breaking news
central exise
-
కర్నూలులో జీఎస్టీ సేవా కేంద్రం
కర్నూలు (హాస్పిటల్): వ్యాపారులు, డీలర్ల సౌలభ్యం కోసం కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డివిజన్ ఆఫీసులో జీఎస్టీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అడిషనల్ కమిషనర్ టి.ముత్తుస్వామి చెప్పారు. మంగళవారం సుంకేసుల రోడ్డులోని ఓ హోటల్లో జీఎస్టీపై సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ముత్తుస్వామి మాట్లాడుతూ జీఎస్టీ సేవా కేంద్రంలో వ్యాపారులు వారి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. జీఎస్టీ వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.సెంథిల్ మురుగన్, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ వలలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
హైదరాబాద్: సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. సెంట్రల్ ఎక్సైజ్ (యాంటీ ఎవేషన్) సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్ గోపాలకృష్ణమూర్తి హైదరాబాద్, కాటేదాన్ లోని కేఎం ప్లాస్టిక్ కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు యజమాని జగదీష్ ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన గోపాలకృష్ణమూర్తి బృందం కంపెనీలో తనిఖీలు చేసింది. అనుకున్నట్టుగానే అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మంగళవారం ఉదయం రూ.6 లక్షలు జగదీష్ ప్రసాద్ సూపరింటెండెంట్ గోపాలకృష్ణమూర్తికి ఇచ్చాడు. మిగతా 4 లక్షలు మధ్యాహ్నం ఇవ్వాల్సి ఉంది. ఈ అవినీతి తిమింగళం విషయం సీబీఐకి ఫోన్ ద్వారా తెలిసింది. సంబంధిత అజ్ఞాత వ్యక్తి నుంచి సమాచారం తీసుకున్న సీబీఐ ఇన్ స్పెక్టర్ రాందాస్ బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని మిగతా రూ.4 లక్షలు ఇస్తున్న సమయంలో సూపరింటెండెంట్ గోపాలకృష్ణ మూర్తితోపాటు ప్లాస్టిక్ కంపెనీ యజమాని జగదీష్ ప్రసాద్‌ను కూడా అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐబీ డీఐజీ బుధవారం విడుదల పత్రికా ప్రకటనలో తెలిపారు. గోపాలకృష్ణమూర్తి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు రూ.5.6లక్షల నగదుతో పాటు కీలకమైన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జీ ముందు ప్రవేశపెట్టినట్టు డీఐజీ తెలిపారు.