breaking news
celebrate Holi
-
Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
హోలీ హోలీల రంగ హోలీ..చమ్మకేళీలహోలీ అంటూ ఎంతో సరదాగా, ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ. పిల్లా పెద్దా అంతా హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణంగా ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, హోలీ ఆడేముందు, ఆడిన తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం.హోలీ ఆడే సమయంలో ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలు ఉంటాయని గమనించాలి. అలాగే వాడి సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు, ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకు దారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం.సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించు కోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు.చదవండి: Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా! పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి.స్కిన్ అండ్ హెయిర్ : హోలీ ఆడటానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది. హోలీ రంగులతో రియాక్షన్ ఇచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. పైగా సులభంగా రంగులు క్లీన్ అవుతాయి.దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని.నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.రంగులను ఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకుందాం. అందరికీ హ్యాపీ హోలీ. -
కర్నూలు జిల్లా సంతేకుళ్లారు గ్రామంలో వెరైటీగా హోలీ పండగ
-
కొండగట్టు: అంజన్నగుడిలో భక్తులు ఎక్కడ?
-
కొండగట్టు: భక్తులు లేకుండానే అంజన్న జయంతి వేడుకలు
సాక్షి, కొండగట్టు(చొప్పదండి): కరోనా కారణంగా ఏటా కొండగట్టు అంజన్న కొండపై జరిగే చిన్న జయంతి ఉత్సవాలు ఈసారి అంతరాలయానికే పరిమితమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో నేడు (మంగళవారం) జరిగే హనుమాన్ చిన్న జయంతికి అధికారులు భక్తులకు అనుమతి నిరాకరించారు. అంతరాలయంలోనే పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాదీ భక్తులు లేకుండానే... కొండగట్టులో ఏటా రెండు సార్లు హనుమాన్ చిన్న, ఒకసారి పెద్ద జయంతి ఉత్సవాలు జరుగుతాయి. కానీ కోవిడ్–19 కారణంగా గతేడాది ఉత్సవాలను సైతం అర్చకులు భక్తులు లేకుండానే ఆలయం లోపల నిర్వహించారు. ఈ ఏడాది కూడా అలాగే జరుపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని ఐదు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొండకు ఎవరూ రావొద్దని చెప్పడంతో హనుమాన్ దీక్షాపరులు తమ తమ గ్రామాల్లోని అంజన్న ఆలయాల్లో మాల విరమణ చేస్తున్నారు. మంగళవారం చిన్న జయంతి సందర్భంగా చాలామంది మాల విరమణ చేయనున్నారు. బంద్ విషయం తెలియక భక్తుల రాక.. కొండగట్టు ఆలయం బంద్ ఉన్న విషయం తెలియక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలో కొండ దిగువన బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని ఇళ్లకు తిప్పి పంపిస్తున్నారు. శ్రీఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తులు ఇళ్లలోనే ఉండి, సహకరించాలని ఆలయ ఈవో చంద్రశేఖర్ కోరారు. -
గవర్నర్ నరసింహన్ హోలీ శుభాకాంక్షలు
-
బాలీవుడ్ కాదు... హోలీవుడ్
తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, పచ్చ... ఇవన్నీ కేవలం రంగులే కాదు. మనిషి జీవితంలోని వివిధ అనుభూతులకు సంకేతాలు. తెలుపు అంటే శాంతి. నలుపు అంటే బాధ, ఎరుపు అంటే ఆకలి, పసుపు అంటే పవిత్రత. పచ్చ అంటే సౌభాగ్యం. మొత్తంగా మనిషి జీవితం ఇదే. ‘హోలీ’ పండగ సారాంశం కూడా ఇదే. కుల, మత, ప్రాంతరహితంగా వయోభేదం సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన పండగలు కొన్ని ఉంటాయి. అలాంటి పండగల్లో హోలీ కూడా ఒకటి. ఈ పండగ సందడి అలా ఉంటుంది మరి. అయితే... ఇది జనాలు జరుపుకోవడం ఒక ఎత్తు. సినీ తారలు జరుపుకోవడం మరొక ఎత్తు. ఇక బాలీవుడ్లో అయితే... సరేసరి. వీలైతే షూటింగుల్ని కూడా పక్కనపెట్టేసి, ఓ పనిగా జరుపుకుంటుంటారు అక్కడి సెలబ్రిటీస్. ‘రంగు పడుద్ది’ అనే రేంజ్లో ఉంటుంది ముంబయ్‌లో వీరి హంగామా. అదేంటో చూడండి. రాజ్‌కపూర్ ఆధ్వర్యంలో...: సినిమా తారలందరూ ఒకేచోట హోలీ జరుపుకుంటే బాగుంటుందని మొట్టమొదట ఈ ఆనవాయితీకి శ్రీకారం చుట్టింది ప్రముఖ నటులు, దర్శక, నిర్మాత రాజ్‌కపూర్. ప్రతి ఏటా తన ఆర్కే స్టూడియోలో ఆయన హోలీ కేళీని ఏర్పాటు చేసేవారు. ఆ సంబరానికి అందర్నీ ఆహ్వానించేవారు. ఓ చిన్న కొలనులా తవ్వించి, రంగు నీళ్లతో నింపేవారు. ఎవరు ముందు వస్తే, వాళ్లని ఆ రంగు నీళ్లల్లో ముంచేవారు. ఫిమేల్ ఆర్టిస్టులు ఇబ్బందిపడకుండా జాగ్రత్త తీసుకునేవారట. వారి దగ్గర ఎవరూ అసభ్యంగా ప్రవర్తించడానికి వీలు లేని విధంగా ఏర్పాట్లు చేసేవారట రాజ్‌కపూర్. ఆ విధంగా ఆయన ఆధ్వర్యంలో జరిగిన సంబరాలను ఆ తర్వాత ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. ‘బిగ్ బి’ ఇంట్లో సందడి: ఆర్కే స్టూడియో సంబరాల తర్వాత బాలీవుడ్లో బాగా పాపులర్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో జరిగే హోలీ కేళి. తన స్వగృహం ప్రతీక్షలో బిగ్ బి హోలీ సంబరాన్ని ఏర్పాటు చేస్తారు. రంగు నీళ్ల కొలను, గానా బజానా, రుచికరమైన వంటకాలు.. ఇలా అతిథుల కోసం బిగ్ బి కుటుంబం భారీ ఏర్పాట్లనే చేస్తుంది. రంగు నీళ్లల్లో ఆడిన తర్వాత ఫ్రెష్ అవ్వడం కోసం ప్రత్యేకంగా షవర్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఈ ఏడాది కూడా ఇలానే హోలీ జరపడానికి ప్లాన్ చేశారట. అమితాబ్ బచ్చన్ తొలి హోలీ కేళీలో సన్నీ: నీలి చిత్రాల్లో నటించి, శృంగార తారగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ కెనడాలో పుట్టి, పెరిగిన అమ్మాయి. పంజాబీ కుటుంబానికి చెందిన సన్నీ విదేశాల్లో పుట్టి, పెరగడంవల్ల భారతీయ పండగలు, సంప్రదాయాలు పెద్దగా తెలియవు. ఇక్కడికొచ్చి, హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె జరుపుకున్న తొలి పండగ దీపావళి. ఈ ఏడాది తొలి హోలీని జరుపుకోనున్నారు. ముంబయ్‌లో ఏర్పాటు చేసే ఓ ప్రత్యేక హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొనబోతున్న సన్నీ, అందర్నీ రంగు నీళ్లల్లో ముంచెత్తాలని ఫిక్స్ అయ్యారు. త్వరలో విడుదల కానున్న తన ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2’ చిత్రంలోని ‘బేబీ డాల్...’ పాటకు డాన్స్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. లొకేషన్లో దీపికా పండగ!: దీపికా పదుకొనేకి హోలీ పండగ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే రంగుల పొడితో బయటకు తుర్రుమనేదాన్నని దీపికా పేర్కొన్నారు. దాదాపు వారం రోజులు హోలీ జరుపుకునేవారట. ‘ఆ వారం రోజులు నా వంటి మీద ఏదో ఒక రంగు ఉండటం, మా అమ్మ బాగా విసుక్కోవడం నాకింకా గుర్తే’ అంటున్నారు. పెద్దయిన తర్వాత వారం రోజులు జరుపుకునే వీలుండటంలేదనీ, ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒక్క రోజు జరుపుకోవడమే పెద్ద కష్టమైపోతోందనీ అన్నారు. ఈ ఏడాది ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా లొకేషన్లో పండగ చేసుకుంటారట. ‘‘సాయంత్రం షూటింగ్‌కి పేకప్ చెప్పగానే యూనిట్ సభ్యుల మీద రంగు చల్లాలనుకుంటున్నాను’’ అని దీపికా చెప్పారు. ఆట హానికరం కాకూడదంటున్న నర్గిస్: అమెరికాలో పుట్టి, పెరిగిన నర్గిస్ ఫక్రి చాలా సరదా టైప్. అందుకే సరదా పండగ హోలీని మిస్ కాకూడదనుకుంటారు. అదే విధంగా సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుంటారామె. హోలీ ఆడేముందు పోనీటైల్ వేసుకుంటారట. కాటన్ దుస్తులు ధరిస్తారట. సురక్షితమైన రంగులనే వాడతానంటున్నారు నర్గిస్. హోలీ ఆట ముగిసిన తర్వాత వేడి వేడి నూనెతో తలని మర్దన చేసిన, వేడి నీళ్లతో తలస్నానం చేస్తానని, ఆ తర్వాత వంటికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటానని నర్గిస్ తెలిపారు. ప్రతి ఏడాదీ ఈ నియమాలు పాటించే నర్గిస్ ఈ ఏడాది మాత్రం మిస్సవుతున్నారట. షూటింగ్ ఉండటంవల్ల హోలీ జరుపుకోవడం లేదని పేర్కొన్నారు. పండగ చేసుకున్న వీణా!: రెండు రోజుల ముందే వీణా మాలిక్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘దాల్ మే కుచ్ కాలా హై’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం యూనిట్ సభ్యులతో వీణా రంగుల పండగ చేసుకున్నారు. బేసిక్‌గా తాను కలర్‌ఫుల్ పర్సన్ అని, అందుకే రంగుల పండగ అంటే చాలా ఇష్టమని వీణా అంటున్నారు.ఇంకా బాలీవుడ్లో ఇలా హోలీ పండగ చేసుకుంటున్న తారలు చాలామందే ఉన్నారు.