breaking news
asia title
-
గోల్ఫర్ శివ్ కపూర్‌కు స్వదేశంలో తొలి ఆసియా టూర్ టైటిల్
భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ స్వదేశంలో తొలి ఆసియా టూర్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో ముగిసిన పానాసోనిక్ ఓపెన్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఫోర్ అండర్ 68 స్కోరుతో శివ్ కపూర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది శివ్ కపూర్‌కిది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా కెరీర్లో మూడోది. గత ఏప్రిల్‌లో అతను యెంగ్డెర్ హెరిటేజ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. 2005లో శివ్ కపూర్ తొలిసారి వోల్వో మాస్టర్స్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలిచాడు. -
'ప్రత్యర్థికి హారర్ మూవీ చూపించాను'
లండన్: వరుస బౌట్లలో విజయాలతో భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ దూసుకుపోతున్నాడు. ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో శుక్రవారం జరిగిన బౌట్లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడాడు. తన ప్రత్యర్థి సోల్డ్రాకు ఈ బౌట్ లో హారర్ మూవీ చూపించానంటూ వ్యాఖ్యానించాడు. అందుకే ఎనిమిది రౌండ్లుండగా మూడో రౌండ్ లోనే అతడి పని అయిపోయిందని చెప్పాడు. ఈ గెలుపు తనకు మరింత కిక్ ఇచ్చిందని మరో బౌట్ కు సిద్ధమని ప్రకటించాడు. విజేందర్ ఇచ్చే పంచ్‌లకు సోల్డ్రా ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఆరో బౌట్ గెలవడంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. సోల్డ్రా నుంచి ప్రతిఘటన ఎదురైనా, తన పంచ్ లతో మట్టి కరిపించి హారర్ సినిమా షో చూపించానని వ్యాఖ్యలుచేశాడు. అయితే జూన్ 11న ప్రపంచ బాక్సింగ్ ఆర్గరైజేషన్ వారు న్యూఢిల్లీలో ఆసియా టైటిల్ ను నిర్వహించనున్నారు. ఆ పోరులోనూ విజయం సాధించి స్వదేశంలో విజయాల ఖాతాను తెరవాలని ఆశపడుతున్నట్లు వివరించాడు.