breaking news
cement mixture miller
-
కాంక్రీట్ మిక్సర్ కింద నలిగి వ్యక్తి దుర్మణం
నెల్లూరు , సోమశిల: కాంక్రీట్ మిక్సర్ కింద నలిగిపోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అనంతసాగరం మండలంలోని అలుగు వాగు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. సోమశిల ఎస్సై తిరుపతయ్య కథనం మేరకు..మండలంలోని వరికుంటపాడు చెందిన శెట్టిబోయిన మల్లేష్ (39) అలుగువాగు సమీపంలో నడిచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అలుగువాగు సమీపంలో చేపడుతున్న రోడ్డు పనులకు సంబంధించిన కాంక్రీట్ మిక్సర్ అదుపుతప్పి మల్లేష్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లేష్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూ అభివృద్ధి పనులు భేష్
అచ్చంపేట/ఉప్పునుంతల, న్యూస్‌లైన్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన భూ అభివృద్ధి పనులు, తోటల పెం పకం చాలా బాగున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి ఎల్సీ గోయల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉప్పునుంతల పొలాన్ చెరువు వెనుక ఈజీఎస్‌లో చేపట్టిన భూ అభివృద్ధి పనులు, అచ్చంపేట మండలం లింగోటం వద్ద ఏర్పాటు చేసి న మామిడి తోట, డ్రిప్‌లను పరిశీలించి, రైతులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ పచ్చతోరణం కింద కేఎల్ఐ కాలువ వెంట మొక్క లు నాటుకున్న రైతులకు ఆయన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్సీ గోయల్ మాట్లాడుతూ అధికారులతో సమీక్షలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పనులు చేపట్టి సాగులోకి తెచ్చిన రైతుల భూము ల్లో ఇందిర జలప్రభ ద్వారా బోర్లు వేయిం చి నీటి వసతిని కల్పించాలని కలెక్టర్ గిరిజాశంకర్, డ్వామా పీడీ వెంకటరమణారెడ్డిలకు సూచించారు. గ్రామంలో 250 ఎకరాల్లో భూ అభివృద్ధి పనులు చే పట్టి సాగులోకి తెచ్చిన పొలాల్లో మిగిలి పోయిన పనులను పూర్తి చేసి రైతుల పం టలను సాగుచేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీలో ప్రస్తు తం ఉన్న వందరోజుల పని దినాలు సరి పోవడం లేదని, 200 రోజుల పని కల్పిం చి 15 రోజులకొక్కసారి కూలి డబ్బులు చెల్లించాలని సమాఖ్య ప్రతినిధులు కార్యదర్శిని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కార్యదర్శి మాట్లాడుతూ కూలీలు ఆదాయం వచ్చే ఇతర వనరులు ఎంచుకుని ముందుకు వెళ్లాలని సూచించా రు. ఈజీఎస్ పనులు లేని సమయంలో సిమెంటు ఇటుకల తయారీ, సిమెంటు మిక్చర్ మిల్లర్ వంటి వాటితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని, సమాఖ్యలు ముందుకు వస్తే వాటిని ఇచ్చే ఆలోచన చేస్తామన్నారు. అనంతరం పనుల కల్పన, పేఆర్డర్ జనరేట్, ఆన్లైన్, మస్టర్ ఫీడింగ్ తదిర అంశాలను గోయల్ స్వయంగా పరిశీలించారు. పోస్టాఫీస్ ద్వా రా బయోమెట్రిక్ విధానంలో కూలీలకు డబ్బుల పంపిణీ విధానాన్ని పర్యవేక్షించి, కొంతమంది కూలీలకు స్వయంగా డబ్బు లు పంపిణీ చేశారు. గోయల్ ప్రసంగాన్ని కలెక్టర్ గిరిజాశంకర్ తెలుగులోకి అనువాదం చేశారు. కార్యక్రమంలో ఏపీ గ్రామీణాభివృద్ధి కమిషనర్ శశిభూషణ్‌కుమార్, సెర్ప్ సీఈఓ రాజశేఖర్, రూరల డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ ఏవీవీఎస్ ప్ర సాద్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీడీలు మల్లికార్జునస్వామి, సుబ్బారావు, ఆర్డీఓ కీమ్యానాయక్ పాల్గొన్నారు.