breaking news
BCCI Chairman
-
బీసీసీఐ చైర్మెన్‌గా రాజీవ్ శుక్లా..?
భారత క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెర్మైన్ పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. 70 ఏళ్ల నిండిన తర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఈ ఏడాది జూలై 19తో బిన్నీ70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలో రోజర్ తనంతట తానే అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు క్రిక్బ్లాగర్కు తెలిపాయి. అతని స్దానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రిక్‌బ్లాగర్ తమ కథనంలో పేర్కొంది. ఈ విషయంపై బోర్డులో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 1983 వరల్డ్‌కప్ విజేతైన రోజర్ బిన్నీ.. 2022లో గంగూలీ స్ధానంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఇక రాజీవ్ శుక్లా చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మెన్‌గా కూడా పనిచేశారు. త్వరలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో శుక్లా ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.చదవండి: IPL 2025 Qualifier 2: పంజాబ్‌కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్? -
'మినీ ఐపీఎల్ ఆలోచన లేదు'
కోల్ కతా: చాంపియన్ లీగ్ (సీఎల్) ట్వంటీ 20 ను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని సోమవారం స్పష్టం చేశారు. గత వారం చాంపియన్స్ లీగ్ టి20ని పక్కనపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనన్నారు. ప్రస్తుతం తాము చాంపియన్ లీగ్ కు మరింత మెరుగులు దిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఠాకూర్ పేర్కొన్నారు. క్రికెట్ లో ఉన్న ఆదరణను బట్టి ఇప్పటివరకూ చాంపియన్ లీగ్ ను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియాలలో మాత్రమే నిర్వహించామన్నారు. అయితే మరిన్ని దేశాలలో చాంపియన్ లీగ్ ను విస్తరించి క్రికెట్ కు మరింత వన్నె తేవాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. 'మేము ఇప్పటికీ సీఎల్ ట్వంటీ 20కే కట్టుబడి ఉన్నాం. త్వరలో దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఐపీఎల్ దిగ్విజయంగా ముగిసింది. మినీ ఐపీఎల్ పై ఎటువంటి ఆలోచన లేదు. ఇక సీఎల్ ట్వంటీ 20 పైనే మా దృష్టి' అని ఠాకూర్ స్పష్టం చేశారు.చాంపియన్ లీగ్ కు ముగింపు పలుకుతున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. ఆయా దేశాల్లోని టి20 లీగ్ విజేతలతో గత ఆరేళ్లుగా సీఎల్‌టి20 జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఈవెంట్ స్థానంలో సెప్టెంబర్‌లో కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. -
సీఎల్ టి20కి ఫుల్స్టాప్
మరో కొత్త లీగ్‌కు శ్రీకారం ఐపీఎల్ చైర్మన్ శుక్లా వెల్లడి న్యూఢిల్లీ : అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోతున్న చాంపియన్స్ లీగ్ టి20ని పక్కనపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఈ ఈవెంట్ స్థానంలో సెప్టెంబర్‌లో కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఆయా దేశాల్లోని టి20 లీగ్ విజేతలతో గత ఆరేళ్లుగా సీఎల్‌టి20 జరుగుతున్న విషయం తెలిసిందే. ‘చాంపియన్స్ లీగ్ టి20ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఆ స్థానంలో ప్రత్నామ్నాయ లీగ్‌ను జరపాలని భావిస్తున్నాం. బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, నేను కలిసి ఏదైనా విభిన్నంగా జరపాలని ఆలోచిస్తున్నాం. ఐపీఎల్ ముగిశాక ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే మా ఆలోచనలు ప్రణాళికా దశలోనే ఉన్నాయి’ అని శుక్లా అన్నారు. 2009లో ప్రారంభ సీఎల్ టి20 నుంచి గతేడాది వరకు ఈ ఈవెంట్ టీవీ రేటింగ్స్ దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. -
అదే జోడీ... ఇప్పుడిలా కొత్తగా