Baloon Festival
-
గప్‌చుప్‌గా ‘బుగ్గల ప్రపంచ కప్’! విన్నర్ ఎవరంటే..
Baloon World Cup 2021: బుగ్గలతో(బెలూన్స్)తో ఆడుకోవడం పిల్లలకు సరదా. మరి పెద్దవాళ్లకో!. కొందరికి ఉండొచ్చు కూడా. అలాంటి ఆసక్తి గనుక మీకు ఉంటే.. ఛాంపియన్ అయ్యేందుకు అవకాశమూ ఉంది. ఎందుకంటే.. ప్రపంచంలో మొట్టమొదటి ‘బెలూన్ వరల్డ్ కప్’ను ఈ మధ్యే విజయవంతంగా నిర్వహించారు. ఇకపై క్రమం తప్పకుండా నిర్వహిస్తారంట!. స్పెయిన్ టర్రగోనా సిటీలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఈ టోర్నీ జరిగింది. గప్‌చుప్‌గా పోయిన వారంలో.. వారంపాటు మొట్టమొదటి బెలూన్ వరల్డ్ కప్‌ను నిర్వహించారు. మొత్తం 32 దేశాలు ఇందులో పోటీపడగా.. జర్మనీ, పెరూలు ఫైనల్‌కి చేరాయి. ఫైనల్ పోరులో పెరూకి చెందిన ఫ్రాన్సెస్కో డె లా క్రూజ్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. దానికింద సరదా కామెంట్లూ కనిపిస్తున్నాయి. PERÚ 🆚 ALEMANIA Primera FINAL de #BalloonWorldCup pic.twitter.com/3oFqZxFYZ5 — Balloon World Cup (@BalloonWorldCup) October 14, 2021 ఎలా ఆడతారంటే.. Balloon Keep Up.. సింపుల్.. బెలూన్ కిందపడకుండా ఆడాలి. కిందపడితే ప్రత్యర్థి వ్యక్తికి ఒక పాయింట్ వెళ్తుంది. 8X8 మీటర్ కోర్టులో ఈ గేమ్‌ను నిర్వహిస్తారు. కాకపోతే లివింగ్ రూం లాంటి ఆ కోర్టులో కారు, సోఫా, కుర్చీలు.. ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి. మరి బెలూన్ పగిలిపోతే పరిస్థితి ఏంటి? అని మాత్రం అడగకండి ప్లీజ్!. Revive los últimos segundos de la final que ha coronado a Perú como campeona del mundo! Enhorabuena @efedufran #BalloonWorldCup pic.twitter.com/cY36WikPTp — Balloon World Cup (@BalloonWorldCup) October 14, 2021 పుట్టింది ఇలా.. బార్సిలోనా సాకర్ ప్లేయర్ గెరార్డ్ పిక్యూ, స్పానిష్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇబయ్ లానోస్‌లు ఈ టోర్నీని నిర్వహించారు. అయితే ఈ ప్రపంచ టోర్నీ పుట్టింది టిక్‌టాక్‌లోని సరదా వీడియోల ఆధారంగా!. యస్.. ఓరేగావ్(యూఎస్)కు చెందిన అర్రెన్డోండో ఫ్యామిలీ టిక్‌టాక్‌లో సరదాగా గేమ్స్ వీడియోలను పోస్ట్ చేసేది. ఆ వీడియోల ఆధారంగా గెరార్డ్ పిక్యూ, ఇబయ్ లాబీ లానోస్‌లు ఈ టోర్నీని రూపొందించారు. అంతేకాదు గెరార్డ్ పిక్యూ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను కొత్త రూపంలో మార్చే ప్రయత్నంలో ఉన్నాడు కూడా. Ziggy is just waiting for the Dog Balloon World Cup pic.twitter.com/Jb6sOZqJ7G — shitscaredmum 💙 (@shitscaredmum) October 18, 2021 చదవండి: సంచలన ఆరోపణలు: ఆ బాక్సింగ్ మ్యాచ్‌లు ఫిక్సింగ్? -
కొండ పండుగకు సర్వం సిద్ధం
హిల్ ఫెస్టివల్‌కు నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి హాజరయ్యే పర్యాటకులు, భక్తులకు ఆహ్లాదం అందించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన విశాల మైదానంలో సభాప్రాంగణం, ఫుడ్‌కోర్టు, పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ఫ్లవర్ షో, ఎర్రచెరువులో బోటుషికారు, మైదాన ప్రాంతంలో హాట్ బెలూన్ రైడింగ్, పారాసైలింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాలు ప్రత్యేకఅనుభూతి కలిగించనున్నాయి. గుంటూరు, నరసరావుపేట రూరల్: దేశంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న హిల్ఫెస్టివల్కు కోటప్పకొండలో అన్ని ఏర్పాట్లూ పూర్తఅయ్యాయి. కోటప్పకొండను అధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి పరిచేదానిలో భాగంగా