breaking news
Baby Akshara
-
మెదక్: వెళ్లిపోయావా అక్షర!
మెదక్ : జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తీవ్ర వర్షాలు.. గుంతలు, బురదతో అధ్వానంగా మారిన రోడ్డు ఓ పదేళ్ల బాలిక జీవితాన్ని బలిగొంది. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రోడ్డు కారణంగా ఆలస్యమై ఆ చిన్నారి కన్నుమూసింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మహ్మద్‌నగర్ తండా పంచాయతీ పరిధిలోని అందుగులపల్లి(పెద్దమ్మగడ్డ తండా)లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు తండాకు వెళ్లే మట్టి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి బురదతో నిండిపోయింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా సోమవారం తండాకు చెందిన కులబాబు, రేణుక దంపతుల కూతురు అక్షర (10) తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను బైక్‌పై ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. ఈ క్రమంలో బురదలో బైక్ ముందుకు కదలలేదు. దీంతో పాపను ఎత్తుకుని ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో చిన్నారి మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. అధ్వానంగా మారిన తండా రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: రీల్స్ కోసం ఎచ్చులకు పోయి.. విషాదం -
18 రోజుల పసికూనతో బాహుబలి ప్రభంజనం..
ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బాహుబలి.. భారతీయ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల కిందట విడుదలైన బాహుబలి ఫస్ట్ లుక్ లో.. శివగామి(రమ్యకృష్ణ) చేతిలో పొద్దికగా ఒదిగి, భవిష్యత్తును శాసించబోతున్నంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన ఆ పసికూన గురించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ కాకుండా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఒకేఒకరు ఈ పసికునే కావడం మరో విశేషం! బాహుబలి: ది బిగినింగ్ లో శివగామి.. మహేంద్ర బాహుబలి (శివుడు)ని ఎత్తుకుని నదిలో ఉన్నప్పుడు చూపించింది, ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా శివగామి చేతి వేలిని పట్టుకున్నప్పుడు చూపించింది, బాహుబలి:కన్ క్లూజన్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లలో.. మహేంద్ర బాహుబలిగా శివగామి పసికందును ప్రజలకు చూపించింది, కట్టప్ప తన తలపై కాలును పెట్టుకున్నప్పుడు చూపించిన పసికందునే! అయితే ఈ బుజ్జాయి నిజానికి అబ్బాయి కాదు.. అమ్మాయి! పేరు అక్షర! బాహుబలిలో నటించే సమాయానికి అక్షర వయసు జస్ట్ 18 రోజులు మాత్రమే! ఇంతకీ ఈమెకు బాహుబలిలోకి ఎలా తీసకున్నారంటే.. కేరళలోని అతురపల్లి జలపాతాల దగ్గర బాహుబలి షూటింగ్ జరిగినప్పుడు స్థానికుడైన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆ సినిమాకు పనిచేశాడు. ఆ సమయంలోనే వల్సన్ దంపతులకు అక్షర జన్మించింది. బాహుబలి ప్రొడక్షన్ లో కీలక పాత్రపోశించిన శ్రీవల్లి ద్వారా ఆ పాప గురించి దర్శకుడు రాజమౌళికి తెలిసింది. నిజానికి అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు పసికందులుగా చూపించేటప్పుడు గ్రాఫిక్స్ ను వినియోగించాలని అనుకున్న జక్కన్న.. అక్షరను చూశాక మనసుమార్చుకున్నాడు. అలా ఆమె సినిమాలో కాలుమోపడం, ఫస్ట్ లుక్ లోనే ప్రభంజనం సృష్టించడం, ఆ తర్వాతి విషయాలు తెలిసినవే. కాగా, ప్రస్తుతం కేరళలోనే చదువుకుంటున్న అక్షర వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది..