breaking news
big banknotes
-
రాహుల్‌కు గుజరాత్ కోర్టు సమన్లు
అహ్మదాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలాకు గుజరాత్‌లోని ఓ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. 2016 నవంబర్‌లో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు(ఏడీసీబీ) రూ.750 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొత్త నోట్లతో మార్చి భారీ కుంభకోణానికి పాల్పడిందని వీరు తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆ బ్యాంకు చైర్మన్ అజయ్‌పటేల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మే 27వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ వారిద్దరికీ సోమవారం సమన్లు జారీ చేశారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ఐదు రోజుల్లోనే ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన బీజేపీ చీఫ్ అమిత్‌షాకు చెందిన రూ.745 కోట్ల మేర పాత నోట్లను కొత్తవాటితో మార్పిడి చేసిందని ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త తెలిపిన సమాచారం మేరకు రాహుల్ గాంధీ.. ‘కేవలం ఐదు రోజుల్లోనే రూ.750 కోట్ల పాతనోట్లను కొత్తనోట్లతో మార్పిడి చేసి, ప్రథమ బహుమతి గెలుచుకున్నందుకు కంగ్రాట్స్ అమిత్ షా జీ, డైరెక్టర్, అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్..’అంటూ ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
ఐదో రోజూ తప్పని ‘నోటు’ తిప్పలు!
-
తప్పని ‘నోటు’ తిప్పలు!
• ఆదివారమూ బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు • నాలుగైదు గంటల పాటు క్యూలైన్లలోనే.. • నగదు నింపిన గంటలోనే ఖాళీ అవుతున్న ఏటీఎంలు • రూ.2 వేల నోట్లను వినియోగించుకోలేక జనం వెతలు • నేడు బ్యాంకులకు సెలవుతో పెరగనున్న సమస్యలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల కష్టాలతో రాజధాని లో సాధారణ జనజీవనం దాదాపుగా స్తంభించి పోతోంది. ఆదివారం సెలవు రోజున ఇంటిపట్టున ఉండాల్సిన జనం.. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చిల్లర వర్తకులు, ఫుట్‌పాత్, వీధి వ్యాపారులు సైతం చిల్లర ఇవ్వలేక సరుకులు అమ్ముకోలేని పరిస్థితిలో చిక్కుకుపోయారు. బ్యాంకుల వద్ద నగదు మార్పిడికి రూ.4 వేల వరకు అవకాశమున్నా.. భారీగా జనం రావడంతో పలు బ్యాంకుల్లో రూ.2 వేలతోనే సరిపెట్టారు. చెక్కుతో రూ.10 వేల వరకు డ్రా చేసే అవకాశమున్నా.. నగదు నిల్వలు లేవంటూ పలు బ్యాంకులు చేతులెత్తేయడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. చాలా వరకు బ్యాంకుల్లో చెక్కుతో పదివేల నగదుగా.. ఆరు వేలకు మూడు రూ.2వేల నోట్లు, మిగతా నాలుగువేలకు రూ.100 నోట్లు ఇచ్చారు. కానీ రూ.2 వేల నోట్లను బహిరంగ మార్కెట్లో మార్చుకునేందుకు సామన్యులు నానా అవస్థలు పడ్డారు. ఇక కొన్ని బ్యాంకుల్లో టోకెన్లు మాత్రమే ఇచ్చి.. నగదు కోసం మరుసటి రోజు రావాలని సూచించడం గమనార్హం. పెట్రోలు బంకుల్లో రూ.500, రూ.వెరుు్య నోట్లను తీసుకుంటున్నా.. చిల్లర ఇవ్వలేమని, ఆ పూర్తి మొత్తానికి పెట్రోల్, డీజిల్ పోరుుంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు. గంటలోనే ఏటీఎంలు ఖాళీ.. హైదరాబాద్ మహా నగరం పరిధిలో ఏడు వేల ఏ టీఎం కేంద్రాలున్నా.. ఎక్కడా నగదు అందుబా టులో ఉండడం లేదు. ఏటీఎంలలో నగదు నింపిన గంటలోపే ఖాళీ అరుుపోతున్నారుు. మరో రెండు వారాలు ఇదే దుస్థితి ఉంటుందనే సమాచారంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సాధారణంగా ఆదివారాల్లో సందర్శకులతో కిటకిటలాడే పార్కులకు.. నోట్ల దెబ్బతగిలి వెలవెలబోయారుు. భారీగా బకారుుల వసూళ్లు నోట్ల రద్దు ప్రభావంతో పలు ప్రభుత్వ విభాగాలకు మొండి బకారుులు వసూలవుతుండడం విశేషం. ఆదివారం జీహెచ్ఎంసీకి రూ.10 కోట్లు ఆస్తిపన్ను, జల మండలికి రూ.3.1 కోట్ల మేర నీటిబిల్లులు, సీపీడీసీఎల్‌కు రూ.14 కోట్లు పెండింగ్ బిల్లులు వసూలరుునట్లు ఆయా విభాగాల అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు కూడా పెండింగ్ బిల్లుల చెల్లింపులకు పాత రూ.500, వెరుు్య నోట్లను స్వీకరిస్తామన్నారు. సెలవుతో పెరగనున్న ఇక్కట్లు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీంతో జనం కష్టాలు మరింతగా పెరగనున్నారుు. సోమవారం కార్తీక పౌర్ణమి కావడం, నోట్లకు ఇబ్బంది ఉండడంతో.. పూజలకు అవసరమైన పూలు, పండ్లు, ఇతర సామగ్రి ధరలను వ్యాపారులు అమాంతం పెంచివేశారు. ఇక పెద్ద నోట్ల ప్రభావం మటన్, చికెన్ దుకాణాలపైనా పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మాంసం విక్రయాలు సగానికి పైగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి మార్కెట్ బంద్! ఆదివారం మలక్‌పేట్ మార్కెట్‌కు ఉల్లి తీసుకువ చ్చిన రైతులు వెంటనే డబ్బు చెల్లించాలని వ్యా పారులను ఒత్తిడి చేశారు. కానీ నోట్ల సమస్య కారణంగా వ్యాపారులు చెల్లింపులు చేయలేక పోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉల్లి కొనుగోలు నిలి పివేస్తున్నట్లు ఉల్లి హోల్‌సేల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి ప్రకటించారు. ఈ విష యమై అధికారులకు సైతం సమాచారం ఇచ్చామ ని, రైతులు సహకరించాలని పేర్కొన్నారు. జనం విలవిల.. సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నోట్ల పాట్లు తప్పడం లేదు. క్షేత్రస్థారుులో జనం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. అవసరాలకు సొమ్ము కోసం ఏటీఎంల ముందు పడిగాపులు పడుతున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు పెట్టుకున్న వారైతే తీవ్రంగా ఆందోళనలో కూరుకుపోతున్నారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు వెళుతున్నవారు చేతిలో డబ్బుల్లేక విలవిల్లాడుతున్నారు. ఎక్కడిక్కడ పనులు నిలిచిపోరుు కూలీలు అవస్థలు పడుతున్నారు. నేతన్నల గోస.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్రోత్పత్తిదారులు ప్రతి శనివారం నేత కార్మికులకు కూలి డబ్బు చెల్లిస్తారు. ఈ సారి అంతా రూ.వెరుు్య, రూ.500 నోట్లను ఇవ్వడంతో కార్మికులు.. ఆ నోట్లను మార్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. పెద్ద నోట్లతో, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో బ్యాంకుల ముందు క్యూ కట్టారు. మరోవైపు పెద్ద నోట్లతో పన్నులు, బకారుుల చెల్లింపులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో మున్సిపల్, ‘సెస్’, గ్రామ పంచాయతీ, రవాణా శాఖలకు సిరిసిల్ల పరిధిలో రూ.2.5 కోట్ల వరకు వసూలయ్యారుు. పెద్దపల్లి జిల్లాలో ‘నోటు’ పాట్లు తప్పలేదు. రూ.100 నోట్లు, కొత్తనోట్ల కోసం జనం బారులు తీరుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రైవేట్‌గా నిర్వహించే చిట్టీలు, గిరిగిరి ఫైనాన్స దందాలు నిలిచిపోయారుు. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో బ్యాంకుల వద్ద సొమ్ము విత్‌డ్రా చేసుకునే వారికంటే డిపాజిట్ దారులే ఎక్కువగా కనిపించారు. వివిధ పన్నులు, విద్యుత్ బిల్లుల రూపంలోనూ సుమారు రూ.50కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. ఇక బ్యాంకుల్లో ఇస్తున్న రూ.2వేల నోట్లు తీసుకెళ్తే చిల్లర ఇవ్వడం లేదని.. తమకు రూ.100, రూ.50, రూ.20నోట్లు కావాలని ఆయా బ్యాంకుల్లో సిబ్బందిని ప్రజలు వేడుకోవడం కనిపించింది. వికారాబాద్ జిల్లాలోనూ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిచ్చారుు. పరిగిలో సాయంత్రం ఐదు గంటలకే బ్యాంకులు మూసేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు తెరిచే ఉంచాలని జనం డిమాండ్ చేశారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ప్రజలకు చిల్లర తిప్పలు తప్ప లేదు. సూర్యాపేట పట్టణంలోని పలు బ్యాంకులను నోట్లు అరుుపోయాయంటూ మధ్యాహ్నమే మూసివేశారు.