హిల్ఫెస్టివల్ను కోటప్పకొండలో రెండు రోజల పాటు నిర్వహిస్తున్నారు. హిల్ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువ భాగంలోని విశాలమైన మైదానంలో సభాప్రాంగణం, ఫుడ్‌కోర్డు, పలు రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. లేపాక్షి స్టోర్స్, రాజస్థాన్ ఆర్ట్స్, పెయింటింగ్ ఎగ్జిబిషన్, శాండ్ ఆర్ట్స్, డ్వాక్రా బజార్‌ను సిద్ధం చేశారు. జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ప్లవర్ షో కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. చిలకలూరిపేట రోడ్డులో హెలీకాప్టర్ రైడింగ్‌కు హెలీప్యాడ్‌ను, ఎర్రచెరువులో బోటుషికారు, మైదాన ప్రాంతంలో హాట్ బెలూన్ రైడింగ్, ఫారా గ్రైడర్, ఎటివి రైడ్, పారాసైలింగ్, ట్రెక్కింగ్, రాప్టింగ్, హార్స్ రైడింగ్, ఒంటే సవారీలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనున్నాయి. ఎర్రచెరువులో బోటు షికారుకు ప్రత్యేక బోట్లను రప్పించారు. ఫెస్టివల్‌కు వచ్చే వీఐపీల కోసం ఎర్రచెరువు కట్టపై ప్రత్యేక గుడారాలను ఏర్పాటుచేశారు. అలాగే పండుగ జరిగే రెండు రోజుల పాటు ఐదు రాష్ట్రాల కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. దాదాపు 210 మంది కళాకారులు ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. మొదటిరోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సీనీసంగీత విభావరిలో గాయకులు వందేమాతరం శ్రీనివాస్ బృందం, జబర్దస్ట్ బృందంచే హాస్యప్రదర్శన, పద్యాలు, పాటలు, రింగ్ డాన్స్, ఒరిస్సా రణపా డాన్స్, ఉత్తరప్రదేశ్ కళాకారుల చూ డాన్స్, మహారాష్ట్ర కళాకారుల లవణి డాన్స్, శివకుమార్ మిమిక్రీ ఏర్పాటుచేశారు. గ్రామీణ ఆటల పోటీలు, ఎమ్యూజ్మెంట్ పార్క్ యువతకు ఆహ్లదాన్ని కలిగించనున్నారు. పర్యాటకులను అబ్బురపరిచేలా బాణసంచాను వెలిగించనున్నారు. -
ఆంక్షల నడుమ ఎగిరిన బెలూన్
విశాఖపట్నం, అరకులోయ/డుంబ్రిగుడ/అనంతగిరి: అరకులోయలో బెలూన్ ఫెస్ట్‌వల్ కార్యక్రమాన్ని గత ఏడాది నుంచి ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బెలూన్ జరుగుతున్నాయి. గత ఏడాదిలో బెలూన్ ఫెస్ట్‌వల్‌కు వర్షాల కారణం ప్రతికూల వాతవరణం సహకరించకపోవడం బెలూన్లు గాలిల్లోకి ఎగరలేదు. దీంతో పర్యాటకులు, స్థానిక గిరిజనులు నిరాశ చెందారు. ఈ ఏడాదిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ బెలూన్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం 4 కోట్ల రుపాయలను వెచ్చిస్తుంది. సుమారు 11 గంటల సమయం వరకు మంచు కురువడంతో ఆలస్యంగా బెలూన్ ఫెస్ట్‌వల్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ ఫెస్టివల్‌ను ప్రారంభించి మొదటి బెలూన్లోరిజన విద్యార్థులతో కలసి గాల్లోకి ఎగిరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో సందర్శకుల కంటే పోలీసులే అధికంగా కనిపించారు. మొదటి రోజు గందరగోళం... మొదటిరోజు ప్రారంభమైన బెలూన్ ఫెస్టివల్ కార్యక్రమంలో గందరగోళం సాగింది. అసలు ఏవిధంగా బెలూన్లను ఎగరవేస్తారు. మొదటిరోజు ఎంతమంది పాల్గొంటున్నారో అధికారులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలు పర్యాటకులు భారీగా అరకులోయ చేరుకున్నారు. బెలూన్‌లో ఎగిరేందుకు సరదాపడిన పర్యాటకులకు సమాచారం అందించేవారు కూడా కరువయ్యారు. స్థానిక గిరిజనులు మాత్రం అంతంతమాత్రంగానే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు. గిరిజనులకు చేదు అనుభవం బెలూన్ ఫెస్టివల్ తిలకించేందుకు వచ్చిన స్థానిక గిరిజనులకు పోలీసుల ఆంక్షలతో చేదు అనుభవం ఎదురైంది. ఫెస్టివల్ జరిగే ప్రదేశంలో