-
వీల్‌చైర్‌లోని కొడుకు చదువు కోసం ఓ అమ్మ..
ఆరేంజ్ (కాలిఫోర్నియా): పక్షవాతం వచ్చి వీల్‌చైర్‌కు పరిమితమైన కన్నకొడుకు చదువు కోసం ఓ మాతృమూర్తి చూపిన అకుంఠిత దీక్షకు ఘనమైన సత్కారం లభించింది. కొడుకుతోపాటు ప్రతిరోజూ తరగతులకు హాజరై.. ఉపాధ్యాయులు చెప్పిన నోట్స్ తీసుకొని.. అతను ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తిచేయడంలో అడుగడుగునా అండగా నిలిచింది ఆమె.. ఆ కొడుక్కే కాదు కన్నతల్లి దీక్షకు సైతం సత్కారం లభించింది. కొడుకుతోపాటు ఆ మాతృమూర్తికి కూడా ఓ అమెరికన్ యూనివర్సిటీ ఎంబీఏ పట్టాను అందజేసింది. ప్రాథమిక పాఠశాల రిటైర్డ్ టీచర్ అయిన జ్యూడీ ఓ కానర్ వీల్ఛైర్లోని తన కొడుకు మార్టిను స్నాతకోత్సవ వేదికపైకి తీసుకురాగా.. మార్టికే కాదు, జ్యూడీకి కూడా ఎంబీఏ పట్టాను అందజేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది యూనివర్సిటీ. కాలిఫోర్నియా లాస్ఏంజిల్స్లోని చాప్మన్ యూనివర్సటీ ఈ అరుదైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అనూహ్య ప్రకటనతో ఆనందంతో భావోద్వేగానికి లోనైన జ్యూడీ ‘స్కూల్లో ఉండటం తనకు ఇష్టమని, తరగతి గదిలో గడిపిన ప్రతి నిమిషాన్ని తాను ఆస్వాదించినట్టు పేర్కొంది. మార్టి ఓ కానర్ కొలరాడో యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. 2012లో ఓ ప్యాకేజింగ్ కంపెనీలో పనిచేస్తుండగా మెట్లమీద నుంచి జారిపడి పక్షవాతానికి గురయ్యాడు. అప్పటినుంచి వీల్‌చైర్‌లో ఉన్న కొడుకు చదువు కోసం అన్నీ తానై కష్టపడింది జ్యూడీ. ఫ్లోరిడాలో నివాసముండే జ్యూడీ కొడుకు చదువు కోసం దక్షిణ కాలిఫోర్నియాకు మకాం మార్చింది. వీల్‌చైర్‌లో ఉండే జ్యూడీ ఐప్యాడ్, లాప్‌ట్యాప్, వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ తదితర పరికరాలను ఉపయోగించగలడు. కానీ సొంతంగా నోట్స్ రాసుకోలేడు. ఆ పని చేసేందుకు తల్లి జ్యూడీ కూడా తరగతులకు హాజరయ్యేది. -
భయం- 2016
అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న టైపు. దాని సైనిక శక్తి చూసి అంతా భయపడాల్సిందే.. మరి అమెరికన్లు ఏమిటంటే భయపడతారు? అందరూ అనుకున్నట్లు టైజమేనా.. కాదు.. అమెరికన్లు ఎక్కువగా భయపడే అంశం ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి అట. తర్వాతి స్థానంలో ఉగ్రవాద దాడులు ఉన్నాయి. అమెరికన్ల భయాలు అనే అంశంపై చాప్మాన్ యూనివర్సిటీ 2016లో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఇక నమ్మకాల విషయానికొస్తే.. అగ్ర రాజ్యమైనా దయ్యాలు, ఆత్మలు వంటి వాటిని నమ్మేవారు ఇక్కడ ఎక్కువే. 46.6 శాతం మంది ఆత్మలు వంటివాటిని నమ్ముతారట. అమెరికన్ల టాప్-10 భయాలపై ఓ లుక్కేస్తే.. -
ఎత్తు తక్కువని దిగులేలనోయి!
