాక సదరు అభ్యర్థికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాన్ని ఆధారం చేసుకునే రుణాలిచ్చేది. అందుకే సంప్రదాయ కోర్సులైన సంగీతం, ఫొటోగ్రఫీ, నృత్యం వంటి కోర్సులు చదివే వారికి రుణాలు కావాలంటే కాస్తంత ఇబ్బంది తప్పదు. అయితే మన దేశంలో ఇలాంటి సంప్రదాయ కోర్సుల ఫీజులు తక్కువే. కాబట్టి మరీ ఇబ్బంది ఉండదు. కానీ విదేశీ వర్సిటీల్లో ఇలాంటి కోర్సులు చదవాలంటే మాత్రం కష్టం. అయితే ఇలాంటివన్నీ అర్థం చేసుకున్న బ్యాంకులు కొన్ని ఈ కోర్సులకూ రుణాలిచ్చేలా కొత్త పథకాలు ఆరంభిస్తున్నాయి. అలాంటి వారికీ రుణాలు లభిస్తున్నాయి. మార్కెట్ అంచనాల ప్రకారం మన దేశంలో ఏటా పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు రూ.80 వేల కోట్ల వరకూ వెచ్చిస్తున్నారు. ఈ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధితో అంతకంతకూ దూసుకెళుతోంది. దీన్లో విద్యారుణం తీసుకొని ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారి వాటా దాదాపు 15 శాతంగా ఉంది. నిజానికిపుడు పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకోవటమనేది తగ్గింది. ఉన్నత విద్య రుణం కోసం నేరుగా విద్యార్థులే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఈ డిమాండ్‌ను చూసిన ప్రయివేటు ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. అవాన్స్, క్రెడీలా రుణాలు.. అగ్రశ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలైన దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్), హెచ్‌డీఎఫ్‌సీలు మేనేజ్మెంట్ కోర్సులతో పాటు సంప్రదాయ కోర్సులైన ఫొటోగ్రఫీ, సంగీతం, నృత్యం, డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్ వంటి కోర్సులకూ విద్యారుణాలను మంజూరు చేస్తున్నాయి. విద్యా రుణాల కోసం డీహెచ్ఎఫ్ఎల్ ‘అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. హెచ్డీఎఫ్సీ కూడా ఈ రుణాల కోసం ‘క్రె డీలా’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఆయా రుణాలను కేవలం కోర్సు ఫీజులకే పరిమితం చేయకుండా రుణానికి అర్హుడైన విద్యార్థి చదువు పూర్తయ్యేంత వరకు అవసరమయ్యే ఖర్చు, రవాణా చార్జీలను కూడా రుణంలో భాగంగానే మంజూరు చేస్తున్నాయి. వర్సిటీ, దేశాన్ని బట్టి వడ్డీ రేట్లు.. సంప్రదాయ కోర్సుల విద్యా రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు... విద్యార్థులు ఎంచుకునే వర్సిటీ, దేశం ఆధారంగా మారుతూ ఉంటాయని హైదరాబాద్‌లోని ‘అవాన్స్’ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధికారి ఒకరు ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధితో చెప్పారు. ‘‘దేశీయంగా గుర్తింపు పొందిన వర్సిటీల్లోని విద్యాభ్యాసానికైతే 12.5 శాతం నుంచి 12.75 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాం. అదే విదేశాల్లోని వర్సిటీల్లో అయితే వడ్డీ రేటు 12.75 శాతం నుంచి ప్రారంభమై 14 శాతం వరకు ఉంటుంది. ఐఐఐటీ, ఐఎస్బీ, ఐఐటీ మద్రాస్ వంటి పేరొందిన వర్సిటీలు గుర్తించిన విద్యా సంస్థల్లో విద్యకైతే ఎలాంటి జామీను లేకుండా రుణాలను మంజూరు చేస్తున్నాం. అదే మన దేశంలోని ఇతర విద్యా సంస్థల్లో అయితే రూ.5 లక్షల విద్యారుణానికి తల్లిదండ్రుల వేతనాన్ని హామీగా పెట్టాల్సి ఉంటుంది. అదే విదేశాల్లోని వర్శిటీల్లో అయితే స్థిరాస్తులను జామీనుగా ఇవ్వాల్సి ఉంటుంది’’ అని వివరించారు. అలాగే జీమ్యాట్, టోఫెల్ పరీక్షల్లో స్కోరు ఆధారంగా రుణాలను మంజూరు చేస్తామని తెలియజేశారు.