breaking news
BFSI Company
-
గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు!
Jobs In Festival Season: త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలు ఇప్పటికే క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ అండ్ రిటైల్ బీమాలలో పెరుగుదలను ఆశిస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 50వేల ఉద్యోగాలు.. నివేదికల ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయి. మునుపటి ఏడాదికంటే కూడా ఈ సారి ఈ రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరగడం, పర్సనల్ ఫైనాన్స్ అప్లికేషన్లు పెరగటమే కాకుండా రాబోయే 5 లేదా 6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్‌కు సిద్ధంగా ఉన్నామని టీమ్‌లీజ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్-BFSI కృష్ణేందు ఛటర్జీ తెలిపారు. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! పండుగ సీజన్లో తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ అహ్మదాబాద్, పూణే, బెంగళూరు, కోల్‌కతా వంటి టైర్ 1 నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలైన కొచ్చి, వైజాగ్, మధురై.. లక్నో, చండీగఢ్, అమృత్సర్, భోపాల్, రాయ్‌పూర్‌లలో కూడా ఎక్కువగా ఉండనుంది. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ వేతనం వివరాలు.. నిజానికి ఈ టెంపరరీ ఉద్యోగుల ఆదాయం మునుపటి ఏడాదికంటే కూడా 7 నుంచి 10 శాతం పెరిగాయి. కావున ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో జీతాలు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు.. అదే సమయంలో చెన్నైలో రూ. 15వేల నుంచి రూ. 17వేల వరకు & కలకత్తాలో రూ. 13వేల నుంచి రూ. 15వేల వరకు ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే జీతాలు కూడా ఓ రకంగా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలే మా ప్రధాన క్లౌడ్ సర్వీస్ యూజర్లు: మైక్రోసాఫ్ట్
బెంగళూరు: తమ దేశీ క్లౌడ్ సర్వీస్‌లకు హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు సహా పలు స్టార్టప్స్ కూడా ప్రధాన క్లయింట్స్‌గా ఉన్నాయని ‘మైక్రోసాఫ్ట్’ పేర్కొంది. ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్లౌడ్ సర్వీసులను ఉపయోగిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది. హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలు వాటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో క్లౌడ్ సర్వీసులకు ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొంది. టెక్నాలజీ స్టార్టప్స్ కొత్త సేవల ఆవిష్కరణకు క్లౌడ్ సేవలను వినియోగించుకుంటున్నాయని తెలిపింది. బీఎస్ఈలో లిస్టైన టాప్-100 కంపెనీల్లో 52 సంస్థలు తమ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ క్లయింట్స్‌లో ఫోర్టిస్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, బీఓబీ, హెచ్డీఎఫ్సీ, పేటీఎం, స్నాప్‌డీల్ కంపెనీలు ఉన్నాయి.