breaking news
bhanu teja
-
నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్‌తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్‌లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్‌కు వచ్చింది. వీరిలో స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న సతీష్‌ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు. -
మాధవి కేసులో భాను అరెస్ట్
నెల్లూరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ వీర మాధవి (28) ఆత్మహత్య కేసులో ప్రియుడు భానుతేజను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేయడంతో తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు కారణాలను వివరించి మాధవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 'భానూ..ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా..నా చేతులకు గాజులు వేసి..నా ముఖాన ఇంత బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లయిపోయింది భానూ.. ఈ ఒకే ఒక్క కోరిక తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్‌లోకి..ఇంకెవరి లైఫ్‌లోకి రాను.. మీకందరికీ దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను.. ఇక సెలవ్..'అంటూ వీడియో సెల్ఫీ తీసుకున్న మాధవి బలవన్మరణానికి పాల్పడ్డారు. కావలిలోని కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన మాధవి పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. మాధవి ఆత్మహత్యకు కారణమైన భానుతేజను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.