రెండో దఫా పీజీఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
జేఎన్టీయూ: ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చే పీజీఈసెట్ రెండో దఫా కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. జేఎన్టీయూ పాలక భవనంలో ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియను జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్‌కుమార్ పరిశీలించారు. మొత్తం 433 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.