breaking news
Australian Open championship
-
Australian Open 2024: విన్నర్ సినెర్...
మెల్బోర్న్: సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)పై తాను సాధించిన విజయం గాలివాటమేమీ ఇటలీ యువతార యానిక్ సినెర్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నాలుగో సీడ్ సినెర్ చాంపియన్‌గా అవతరించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సినెర్ 3–6, 3–6, 6–4, 6–4, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. తద్వారా 1976 తర్వాత పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఇటలీ ప్లేయర్ గా, ఆ్రస్టేలియన్ ఓపెన్ సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 3 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సినెర్ తొలి రెండు సెట్లు కోల్పోయినా ఆందోళన చెంద లేదు. మూడో సెట్ నుంచి సినెర్ నెమ్మదిగా లయలోకి వచ్చాడు. కెరీర్లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న మెద్వెదెవ్పై ఒత్తిడి తెచ్చాడు. మూడో సెట్ పదో గేమ్‌లో, నాలుగో సెట్ పదో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌లను బ్రేక్ చేసిన సినెర్ రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఆరో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. విజేత సినెర్‌కు 31 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 17 లక్షల 25 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఆస్ట్రేలియా ఓపెన్ లో రఫెల్ నాదల్ ఓటమి
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఇంటి ముఖం పట్టాడు.మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నాదల్ 6-2,6-0, 7-6(7-5) తేడాతో బెర్డిచ్ చేతిలో ఓటమి పాలైయ్యాడు. ఏ దశలోనూ బెర్డిచ్ దాటికి తట్టుకోలేకపోయిన నాదల్ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆదిలోనే రోజర్ ఫెదరర్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో నాదల్ పై ఆశలు భారీగా ఉన్నాయి. అయితే బెర్డిచ్ మాత్రం అసామాన్య ప్రతిభ కనబరుస్తూ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లాడు. వరుస రెండు సెట్లను అవలీలగా గెలిచిన బెర్డిచ్ మూడో సెట్ ను గెలవడానికి తీవ్రంగా శ్రమటోడ్చాల్సి వచ్చింది. మూడో గేమ్ టై బ్రేక్ కు దారి తీసినా.. బెర్డిచ్ చివరికంటూ పోరాడి మూడో సెట్ ను కూడా కైవశం చేసుకున్నాడు.