ఎక్కువసేపు ఉండకూడదంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి పంపే కార్యక్రమం చేపట్టారు. దీంతో ఇటువంటి కార్యక్రమంతో ఎవరిని ఆనందింపజేస్తున్నారని పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. నైట్ షో బెలూన్ ఫెస్ట్‌వల్ సాయంత్రం 6 నుంచి గంటల నుంచి 8 గంటల వరకు బెలూన్ నైట్ షోను సందర్శకులు కోరకు ఏర్పాటు చేశారు. బెలూన్ ఫెస్ట్వల్లో పాల్గొనేందుకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నా వారికి వంద అడుగులు ఎత్తువరకు గాల్లోకి బెలూన్ ఎగరవేసి దించారు. పర్యాటకులు అధికంగా వచ్చి ఫెస్టివల్‌ను తిలకించారు. కొంతసేపు వరకు మాత్రము బెలూన్లు ఎగరలేదు. తరువాత ఎగరడంతో సందర్శకులు ఆనందపడ్డారు. 15 దేశాల బెలూన్లు సాక్షి, విశాఖపట్నం: ఈసారి ఫెస్టివల్లో భారత్, ఇంగ్లండ్, థాయ్‌లాండ్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, మలేసియా, నెథర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, బెల్జియం, ఇటలీ, స్లోవేకియా, బ్రెజిల్ తదితర 15 దేశాలకు చెందిన 21 బెలూన్లు పాల్గొన్నాయి. వీటిలో క్లోన్ (స్లోవేకియా), హ్యాపీచికెన్ (నెథర్లాండ్స్), బేబీకార్ (బ్రెజిల్), బీ (బ్రెజిల్) బెలూన్లు జోకర్, బేబీకార్, తేనెటీగ, గుడ్డు ఇలా విభిన్న ఆకృతుల్లో తయారు చేసినవి కూడా ఉన్నాయి. తొలిరోజు ఉదయం 18, సాయంత్రం మూడు బెలూన్లను గాలిలోకి పంపారు. గంటకు 3000 హార్స్పవర్ కలిగిన గ్యాస్‌ను వెలిగిస్తూ గాల్లోకి తీసుకెళ్లారు. ఇందుకు ఒక్కో బెలూన్ గంటకు 120 కిలోల గ్యాస్‌ను ఖర్చు చేస్తోంది. ఒక్కో బెలూన్‌లో సామర్థ్యాన్ని బట్టి 5–8 మంది వరకు ప్రయాణించగలిగారు. ఒక్కో బెలూన్‌లో ఒక్కో పైలట్, మరో కో–పైలెట్ ఉన్నారు. ఈ బెలూన్లు 3 నుంచి 5 వేల అడుగుల ఎత్తులో అరకులోయ పరిసరాల్లో గంటకు పైగా విహరించాయి. అరకు ఎంతో అనుకూలం : మంత్రి అఖిలప్రియ అరకులోయ/డుంబ్రిగుడ/అనంతగిరి: బెలూన్ ఫెస్ట్‌వల్ నిర్వహించేం దుకు అరుకులోయ ప్రాం తం అనుకూలంగా ఉంద ని పర్యాటకశాఖ మంత్రి భూమ అఖిలప్రియ అన్నారు. బెలూన్ ఫెస్టివల్‌కు హాజరైన విదేశీయుల కోసం మాడగడలో సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రాలను ఆమె సందర్శించారు. అనంతరం విదేశీయులతో కలసి భోజనం చేశారు. అనంతరం అమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అరకు అందాలు విదేశీయులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, దేశంలోనే బెలూన్ ఫెస్ట్‌వల్ నిర్వహించేందుకు అరకు వేదికగా కావడం ఆనందంగా ఉందని అన్నారు. లాటరీ ద్వారా బెలూన్ ఫెస్ట్వల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్‌లో ఈ కార్యక్రమం పర్మనెంట్‌గా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బెలూన్‌లో ఎగిరే అవకాశమే రాలేదు బెలూన్‌లో ఎగిరేందుకు అవకాశం రాకపోవడంతో నిరాశ పడ్డాం. కుటుంబ సమేతంగా అరకులోయ ముఖ్యంగా బెలూన్ ఫెస్ట్‌వల్ కార్యక్రమం ఉందని తెలిసి వచ్చాను. అయితే ఇక్కడ పాల్గొనేందుకు అవకాశం లేకపోవడం నిరాశపరిచింది. అసలు ఆన్లైన్లో కూడా బెలూన్ ఫెస్ట్‌వల్‌కు సంబంధించ షెడ్యూల్ సమాచారం లేకపోవడం దారుణం. – శ్రీనివాస్, విశాఖపట్నం గిరిజనులకు ఏం ఉపయోగం అరకులోయలో బెలూన్ ఫెస్ట్‌వల్ నిర్వహించడం వల్ల గిరిజనులకు ఎటువంటి ఉపయోగం లేదు. గిరిజన గ్రామాల్లో తాగునీరు, విద్య, వైద్యం వంటి సమస్యలతో గిరిజనులు నిత్యం నరకయాతన అనుభవిస్తుంటే బెలూన్ ఫెస్ట్‌వల్ పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు. – ఎం. సునీల్,గిరిజన యువకుడు -
నిరాశలో బెలూన్ ఫెస్టివల్ సందర్శకులు