ఎత్తయిన మగాడికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చి చూస్తే పొట్టి వారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ, వారి కాపురాలు బాగున్నట్లూ ఓ తాజా సర్వేను బట్టి తెలుస్తోంది. మగాడిని మొగుడిగా చేసుకోవడానికి ఆడవారు ఎక్కువగా చూస్తున్న ప్రధాన లక్షణాల్లో ఎత్తు ఒకటి. ఎత్తుగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇదమిత్థంగా ఆడవారు చెప్పలేకపోయినా కూడా దాన్ని నమ్ముతూ వచ్చారు. కానీ, వారి నమ్మకాన్ని ఇప్పుడు పరిశోధకులు పటాపంచలు చేశారు. పొట్టివాడు గట్టివాడు మాత్రమే కాదు, మంచివాడని కూడా తేల్చారు! పొడుగాటి మొగుడి వల్ల స్త్రీలు ఆశిస్తున్న ప్రయోజనాలు అనేకం. పొడుగాటి భర్త వల్ల సామాజిక గుర్తింపు మాత్రమే కాక, వారి వల్ల భద్రత పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతూ వచ్చారు. కానీ, నిజానికి అలాంటి భద్రతాపరమైన ఉపయోగాలు వందమందిలో ఆరేడు మంది స్త్రీలకు కూడా కలగడం లేదట. అంటే, పొడుగాటి భర్త వల్ల భార్యలు ఆశిస్తున్న ప్రధాన ప్రయోజనం నిజంగా నెరవేరడం లేదని తేలిపోయింది. చాప్మాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఫ్రెడరిక్, న్యూయార్క్ విశ్వవిద్యాలయం సోషియాలజిస్ట్ డాల్టన్ కోన్లీ, పరిశోధక విద్యార్థి వెయిజ్ మెన్ వేర్వేరుగా జరిపిన పరిశోధనలు, అధ్యయనాల ఫలితాలు మరో సంగతి కూడా తెలిపాయి. ఈ ఫలితాల క్రోడీకరణ అనంతరం ఎత్తయిన మగాడికి జరుగుతున్న ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చిచూస్తే పొట్టివారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ వారి కాపురాలు బాగున్నట్లూ తెలుస్తోంది.ఎత్తయిన వారికి త్వరగా పెళ్లి సంబంధాలు కుదరడం, బాగా చదువుకున్నవారి సంబంధాలు రావడం, మెరుగైన సంబంధాలు రావడం జరుగుతుంటుంది. అయితే వీరికి రిస్కులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కాస్త చైతన్యం ఉన్నవారు, దూకుడుగా ఉన్నవారు వీరికి భార్యలుగా వస్తున్నారట. దీనివల్ల ఈ పొడుగాటి మగాళ్ళలో విడాకుల రేటు కూడా ఎక్కువగా ఉంటోందట. ఎక్కువగా చదువుకున్న వారు సాధారణంగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ భర్తతో హోదా పోలికలు పెట్టుకోవడం కూడా ఈ విడాకుల రేటు పెరగడానికి కారణమట. అంతమాత్రాన పొడుగ్గా ఉన్న వారి కాపురాలన్నీ కూలుతున్నాయని ఈ సర్వే చెప్పడం లేదు. ఇతరులతో పోలిస్తే ఈ వర్గంలో విడాకుల రేటు ఎక్కువ అన్నది వారు ప్రస్తావిస్తున్న విషయం. ఇక తక్కువ ఎత్తున్న పురుషులకు పరోక్షంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి. చాలామంది ఎత్తును లోపంగా చూడడం వల్ల వీరికి పైపై ఆర్భాటాలకు ప్రాధాన్యమిచ్చే సంబంధాలు తప్పిపోయి ఒక రకంగా వీరికి మేలు చేస్తున్నాయి. ఎత్తు తక్కువున్నవాళ్ళు నిజంగా తమ బలహీనత అనుకుంటున్న విషయమే, వారికి ఎక్కువ మేలు చేస్తోంది. ఎత్తు కన్నా ముఖ్యమైన లక్షణాలను తమలో పెంపొందించుకోవడంలో భాగంగా వీరు ఆదాయం, ఇతర విషయాల్లో తమ జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు. దీంతో పెళ్లిళ్లు కొంత ఆలస్యం అయినప్పటికీ, కాబోయే భార్యాభర్తలిద్దరూ తమ వివరాలను చెప్పుకోవడం వల్ల చాలా విషయాల్లో పెళ్లికి ముందే స్పష్టత వస్తోంది. దీంతో వీరి కాపురాలు నిలబడటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎత్తును తమ బలహీనతగా భావించే పురుషులు భార్య ప్రేమను పొందడానికి ఇంటిపనులోనూ బాగా సాయమందుకుంటారు. దీనివల్ల కూడా దంపతుల మధ్య బంధాలు మరింత బలపడుతూ దాంపత్యాలు ఎక్కువ కాలం నిలుస్తున్నాయట. 23-45 ఏళ్ళ మధ్య వారిపైనే జరిగిన ఈ సర్వేలో 5 వేల మందికి పైగా మగాళ్లు పాల్గొన్నారు. దాన్నిబట్టి ఐదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వారి కాపురాలు మరింత సంతృప్తిగా ఉన్న విషయం తేలింది! అన్నట్లు... ఈ సమాచారం మిమ్మల్ని ఆలోచనలో పడేస్తే వెంటనే న్యూయార్క్ యూనివర్సిటీని సంప్రదించండి గానీ మాకు మాత్రం ఏం సంబంధం లేదండోయ్! - ప్రకాష్ చిమ్మల
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement