breaking news
Brahma temple
-
బహు సుందర బ్రహ్మ ఆలయం
సాక్షి, అమరావతి బ్యూరో/తెనాలి: ఆయన సృష్టికర్త. త్రిమూర్తులలో ప్రథమ స్థానం. అయినా బ్రహ్మదేవుడికి పూజలు చేయడం అరుదు. ఆలయాలూ ఉండవు. భృగు మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మ దేవుడికి ఆలయాలు ఉండవని, పూజలు జరగవని పురాణాల ప్రకారం చెబుతారు. అయితే కాశీ, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గర్లోని పుష్కర్‌లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక మూడోది మన రాష్ట్రంలో ఏకైక ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉంది. ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయాన్ని రెండో కాశీగా చెబుతారు. శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండటంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు, ఒకేసారి శివుడిని, బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతి చెందుతారు. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్న ప్రదేశం. కోనేరు మధ్యలో ఆలయం ► చేబ్రోలులో బ్రహ్మ ఆలయాన్ని 1817లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు. ► పెద్ద కోనేరును తవ్వించి, దాని ఆలయాన్ని నిర్మించి, బ్రహ్మదేవుడిని ప్రతిష్టించారు. ► పద్మాకారంలో ఉండే పానపట్టంపై లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ 4 ముఖాలనూ రూపొందించారు. గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం మరో విశేషం. భక్తులు ఎటునుంచైనా స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలూ నిత్యకృత్యం. బ్రహ్మ దేవుడి ఆలయం చుట్టూ మరెన్నో దేవాలయలున్నాయి. పాపపరిహారం కోసం.. రాజ్యంలో మితిమీరిన దొంగతనాల కట్టడికి, పట్టుబడిన దొంగల తలలు తీయించే చట్టం చేస్తారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టిపీడిస్తుందన్న భావనతో నిష్కృతి కోసం బ్రహ్మదేవుడి ఆలయం నిర్మించాలని తలుస్తారు. పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే, ఆ దేవతా మూర్తి దృష్టి పడ్డంతవరకు నాశనమవుతుందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో శివ–కేశవ ఆలయాలు నిర్మించాలని సూచిస్తారు. బ్రహ్మదేవుణ్ణి లింగాకారంలో మలిచి ఆ దేవుడి దృష్టి బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఆలయానికి ముందు వెనుక శివాలయాలు, రెండు పక్కల వైష్ణవ ఆలయాలు నిర్మించారు. మిగిలిన 4 మూలలా ఇతర దేవతా మూర్తులను ప్రతిష్టించి ఎనిమిది దిక్కులనుంచి బ్రహ్మదేవుని దృష్టిని ముందుకు సాగకుండా అరికట్టారు. ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడి ఆలయ నిర్మాణంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మనసు శాంతించిందని చెబుతారు. ఈ ఆలయ ఉత్సవ, దీపారాధన, నైవేద్యాది కైంకర్యాలకు, దేవదాసీలు, భజంత్రీలు, అర్చకులు వగైరాలకు మాన్యాలను ఆయన సమకూర్చారు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం చేబ్రోలులోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఏకైక బ్రహ్మ ఆలయంగా ప్రసిద్ధి. ఆలయ కట్టడాలు, శివలింగం.. అన్నీ కాకతీయ వాస్తుశైలిని పోలి ఉన్నాయి. నాలుగు వైపుల్నుంచి స్వామిని దర్శించుకొనేలా నిర్మించిన అరుదైన సార్వతోభద్ర ఆలయం ఇది. ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది దిక్పాలకులకు దేవాలయాలుండటం మరో ప్రత్యేకత. సృష్టికర్తయిన బ్రహ్మ పేరిట ఆలయాన్ని నిర్మించి, దిక్పాలకుల పర్యవేక్షణలో సత్యలోకాధిపతిని సందర్శించుకోవటం అన్ని పాపాలకు పరిహారమని నాటి జమీందారు నమ్మారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్నుంచి కూడా యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ప్రముఖ స్థపతి -
శ్రీకూర్మనాథుని డోలోత్సవానికి వేళాయె...
మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కూర్మం. స్వామివారు కూర్మనాథుడిగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శ్రీకూర్మ క్షేత్రం హిందూదేశానికే తలమానికం. ప్రాచీన శిల్పకళా శోభితంగా, దేశ నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను పంచిపెడుతూ అలరారుతోంది. వైష్ణవుల 108 దివ్యారామాల్లో ప్రముఖంగా ఉంది. అంతటి మహిమాన్విత గల ఈ క్షేత్రంలో ప్రముఖమైన ఉత్సవంగా ఫాల్గుణ మాసంలో జరిగే డోలోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా ఫాల్గుణమాస త్రయోదశి నాడు మఖ నక్షత్రంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మార్చి 19న కామదహనోత్సవం, 20న పడియ, 21న డోలోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కామదహనోత్సవం... అంటే మనలోని కోరికలను దహనం చేసే ఉత్సవంగా చెబుతారు. మన్మథుని దహించేందుకు గానూ తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఉభయానాంచారులతో కలిపి గోవిందరాజస్వామి, చొప్పరంలో సీతారామ, అశ్వవాహనంపై లక్ష్మణ, పల్లకీలో చక్రనారాయణస్వామి హోమం అనంతరం ప్రత్యేక పూజలనంతరం కామదహనం చేస్తారు. గరుడవాహనం పై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. గ్రామ సమీపంలోని కామదహనం మంటపం వద్ద కామదహన కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు.పడియ... కామదహనంలో పాల్గొన్న భక్తులు వేకువజామున సమీపంలోని సముద్రస్నానాలు చేసి ఆలయంలోని శ్వేతపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడంతో పడియ ఉత్సవం పూర్తవుతుంది. శ్వేతపుష్కరిణిని విష్ణువు సుదర్శన చక్రంతో తవ్వడం జరిగింది. తవ్వుతున్న సమయంలో లక్ష్మీదేవి గరుడవాహనంపై కూర్చున్న విగ్రహం లభ్యమవ్వడంతో ఆలయంలో శ్రీకూర్మనాయకిగా పూజలందుకుంటోంది. డోలోత్సవం... డోలాయమానం గోవిందం మధ్యస్ధ మధుసూదనం రథస్త వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే... డోలోత్సవంలో ఉయ్యాల మంటపంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదన్నది శ్లోక భావన. గ్రామదేవత మోహినీ భద్రాంబిక దర్శనార్ధమై శ్రీకూర్మనాథుడు రాజరాజ అలంకరణలో డోలామంటపం వద్దకు వెళ్తారని స్ధలపురాణం చెపుతుంది. ఈ సందర్భంగా స్వామిపాదాలను భక్తులు తాకే అవకాశం ఉంది. స్వామి అస్పృశ్య దోష నివారణకు బుక్కా, భర్గుండ (రంగులు కలిపిన పదార్ధం)తో అర్చకులు పూజలు చేస్తారు. పూజ చేసిన బుక్కా, భర్గుండను భక్తులపై చల్లుతారు. సనాతనంగా వచ్చిన ఈ ఉత్సవమే ప్రస్తుతం హోళీగా మారిందని చెబుతుంటారు. డోలోత్సవం రోజున ఆలయం నుంచి గజ వాహనంపై స్వామివారు, మరోవాహనంపై ఉభయ నాంచారులు తిరుగు ప్రయాణంలో గరుడవాహనంపై స్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం మాడ వీధుల గుండా జరిగిన ఈ యాత్ర డోలా మంటపం చేరుకున్న తరువాత ఉత్తర నక్షత్ర లగ్నమందు ఉత్తరాభిముఖ దర్శనం ఇస్తారు. విజయనగరం రాజవంశీకుడు పూసపాటి అశోకగజపతిరాజు గోత్ర నామాలతో తొలిపూజలు చేస్తారు. శ్రీరంగం, వైకుంఠంలో స్వామిని చేరేందుకు గద్యత్రయం పఠనం చేస్తారు. కూర్మనాథుని ఆవిర్భావం.... ఆలయం తొలుత దేవతలు నిర్మించగా, 2వ శతాబ్దంలో అనంత చోళగంగుడు, అనంగ భీముడు హయాంలో పునఃనిర్మాణం జరిగింది. కూర్మనాథుడి పైనే భూమి అంతా ఆధారపడి ఉందని, క్షీరసాగర మధనంలో దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణువు కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని తన మూపున మోస్తూ అమృతం పొందేందుకు సహకరించాడు. తాను స్వామిని కూర్మరూపునిగా సందర్శించాలని ఉందన్న శ్వేత చక్రవర్తి కోరిక మేరకు స్వామి కూర్మరూపంలో ఇక్కడ దర్శనమిచ్చారని స్ధలపురాణం చెబుతుంది. గోపురం అష్టదళపద్మాకారంలో ఉంటుంది. ఈ గోపురంపై గల గాంధర్వ, నారసింహా, కపీశ, హయగీవ్ర, ధదివక్త్ర దర్శనం పుణ్యభరితమని, సర్వరోగ, సకల పాప నివారణి అని చెబుతారు.ఈ క్షేత్రంపై మహమ్మదీయ చక్రవర్తులు దాడికి దిగుతున్నారని తెలిసి, స్థానికులు సున్నం, గుగ్గిలం రాశులుగా పోసారట. వాటిని సైనికుల కొండలుగా భావించి, వీరిని జయించలేమని మహమ్మదీయ సేనలు వెనుదిరిగారట. అప్పటి సున్నం, గుగ్గిలం ఆనవాళ్లు మనం చూడవచ్చు. క్షేత్ర పాలకునిగా ఆలయం చెంతనే శివుడు పాతాళ సిద్ధేశ్వరుడుగా దర్శనమిస్తాడు. త్రిమతాచార్యులు సందర్శించిన ఏకైక క్షేత్రం.... ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామి వారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్దంలో స్వామిని సేవించిన రామానుజాచార్యులు కోరిక మేరకు తూర్పు ముఖం కలిగి ఉన్న కూర్మనాథుడు పశ్చిమానికి తిరిగి దర్శనం ఇచ్చాడని చెబుతారు. అందుకోసం రెండు ధ్వజస్తంభాలను ఇక్కడ చూడవచ్చు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీనరహరి తీర్థులు క్షేత్రాన్ని సందర్శించి సీత, రామలక్ష్మణ ఉత్సవమూర్తులను బహూకరించారని, ప్రస్తుత ఉత్సవమూర్తులైన గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను లవకుశులు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. శైవ, విషు -
మళ్లీ తెరచుకున్న బ్రహ్మ దేవాలయం
బ్యాంకాక్ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సోమవారం బాంబు పేలుడు సంభవించిన బ్రహ్మా దేవాలయం తిరిగి బుధవారం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం దేవాలయాన్ని తెరిచారు. దేవాలయంలో బౌద్ధ బిక్షువులు ప్రార్థనలు నిర్వహించారు. భారీగా భక్తులు దేవాలయానికి వచ్చి దేవుడిని దర్శించుకున్నారు. సోమవారం బ్యాంకాక్‌లోని బ్రహ్మా దేవాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. మృతుల్లో తొమ్మిది మంది విదేశీయులున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి పేలుడు థాయ్‌లాండ్ చరిత్రలో ఎప్పుడు చోటు చేసుకోలేదని ఉన్నతాధికారులు వివరించారు. మృతుల్లో ఏడు మృతదేహాలను గుర్తించవలసి ఉందని చెప్పారు. సీసీ ఫుటేజ్‌లో గుర్తించిన అనుమానితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు జాతీయ పోలీసు అధ్యక్షుడు తెలిపారు. ఆ క్రమంలో అతడు అక్కడి తీసుకు వచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను విచారిస్తున్నామన్నారు. ఈ పేలుడులో దేవాలయంలోని బ్రహ్మా దేవుని విగ్రహం యొక్క గెడ్డం, చెయ్యి స్వల్పంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.