కాంక్రీట్‌ మిక్సర్‌ కింద నలిగి వ్యక్తి దుర్మణం

Man Dies in Cement Machine PSR Nellore - Sakshi

నెల్లూరు , సోమశిల: కాంక్రీట్‌ మిక్సర్‌ కింద నలిగిపోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అనంతసాగరం మండలంలోని అలుగు వాగు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. సోమశిల ఎస్సై తిరుపతయ్య కథనం మేరకు..మండలంలోని వరికుంటపాడు చెందిన శెట్టిబోయిన మల్లేష్‌ (39) అలుగువాగు సమీపంలో నడిచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అలుగువాగు సమీపంలో చేపడుతున్న రోడ్డు పనులకు సంబంధించిన కాంక్రీట్‌ మిక్సర్‌ అదుపుతప్పి మల్లేష్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లేష్‌ తలకు  తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లేష్‌ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top