breaking news
augmented
-
స్కిన్ స్పెషలిస్ట్! ఒక్క ఫొటో చాలు.. మరింత స్మార్ట్‌గా గూగుల్ లెన్స్
గూగుల్ లెన్స్ మరింత స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు మీ చర్మం కండీషన్‌ను పరిగట్టేస్తుంది. ఒక్క ఫొటో తీసి పెడితే చాలు స్కిన్ కండీషన్ ఏంటో చెప్పేస్తుంది. మన చర్మానికి ఏదైనా సమస్య ఉండి దాన్ని ఏమని పిలుస్తారో తెలియని సందర్భంలో దానికి సంబంధించిన ఫొటోను గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే ఆ రుగ్మత పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలియజేస్తుంది. అయితే ఇది యూజర్ల సమాచారం కోసం మాత్రమే. దీన్ని వ్యాధి నిర్ధారణగా పరిగణించకూడదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. సమస్య ఏంటో చెప్పేస్తుంది.. శరీర భాగాల్లో చర్మంపై ఎక్కడైనా ఏదైనా సమస్యగా అనిపిస్తే దాన్ని ఫొటో తీసి గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేస్తే దానికి సంబంధించిన అలాంటి విజువల్ సమాచారం వస్తుంది. ఉదాహరణకు చర్మంపై దద్దుర్లు, వాపు, వెంట్రుకలు రాలిపోవడం వంటి వాటి గురించి గూగుల్ లెన్స్ సాయంతో తెలుసుకోవచ్చు. మరింత స్మార్ట్‌గా.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ) సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా గూగుల్ లెన్స్ స్మార్ట్‌గా మారుతోంది. ముందుగా గూగుల్ లెన్స్ యూజర్లకు పేరు తెలియని ఏవైనా సాధారణ వస్తువులను విశ్లేషించడంలో సహాయపడుతుంది. అలాగే వాక్యాలను కూడా అనువదించే సామర్థ్యాన్ని ఇందులో జోడించారు. మనకు తెలియని వాక్యాలను గూగుల్ లెన్స్ కెమెరా ద్వారా ఫొటో తీసి మనకు కావాల్సిన భాషలోకి వాటిని అనువదించుకోవచ్చు. వీటితోపాటు గూగుల్ మ్యాప్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఆర్ శక్తిని జోడిస్తోంది గూగుల్. దీని సాయంతో మన చుట్టూ ఉన్న కొత్త స్థలాలను కనుగొనడానికి, యూజర్లు తమకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్‌లు వంటివి శోధించవచ్చని గూగుల్ పేర్కొంది. -
అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్..
అమెరికాః కళ్ళజోడు పెట్టుకుంటే చాలు ప్రపంచాన్ని మన ముందుంచే టెక్నాలజీల్లో ఇప్పటివరకూ వర్చువల్ రియాలిటీదే మొదటి స్థానం. దూరంగా ఉన్న అద్భుతాలను కళ్ళముందే ఉన్నట్లుగా తిలకించే అత్యద్భుత పరిజ్ఞానం అది. ఇప్పుడు అనేక సంస్థలు ఈ వర్చువల్ రియాలిటీ పరికరాలను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరో అడుగు ముందుకేసి మరి కాస్త పరిజ్ఞానాన్ని జోడించి మనిషి జీవితంలో భాగమయ్యే ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అమెరికా నేవీ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. ఇది ఓ ఐరన్ మ్యాన్ సామర్థ్యాన్ని అందిస్తుందని యూఎస్ నేవీ చెప్తోంది. నిజ జీవితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కనిపించే దృశ్యాలను చూసి ఆనందించే అవకాశం వర్చువల్ రియాలిటీలో ఉంటే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మాత్రం కనిపించే దృశ్యాల సారాంశాన్ని, చరిత్రను సైతం తెలియజేస్తుంది. ప్రస్తుతం అమెరికా నేవీ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. నీటి అడుగు భాగంలో సంచరించేందుకు డైవర్స్ దీన్ని వాడినప్పుడు.. వారికి ఐరన్ మాన్ చిత్రంలా వాస్తవిక సామర్థ్యాన్ని కలిగించేట్లు చేస్తుందని యూఎస్ నేవీ ఇంజనీర్ డెన్నిస్ గ్లఘెర్ చెప్తున్నారు. పనామా సిటీ డివిజన్ లోని నేవల్ సర్ఫేస్ వార్ఫేర్ సెంటర్ లో గల్లఘెర్ సహా 20 మంది బృందం ఈ అభివృద్ధిలోని డైవర్స్ ఆగ్మెంటెడ్ విజన్ డిస్ప్లే కు సంబంధించిన మొదటి దశను పూర్తి చేశారు. ఇందులో పొందుపరిచిన హై రిజల్యూషన్ సిస్టమ్ ద్వారా డైవర్స్ కు సెక్టార్ సోనార్, టెక్ట్స్ మెసేజ్, ఫొటోలు, డయాగ్రమ్ లు, వీడియోలను వాస్తవ కాలంలో సందర్శించే అవకాశం ఇస్తుంది. తాము అభివృద్ధి పరిచిన ఈ సాధనం ద్వారా నీటిలో మునిగిపోయిన ఓడలు, కూలిపోయిన విమానాలు వంటి వాటిని సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుందని, వాటిని వెతికేందుకు వెళ్ళే బృందాలకు ఈ హెల్మెట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని, అత్యంత సహాయ పడుతుందని నేవీ చెప్తోంది. ఈ అక్టోబర్ నాటికి హెల్మెట్ రూప కల్పన పూర్తిచేయడంతోపాటు.. నీటిలో పరీక్షలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్లు నేవీ తెలిపింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ లోని అధిక రిజల్యూషన్ సోనార్ ద్వారా సముద్రంలోని, నీటి అడుగు భాగంలో వీడియోలు తీసుకోవడంతోపాటు, అనేక సూక్ష్మ విషయాలను కూడ పరిశీలించ వచ్చునని, ఇది అనేక విధాలుగా డైవర్లకు సహాయ పడుతుందని నేవీ వివరిస్తోంది.