ఆరోగ్యమిత్రలకు అండగా ఉంటాం: వైఎస్ జగన్
నెల్లూరు: ఆరోగ్యమిత్ర ఉద్యోగులను తొలగించడం అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చేస్తామని హామీయిచ్చారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చాక మాట తప్పుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యమిత్ర ఉద్యోగులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసాయిచ్చారు. సుమారు 2 వేల మంది ఆరోగ్యమిత్ర ఉద్యోగులను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రభుత్వం జీవో జారీచేసింది.