breaking news
Assistant Librarian
-
లైబ్రరీ అసిస్టెంట్ వికృత చేష్టలు.. దంచికొట్టిన విద్యార్థిని బంధువులు
సాక్షి, పెడన: పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ విద్యార్థినిని వికృత చేష్టలు, మాటలతో లైంగిక వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లి, బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన పల్లపాటి శ్రీకృష్ణ(47) పెడన పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ పాఠశాల లో ఏడో తరగతి చదువుతున్న బాలిక హైస్కూల్లో జరిగే గ్రంథాలయ తరగతులకు హాజరయ్యేది. గత రెండు రోజులుగా ఇంటి వద్ద ఏడుస్తూ ఉండటం గమనించిన తల్లి ఆరా తీయడంతో బాలిక పాఠశాలలో శ్రీకృష్ణ తనను లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి దుర్గాంబిక తన బంధువులతో కలసి సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హెచ్ఎం గోపాలరావును నిలదీశారు. ఆయన శ్రీకృష్ణను పిలిచి విచారిస్తున్న సమయంలో బాలిక బంధువులు అకస్మాత్తుగా శ్రీకృష్ణపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పెడన ఎస్ఐ రవిచంద్ర పాఠశాలకు వెళ్లి శ్రీకృష్ణను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలిక తల్లి దుర్గాంబిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి జోగి రమేష్ బాలిక కుటుంబానికి మంత్రి పరామర్శ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సోమవారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలతో వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, సంబంధిత శాఖాధికారులు కూడా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలిక తల్లికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లైబ్రరీ అసిస్టెంట్‌పై చర్యలకు సిఫార్సు మచిలీపట్నం: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన పెడన జెడ్పీ స్కూల్ ల్రైబరీ అసిస్టెంట్ పల్లపాటి శ్రీకృష్ణపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసినట్లు కృష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదుపై డెప్యూటీ డీఈవోతో విచారణ జరిపించామన్నారు. శ్రీకృష్ణపై సర్వీసుపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా జెడ్పీ సీఈవోకు విచారణ నివేదికను పంపించామని పేర్కొన్నారు. -
ఉద్యోగాలు
అభ్యుదయ సహకార బ్యాంక్‌లో క్లర్క్ పోస్టులు అభ్యుదయ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఏసీబీఎల్).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. క్లర్క్: 125 అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య.. ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా... చివరి తేది: అక్టోబర్ 19 వెబ్సైట్: www.abhyudayabank.co.in ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం(ఐజీకేవీ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్/సైంటిస్ట్: 76 అసిస్టెంట్ లైబ్రేరియన్: 9 టెక్నికల్ అసిస్టెంట్: 6 నోటిఫికేషన్లో నిర్దేశించిన విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి. చివరి తేది: నవంబర్ 15 వెబ్సైట్: http://www.igau.edu.in ప్రవేశాలు ఎల్బీఎస్ఐఎంలో పీజీ డిప్లొమా న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎల్‌బీఎస్‌ఐఎం).. కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (జనరల్/ఫైనాన్స్) అర్హత: ఏదైనా డిగ్రీ. క్యాట్-2013లో అర్హత. ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.. చివరి తేది: డిసెంబర్ 14 వెబ్సైట్: www.lbsim.ac.in