breaking news
Civil aviation companies
-
ఏవియేషన్ డే: ఇండిగో తరహా సంక్షోభాలు మున్ముందు ఎదురైతే..
భారత్‌లోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా పెళ్లిళ్లూ రద్దవుతున్నాయి. దీంతో, ఇండిగో యాజమాన్యం తీరుపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు..అయితే, ఇండిగో తన దగ్గర ఉన్న పరిమిత సిబ్బంది, పైలెట్లతోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ రాత్రి పూట నడిపే సర్వీసులు సైతం అధికంగా ఉన్నాయి. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థ చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విమానయాన సంస్థలు సైతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.పౌర విమానయాన రంగంలో కీలక సవాళ్లు..1. అధిక ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ఖర్చులుభారతదేశంలో ATF ధరలు GST పరిధిలోకి రాకపోవడంతో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విమానయాన నిర్వహణ ఖర్చులలో ఇంధన వాటా 30–40% ఉంటుంది. దీనివల్ల టిక్కెట్లు ఎక్కువగా ఉన్నాయి. మార్జిన్లు తక్కువగా ఉంటాయి. ఇంధన ఖర్చులను తగ్గించడానికి పరిశ్రమ చాలా కాలంగా ATFని GST కింద చేర్చాలని డిమాండ్ చేస్తోంది.2. మౌలిక సదుపాయాల అడ్డంకులుదేశ ప్రయాణీకుల రద్దీ ప్రతీ ఏటా పెరుగుతోంది. 120 మిలియన్ల నుండి 236 మిలియన్లకు పెరిగింది. విమానాశ్రయాలు కూడా 74 నుండి దాదాపు 160కి రెట్టింపు అయ్యాయి. ఎయిర్‌పోర్టుల విస్తరణ ఉన్నప్పటికీ ప్రధాన విమానాశ్రయాలలో (ఢిల్లీ, ముంబై, బెంగళూరు) రద్దీ మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ (UDAN పథకం) విస్తరిస్తున్నప్పటికీ చిన్న విమానాశ్రయాలు నిధులు, కార్యాచరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చిన్న విమానయాన సంస్థలు మనుగడ కోసం కష్టపడుతున్నాయి3. స్థిరత్వం, కార్బన్ నియమాలు2027 నుండి ICAO యొక్క CORSIA కార్బన్ ఆఫ్సెట్ పథకాన్ని భారతదేశం పాటించాలి. ప్రభుత్వం స్థిరమైన విమాన ఇంధనం (SAF) మిశ్రమ లక్ష్యాలను నిర్దేశించింది. కానీ SAF ఖరీదైనది, పరిమితమైనంది. లాభదాయకతను సమతుల్యం చేస్తూ ఉద్గారాలను తగ్గించడానికి విమానయాన సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.4. సైబర్ భద్రతా ప్రమాదాలుఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన GPS స్పూఫింగ్ సంఘటనలు నావిగేషన్ వ్యవస్థలలోని భద్రతలేమిని హైలైట్ చేశాయి. డిజిటల్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ బెదిరింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్ GNSS సలహాదారులను, మెరుగైన పర్యవేక్షణను అమలు చేస్తోంది.5. పైలట్ల కొరత.. దేశంలో ముఖ్యంగా పైలట్ల కొరత అధికంగా ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలెట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.పరిష్కారాలు..దేశంలో కొత్త ఫ్లయింగ్ అకాడమీలు ఏర్పాటు చేయడంపైలట్ శిక్షణలో PPP మోడల్ ప్రవేశపెట్టడంFDTL (Flight Duty Time Limit) నియమాలను శాస్త్రీయ డేటా ఆధారంగా తయారు చేయడం. పైలట్లకు వెల్నెస్ ప్రోగ్రామ్‌లు, ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్లుపైలట్ శిక్షణ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలిఎయిర్లైన్స్ సిబ్బంది ప్లానింగ్‌లో AI ఆధారిత షెడ్యూలింగ్ ఉపయోగించాలిఎయిర్లైన్స్కు స్లాట్ మేనేజ్మెంట్ కఠినంగా అమలు చేయడంవాతావరణ అంచనాల కోసం అధునాతన మెటీరియాలజీ సిస్టమ్‌లు ఏర్పాటు చేయడంప్రయాణికులకు రియల్-టైమ్ సమాచారం అందించే యాప్‌లు తీసుకురావాలి. విమాన సర్వీసుల రద్దులపై పెనాల్టీ మెకానిజం తీసుకురావడం. ఎయిర్‌లైన్స్ బ్యాకప్ క్రూ & బ్యాకప్ విమానాల వ్యవస్థను కలిగి ఉండాలి. చిన్న ఎయిర్‌లైన్స్‌కు పన్ను రాయితీలు ఇవ్వాలి.మల్టీ-రన్‌వే ఎయిర్‌పోర్ట్‌లు అభివృద్ధి చేయాలి. మెట్రో నగరాల్లో సెకండరీ ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేయాలి. కార్గో టెర్మినల్‌లను ఆధునీకరించాలి. ఎయిర్‌పోర్ట్‌లలో సోలార్ ఎనర్జీ వినియోగం.ఎఫ్డీటీఎల్ నిబంధనలు..డీజీసీఏ 2024 జనవరిలో కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జులై నుంచి అమలవుతున్నాయి. రెండో దశ నిబంధనలను నవంబరు 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలెట్లు, కేబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతి నివ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవే. పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు.రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి ఆరు నుంచి రెండుకు కుదింపు.‘రాత్రి గంట’లకు కొత్త నిర్వచనం ఇచ్చారు. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ సమయాన్ని రాత్రి గంటలుగా పేర్కొన్నారు. పైలెట్లకు వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలి. విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను మూడు నెలలకోసారి సమర్పించాలి.ఇండిగో ఏం చేసింది..మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనదైన పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండోదశలో, రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండుకు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోల్చితే, తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రి పూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులే నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలెట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబరులోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈనెలలో రోజూ వేల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమగ్ర సంస్కరణలు అవసరం..భారత్ ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌ను కలిగి ఉంది. కోవిడ్ కారణంగా దేశీయంగా మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ కొద్దినెలలుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ రవాణా కోవిడ్‌కి ముందు స్థాయిలను చేరుకుంటోంది. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు. ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. సవాళ్లు ఉన్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తే భారత విమానయాన రంగం స్థిరమైన, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి వ్యవస్థగా మారుతుంది. భారత విమానయాన రంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. సవాళ్లను అవకాశాలుగా మార్చే విధాన దృక్పథం, పోటీని ప్రోత్సహించే మార్కెట్ నిర్మాణం, ప్రయాణికుల కేంద్రిత సేవలు ఈ రంగాన్ని మరింత బలపరుస్తాయి. సమర్థవంతమైన నియంత్రణ, పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు. భవిష్యత్ విమానయాన రంగం పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్థ్యం, హరిత సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా భారత్ ముందడుగు వేస్తే, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణికులకు భరోసా ఉంటుంది. -
పదేళ్లలో గణనీయ వృద్ధి
దేశీయ వైమానిక రంగంలో గత పదేళ్లలో ఆశించినమేర వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో మోదీ పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ)తో సహా 29 దేశాలు, ఎనిమిది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఒకప్పుడు విమాన ప్రయాణం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మధ్యతరగతి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విమాన ప్రయాణాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి మారిపోయింది. టైర్ 2, 3 నగరాల్లోనూ విమానయానానికి అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దానివల్ల ఆయా నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ రంగంలో పదేళ్ల కిందటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని తెలిపారు.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, విమానయాన రంగంలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం, పౌర విమానయానంలో స్థిరమైన వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరుతో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని ప్రధాని నరేంద్రమోదీ ఆమోదించారు. తాజాగా జరిగిన సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘విమానయాన రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులతో చర్చించి ఢిల్లీ డిక్లరేషన్‌ను రూపొందించాం. ఐసీఏఓ గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్, గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ ప్లాన్, ఏవియేషన్ భద్రత..తదితర అంశాలను అందులో పొందుపరిచాం’ అని మంత్రి తెలిపారు. -
విను విధుల్లో.. ఇక సుదూర డ్రోన్లు
డ్రోన్లు.. నేల పైనుంచి ఆపరేట్ చేసే వారి కంటికి కనిపించే దూరం వరకే ఎగురుతాయి. ఇకపై ఇది పాత మాట కానుంది. రానున్న రోజుల్లో కనుచూపు మేర దాటి (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్‌సైట్) డ్రోన్లు గగన వీధుల్ని ఏలనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలపగా.. రెండు కంపెనీలు ఇలాంటి డ్రోన్ల తయారీకి ముందుకొచ్చాయి. త్వరలోనే వీటి పని తీరును పౌర విమానయాన సంస్థ పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. సాక్షి, అమరావతి: సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన) చట్టం ప్రకారం మన దేశంలో కనుచూపు మేర వరకు ఎగిరే డ్రోన్ల తయారీకి మాత్రమే అనుమతి ఉంది. అంటే డ్రోన్ ఆపరేటర్ తన కనుచూపు మేర వరకు మాత్రమే డ్రోన్లను ఆకాశంలో నడుపుతారు. కాగా నిఘా, వస్తు రవాణా అవసరాలకు ఆకాశంలో ఎంత దూరమైనా (కనుచూపు మేర దాటి–బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్) ప్రయాణించే డ్రోన్ల తయారీ దిశగా భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్‌సైట్ (బీవీఎల్ఓఎస్) డ్రోన్లకు కూడా అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనను కొన్నేళ్లుగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటి తయారీకి గత మే నెలలో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో బీవీఎల్ఓఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఏడాది మే నెలలో నోటిఫై చేసింది. దాంతో పలు సంస్థలు బీవీఎల్ఓఎస్ (కనుచూపు మేర దాటి ప్రయణించే) డ్రోన్ల తయారీ దిశగా సన్నాహాలు చేపట్టాయి. ఈ ఏడాది జూన్‌లో పలు కంపెనీలు ఈ తరహా డ్రోన్ల తయారీకి దరఖాస్తు చేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు డీజీసీఏ ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. ప్రయోగాత్మక పరీక్షకు ఎంపికైన రెండు సంస్థలు గూగుల్ సహకారంతో నిర్వహిస్తున్న హైపర్ లోకల్ డెలివరీ స్టార్టప్ కంపెనీ డున్జో , బెంగళూరుకు చెందిన థ్రోట్ల్ కంపెనీ బీవీఎల్ఓఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా రూపొందించడం తాజా విశేషం. తమ డ్రోన్లను పరీక్షించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ మంజూరు చేయాల్సిందిగా ఆ రెండు కంపెనీలు డీజీసీఏకు దరఖాస్తు చేశాయి. ఆ రెండు కంపెనీలు రూపొందించిన డ్రోన్లను పరీక్షల నిమిత్తం డీజీసీఏ ఎంపిక చేసింది. బీవీఏల్‌ఓఎస్ అసెస్మెంట్, మానిటరింగ్ కమిటీ (బీఈఏమ్) వీటిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో పరీక్షించి డీసీజీఏకు నివేదిక సమర్పించనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భద్రత, సామర్థ్యం, ఇతర ప్రమాణాలను ప్రాథమికంగా నిర్ధారించేందుకు ఆ రెండు కంపెనీల డ్రోన్లను కనీసం 100 గంటల చొప్పున పరీక్షిస్తారు. నిఘా, వస్తు రవాణా అవసరాలకు.. వ్యూహాత్మక, నిఘా, వస్తు రవాణా అవసరాల కోసం బీవీఎల్ఓఎస్ డ్రోన్లను ఉపయోగించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రధానంగా వ్యూహాత్మక, నిఘా అవసరాల నిమిత్తం సైన్యం, పోలీసులకు వీటిని అందజేయాలన్నది ప్రధాన ఆలోచన. ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా తదితర అవసరాల కోసం దేశంలోని పోలీసులకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వస్తు రవాణాకు కూడా వీటిని విరివిగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉంది. చిన్న చిన్న ప్యాకేజీలను తక్కువ వ్యయంతో.. తక్కువ సమయంలో రవాణా చేయొచ్చన్నది అధికారుల ఆలోచన. ప్రధానంగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాల్లో వస్తు రవాణాకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. బీవీఎల్వోఎస్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించిన అనంతరం బీవీఎల్వోఎస్ అసెస్మెంట్, మానిటరింగ్ కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే డీజీసీఏ దీనిపై కేంద్రానికి సిఫార్సులను సమర్పిస్తుంది. అనంతరం కేంద్ర హోం, రక్షణ, పౌర విమాన యాన శాఖలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
ఉన్నచోటే వేడుకలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చాయంటే ఇళ్లలో, స్థానికంగా ఉత్సవాలు జరుపుకొనే వారితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్యా ఎక్కువే. కానీ ఈ ఏడాది ఆ హడావుడి పెద్దగా కనిపించటం లేదు. రూపాయి క్షీణతతో ఎయిర్ టికెట్ల ధరలు ఈ సారి బాగా పెరిగాయి. దీంతో వేరే చోటికి వెళ్లి సరదాగా గడపాలనుకునే వారి సంఖ్య బాగా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు టికెట్లపై డిస్కౌంట్ రేట్లను ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు ఎంపిక చేసిన ప్రదేశాలకు టికెట్లపై 15 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుండగా, గో-ఎయిర్ అయితే ఏకంగా 50 శాతం కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇన్ని ప్రకటించినా డిసెంబర్లో ఉండే హడావుడి ఈ ఏడాది కనిపించడం లేదు. 60 నుంచి 90 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకునే వారి సంఖ్యలో 12 శాతం క్షీణత నమోదయిందని మేక్ మై ట్రిప్ ఇండియా సీఈవో రాజేష్ మాగో తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఎయిర్ టికెట్ల ధరలు బాగా పెరగడమే ఈ ఏడాది టికెట్లకు డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిమాండ్ అధికంగా ఉండే ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-గోవా వంటి రూట్లలో గతేడాదితో పోలిస్తే ఎయిర్ టెకెట్ల ధరలు 12 నుంచి 27% వరకు పెరిగి నట్లు మేక్ మై ట్రిప్ తన సర్వేలో పేర్కొంది. దీంతో ఈ పండుగల సీజన్లో ప్రయాణికులను ఆకర్షించడానికి ఎయిర్‌లైన్స్ సంస్థలు డిస్కౌంట్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో సరదాగా గడపడానికి హైదరాబాదీయులు గోవా, మున్నార్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్లు ట్రిప్ అడ్వైజర్ సర్వే పేర్కొంది. అదే అంతర్జాతీయంగా అయితే బ్యాంకాక్, దుబాయ్ వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నట్లు ట్రిప్ అడ్వైజర్ కంట్రీ మేనేజర్ నిఖిల్ గంజు తెలిపారు. వారసత్వ ప్రదేశాల విషయానికి వస్తే జైపూర్, ఉదయ్‌పూర్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారన్నారు.


