breaking news
Bee Farm
-
మీరేం హామీ పత్రాలిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమని హామీ పత్రాలు తీసుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా తీసుకోవడం తప్పేమీ కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరమని టీపీసీసీ నాయకత్వం అంటుంటే క్షేత్రస్థాయిలో మాత్రం మరోరకమైన అభిప్రాయం వినిపిస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసుకుంటూ కష్టనష్టాలను ఎదుర్కొంటూ వస్తుంటే చిన్న పదవుల కోసం పోటీ చేయాలంటే తాము అఫిడవిట్ ఎందుకివ్వాలనే చర్చ మండల స్థాయి నేతల్లో నడుస్తోంది. అయినా పెద్దలకు ఓ పద్ధతి, మాకో పద్ధతి ఎలా ఉంటుందని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ హామీ పత్రాలిచ్చి బీఫారాలు తీసుకున్నారని, పార్టీ మారి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా అఫిడవిట్లు అడగటం తమను అవమానపర్చడమేనని, నైతికంగా బలహీనం చేస్తుందని, ప్రత్యర్థి పార్టీలు కూడా దీన్ని వేరే విధంగా ప్రచారం చేస్తాయని వారంటున్నారు. పార్టీ మారడం లేదని ముందే మండల, జిల్లా నాయకులకు హామీ పత్రాలివ్వడం తమను అవమానపర్చుకోవడమేనని, అలాంటప్పుడు ఇన్నాళ్లు తాము పార్టీ కోసం చేసిన సేవకు గుర్తింపు ఏదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై నమ్మకం లేకనే పార్టీ హామీ పత్రం తీసుకుందని, పార్టీకే నమ్మకం లేనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఏం సమాధానం చెప్తారని కింది స్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరం.. క్షేత్రస్థాయి నేతలు హామీ పత్రం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీపీసీసీ నాయకత్వం చెబుతోంది. చాలా చోట్ల గ్రామస్థాయి కార్యకర్తలే ఈ ప్రతిపాదనలు తీసుకువచ్చారని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని టీపీసీసీ ముఖ్య నేతలు చెపుతున్నారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఎవరూ అడగకుండానే తాను గెలిచినా పార్టీ మారబోనని ప్రజలకు అఫిడవిట్ ఇచ్చారని, అలా ఇవ్వడం ద్వారా పోటీ చేస్తున్న వారిలో జవాబుదారీతనం పెరుగుతుందని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన సమాచారం అఫిడవిట్ రూపంలో ఎలా ఇస్తామో ఇది కూడా అంతేనని, గతంలో మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి కూడా పార్టీ హామీ పత్రాలు తీసుకుందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఇది అత్యవసరమని, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై చర్చ చేసేందుకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే భిన్నాభిప్రాయాలకు తావిస్తోన్న ఈ అఫిడవిట్ విధానం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సిందే..! -
బిట్‌శాట్‌తో బంగారు బాట..
అందుబాటులో ఉన్న కోర్సులు బిట్‌శాట్-2015 ద్వారా బిట్స్ పిలానీ- పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో 2015-16 విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశించవచ్చు. బీఈ (ఆనర్స్), బీఫార్మ్ (ఆనర్స్), ఎంఎస్సీ (ఆనర్స్), ఎంఎస్సీ (టెక్) కోర్సులున్నాయి. బిట్స్ పిలానీ క్యాంపస్‌లు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు ప్రముఖ కేంద్రాలుగా గుర్తింపు సాధించాయి. ఇంజనీరింగ్‌కు బెస్ట్ ఇంటర్ ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఐఐటీల తర్వాత నిట్లు, ఐఐఐటీలు, బిట్స్ పిలానీ సంస్థలకు ప్రాధాన్యమిస్తారు. క్యాంపస్‌ల వారీగా బీఈ ఆనర్స్ కోర్సుకు సంబంధించి అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లు.. పిలానీ: కెమికల్, సివిల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్. కేకే బిర్లా గోవా క్యాంపస్‌లో కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ బ్రాంచ్‌లున్నాయి. హైదరాబాద్ క్యాంపస్‌లో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాంచ్‌లున్నాయి. అర్హతలు: 2014లో ఇంటర్ పూర్తిచేసిన వారు, 2015లో పరీక్ష రాయబోయే వారు బిట్‌శాట్ రాసేందుకు అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో కనీసం 60 శాతం చొప్పున మార్కులు సాధించి ఉండాలి. మొత్తంమీద 75 శాతం మార్కులుండాలి. ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరం. ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సులో ఆయా బోర్డులు నిర్వహించే పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశం కల్పిస్తారు. పరీక్ష విధానం ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ రూపంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు ఉంటుంది. మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ఆ లోపు మొత్తం 150 ప్రశ్నలకు సమాధానం ఇస్తే.. అదనంగా మరో 12 ప్రశ్నలను రాసేందుకు అవకాశముంది. సబ్జెక్ట్ పశ్నలు మార్కులు పార్ట్-1 ఫిజిక్స్ 40 120 పార్ట్-2 కెమిస్ట్రీ 40 120 పార్ట్-3 ఎ) ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ 15 45 బి) లాజికల్ రీజనింగ్ 10 30 పార్ట్-4 మ్యాథ్స్ 45 135 ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్: డిఫరెన్షియల్ కాలిక్యులస్, స్ట్రెయిట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, కాంప్లెక్స్ నంబర్స్, బైనామియల్ థీరమ్, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, డిటర్మినెంట్స్ అంశాలు ముఖ్యమైనవి. ఫిజిక్స్: హీట్ అండ్ థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం, వేవ్ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఆప్టిక్స్, రొటేషనల్ మోషన్, వర్క్, పవర్, ఎనర్జీ చాప్టర్లు ముఖ్యమైనవి. కెమిస్ట్రీ: కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, మోల్ కాన్సెప్టు, బయోమాలిక్యూల్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, హైడ్రోకార్బన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కైనటిక్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలు కీలకమైనవి. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్: ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్, వొకాబ్యులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, కంపోజిషన్లపై ప్రశ్నలు ఉంటాయి. ఇతర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలతో పోల్చితే రీజనింగ్ కొత్త అంశం. ఇందులో వెర్బల్‌కు సంబంధించి అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్ కంప్లీషన్, లాజిక్ డిడక్షన్, చార్ట్ లాజిక్ అంశాలు, నాన్ వెర్బల్ నుంచి ప్యాటర్న్ పెర్సెప్షన్, ఫిగర్ ఫార్మేషన్ అండ్ అనాలిసిస్, పేపర్ కటింగ్, ఫిగర్ మ్యాట్రిక్స్, రూల్ డిటెక్స్న్ అంశాలపై ప్రశ్నలుంటాయి. కాస్త శ్రమిస్తే ఇందులో పూర్తిస్థాయి మార్కులు పొందొచ్చు. టిప్స్ గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే సీబీఎస్ఈ, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని అంశాలపై పట్టుసాధిస్తే అత్యధిక మార్కులు సాధించవచ్చని అర్థమవుతోంది. ప్రశ్నలు కాన్సెప్టు లేదా అప్లికేషన్ ఆధారంగా ఉంటున్నాయి. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు వస్తున్నాయి. అధ్యయనం చేసేటప్పుడు ముఖ్యమైన కాన్సెప్టులను, సూత్రాలను ఒక నోట్స్‌లో రాసుకుంటే మంచిది. ఇంటర్, జేఈఈ మెయిన్ పరీక్షలు పూర్తయిన తర్వాత బిట్‌శాట్ ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వెబ్సైట్లలో ఆన్లైన్ శాంపిల్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి.