రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
అంబాలా: ఇటు మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న భారీ రైలు ప్రమాదం ఘటనపై అప్రమత్తమత్తమవుతున్నవేళ.. హర్యానాలోని అంబాలా రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేగింది.
రైల్వే స్టేషన్లో బాంబు అమర్చినట్లు మరి కొద్ది సేపట్లో అది పేలబోతోందన్నట్లు బుధవారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్టేషన్ కు చేరుకుని అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ముందు జాత్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణికులందరినీ బయటికి పంపించివేశాయి.
గుర్ దాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల దాడి సందర్భంలో సమీపంలోని రైల్వే ట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబాల్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ ను తేలికగా తీసుకోకూడదని భావించిన అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దాడిమరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.