అంబేద్కర్ విగ్రహానికి అవమానం
చెప్పుల మాల వేసిన దుండగులు
రాయపూర్‌కాండ్లీలో ఘటన
నిరసనగా బంద్ పాటించి ధర్నాకు దిగిన నాయకులు
దోషులను శిక్షించాలని డిమాండ్
లోకేశ్వరం : మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల మాల వేశారు. శనివారం దీనిని గమనించిన గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పుల మాలను దళిత నాయకుల సమక్షంలో తొలగించారు. అవమానపర్చిన విగ్రహానికి అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు గౌరోల్ల దిగంబర్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. విషయం తెలుసుకున్న లోకేశ్వరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తర్వాత భైంసా డీఎస్పీ అందె రాములు, ముథోల్ సీఐ రఘుపతి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల మాల వేసిన దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు భీంరావు డోగ్రె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నిరసనగా లోకేశ్వరం, ధర్మోరా, రాయపూర్‌కాండ్లీ తదితర గ్రామాల్లో కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించారు. మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బర్ల రాజ్‌కుమార్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు దిగంబర్, రాయపూర్‌కాండ్లీ అధ్యక్షుడు ప్రేమానందం, నాయకులు భోజన్న, పురుషోత్తం, శ్రీరాములు, మాదరి ఆంజనేయులు, ముత్తన్న, శంకర్, బాబన్న, దండే రమేశ్, గంగాధర్, ఆనందం, సుంకరి భోజన్న, రత్నయ్య, భీమన్న, దేవన్న, గంగన్న, మోషన్న, దేవిదాస్, సాగర్, సదానందం పాల్గొన్నారు.
వెంటనే పట్టుకుంటాం
రాయపూర్‌కాండ్లీలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల మాల వేసిన దోషులను వెంటనే పట్టుకుంటామని భైంసా డీఎస్పీ అందె రాములు అన్నారు. అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ లోకేశ్వర్‌రావు, ముథోల్ సీఐ రఘుపతి, లోకేశ్వరం ఏఎస్సై దయానంద్, వీఆర్వో లక్ష్మణ్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, నాలం గంగాధర్, నందకేశ్వర్రావు, మెండే శ్రీధర్, రాజేశ్వర్, వీడీసీ చెర్మన్ దేవేందర్ ఉన్నారు.